![CM KCR Review Meeting On Covid Situation In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/9/kcr.jpg.webp?itok=0_f78aoD)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ వరంగల్‌ను హెల్త్‌సిటీగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కరోనా కేసులు అదుపులోకి వస్తున్నాయని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ, కోవిడ్ నిబంధలనలను పాటించాలని సూచించారు. కాగా, కరోనా ప్రభావిత ప్రాంతాలలో మరోసారి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు.
అదే విధంగా, ఈనెల 11, 12, 13 తేదీల్లో మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైద్య సిబ్బంది పర్యటించాలని పేర్కొన్నారు. ఈ నివేదికను 13 న జరిగే కేబినెట్ సమావేశంలో సమర్పించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment