సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని, దీనికి భయపడాల్సిన అవసరంలేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు.
మొదటి వేవ్ నుంచి పరిశీలిస్తే నాలుగు నుంచి ఆరు నెలల వ్యవధిలో కరోనా వేవ్‌లు వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని, ఫోర్త్ వేవ్ రూపంలో కాకున్నా జూన్, జూలై నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. గాంధీఆస్పత్రిలో 14 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు. నెల రోజులుగా గాంధీలో కోవిడ్ అడ్మిషన్, కోవిడ్ డెత్ ఒక్కటి కూడా జరగలేదన్నారు.
గాంధీలో డైట్ కమిటీ సమావేశం...
సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో రోగులకు ఆహారం అందించే డైట్ క్యాంటిన్ నిర్వహణ, పనితీరు మరింత మెరుగు పర్చేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు ఆస్పత్రి సెమినార్ హాలులో డైట్ కమిటీ సమావేశం నిర్వహించారు. (క్లిక్: గుడ్ న్యూస్.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులపై కీలక ప్రకటన)
Comments
Please login to add a commentAdd a comment