Raja rao
-
ఇద్దరికీ నో టికెట్
అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా): చంద్రబాబు క్షుద్ర రాజకీయంపై అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆ పార్టీ శ్రేణులు విస్తుపోతున్నారు. ఇక్కడ ఇద్దరు ఆశావహులను నమ్మించి ప్రోత్సహించి చివరకు మొండిచేయి చూపడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా జనవరి 20నే చంద్రబాబు సియారి దొన్నుదొర పేరును ప్రకటించారు. దీంతో పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదంటూ దివంగత మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు సీవేరి అబ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. అనుచరులతో ఆయన ప్రచారమూ ప్రారంభించారు. ఫలితంగా పార్టీ వర్గాలుగా విడిపోయింది. బాబు ప్రకటనతో సియారి దొన్నుదొర కూడా ప్రచారం ప్రారంభించిన తరుణంలో బీజేపీ తన అభ్యర్థిగా పాంగి రాజారావు పేరును ప్రకటించింది. దీంతో దొన్నుదొరతోపాటు టీడీపీ కార్యకర్తలు ఖిన్నులయ్యారు. చంద్రబాబు క్షుద్ర రాజకీయాలకు పార్టీని బలిపీఠం ఎక్కిస్తున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు దొన్నుదొర విజయవాడ బయలుదేరారు. ఇప్పుడు సివేరి అబ్రహంతోపాటు సియారి దొన్నుదొర కూడా రెబల్‌గా బరిలో నిలిచే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కార్యకర్తలు చెదిరిపోయే పరిస్థితులు లేకపోలేదని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రచారం చేస్తున్న టీడీపీ రెబల్ అభ్యర్థి సివేరి అబ్రహం చంద్రబాబు తనకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు.. కారణం ఇదే!
గాంధీ ఆస్పత్రి: వ్యాయామం చేస్తూ కొందరు హఠాత్తుగా కుప్పుకూలి మృతిచెందుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఎటువంటి లక్షణాలు కనిపించనప్పటికీ తీవ్రమైన గుండెపోట్లతో వారు మరణిస్తున్నట్లు వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. ఇంకొందరు బ్రెయిన్‌స్ట్రోక్‌తో కుప్పకూలుతున్నారని అంటున్నారు. కుటుంబంలో ఎవరైనా ఇలా మరణిస్తే మిగిలిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి వ్యాధులు, రుగ్మతలు జన్యుపరంగా రక్త సంబంధీకులకు వస్తున్నట్లు గతంలోనే నిర్ధారణైందని చెబుతున్నారు. గుండెపోటుతో కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్ ఎందుకు వస్తున్నాయి?, నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోవిడ్ పాత్ర తదితర అంశాలపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు ‘సాక్షి’కి చెప్పి వివరాలు ఆయన మాటల్లోనే.. - గుండె, మెదడు జబ్బులు వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఎక్కువ. కాబట్టి రక్తసంబంధీకులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. - మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, స్థూలకాయం, మాదకద్రవ్యాల సేవనం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, శారీరకశ్రమ లేకపోవడం గుండె, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. - కోవిడ్ బారినపడిన వారిలో రక్తం చిక్కబడే అవకాశం ఉంది, పోస్టు కోవిడ్ లక్షణాల్లో ఇది ప్రధానమైనది. రక్తం చిక్కబడి రక్తనాళాల్లో ప్రసరణ సరిగా జరగకపోవడంతో హార్ట్ఎటాక్, బ్రెయిన్‌స్ట్రోక్‌కు ఆస్కారం ఏర్పడుతుంది. - తల్లి గర్భంలో పిండం పెరిగి శిశువుగా రూపాంతరం చెందుతున్నప్పుడే కొన్నిరకాల రుగ్మతలకు గురవుతారు. డయాబెటిస్ వంటివి ఇటువంటివే. తల్లి ఆరోగ్యంగా లేనప్పుడు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడు వాటి ప్రభావం శిశువులపై పడుతుంది. - చిన్నారులు, యువతలో శారీరక శ్రమ లేకపోవడం ఇటువంటి రుగ్మతలకు మరో కారణం. ఇలా చేస్తే పదిలం.. - వంశపారంపర్యంగా గుండె, మెదడు సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. - జీవనశైలి, ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. మాదకద్రవ్యాలు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమపాళ్లలో తీసుకోవాలి. పండ్లు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. - గుండెపోటుకు గురైన వారిని వెంటనే కాపాడేందుకు వీలుగా అన్ని వర్గాల ప్రజలకు అత్యవసర ప్రాథమిక చికిత్స అయిన సీపీఆర్‌పై అవగాహన కలి్పంచి శిక్షణనివ్వాలి. - యోగా, ధ్యానం చేసేందుకు వీలుగా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు తప్పనిసరిగా 45 నిమిషాల సమయం కేటాయించాలనే నిబంధన విధించాలి. -
జూన్‌లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని, దీనికి భయపడాల్సిన అవసరంలేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. మొదటి వేవ్ నుంచి పరిశీలిస్తే నాలుగు నుంచి ఆరు నెలల వ్యవధిలో కరోనా వేవ్‌లు వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని, ఫోర్త్ వేవ్ రూపంలో కాకున్నా జూన్, జూలై నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. గాంధీఆస్పత్రిలో 14 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు. నెల రోజులుగా గాంధీలో కోవిడ్ అడ్మిషన్, కోవిడ్ డెత్ ఒక్కటి కూడా జరగలేదన్నారు. గాంధీలో డైట్ కమిటీ సమావేశం... సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో రోగులకు ఆహారం అందించే డైట్ క్యాంటిన్ నిర్వహణ, పనితీరు మరింత మెరుగు పర్చేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు ఆస్పత్రి సెమినార్ హాలులో డైట్ కమిటీ సమావేశం నిర్వహించారు. (క్లిక్: గుడ్ న్యూస్.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులపై కీలక ప్రకటన) -
ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహన కల్పించాలి
న్యూఢిల్లీ: దేశ ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెంచే (ఆర్థిక అంశాల పట్ల అవగాహన కల్పించేలా) బాధ్యతను విద్యా సంస్థలు, పరిశ్రమల మండళ్లు, పరిశోధనా సంస్థలు తీసుకోవాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ కోరారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ‘ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ’ (ఐఈపీఎఫ్ఏ) ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వెబినార్‌లో (ఆన్లైన్ కార్యక్రమం) సింగ్ మాట్లాడారు. ఐఈపీఎఫ్ఏ బలోపేతానికి కార్పొరేట్ శాఖ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.(చదవండి: భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదేనండోయ్..!) ఈ సంస్థ ఇప్పటి వరకు 18,000 క్లెయిమ్‌లను పరిష్కరించింది. షేర్లు, డివిడెండ్లు రూ.1,000 కోట్ల విలువ చేసే మొత్తాన్ని ఇన్వెస్టర్లకు చెల్లించింది. చిన్నతనంలోనే ప్రాథమిక ఆర్థిక అంశాలను నేర్పే విదంగా స్కూళ్లు, కళాశాలలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విజ్ఞానం లోపించడం వల్ల చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మోసపూరిత ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్టు చెప్పారు. పొంజి స్కీమ్‌లను నమ్మి ఎంతో మంది మోసపోయినట్టు పేర్కొన్నారు. -
నేడు రాష్ట్రంలోకి నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. రుతుపవనాలు ఇప్పటికే ఏపీలోని కర్నూలు, మచిలీపట్నంలోకి ప్రవేశించాయన్నారు. ముందుగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని చెప్పారు. మరోవైపు రుతుపవనాల రాక ముందే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. గత 24 గంటల్లో కొడంగల్‌లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దేముల్, యాచారం లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
మంత్రాల నెపం మోపారని...
చేతబడి చేస్తున్నావంటూ గ్రామస్తులు చేసిన ఆరోపణలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కాలు విపరీతంగా వాచిపోయింది. ఎన్ని వైద్యాలు చేసినా అది నయం కావటం లేదు. ఇదే సమయంలో సదరు వ్యక్తికి అదే వీధికి చెందిన కరగాల రాజారావు(65) తరచూ కలలో కనిపిస్తున్నాడు. తన కాలి వాపునకు రాజారావు చేసిన చిల్లంగి(చేతబడి) కారణమని కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నాడు. ఇదే విషయమై కొందరు గ్రామస్తులతో కలిసి సోమవారం రాజారావును నిలదీశాడు. మనస్తాపం చెందిన రాజారావు మంగళవారం ఉదయం ఇంట్లోనే విషం తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం
-
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం
పకడ్బందీగా ఏర్పాట్లు 84 కేంద్రాల్లో పరీక్ష ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్ఐవో రాజారావు విజయవాడ : ఇంటర్ ప్రాకిక్టల్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్ఐవో ఆర్. రాజారావు తెలిపారు. స్థానిక మారుతీనగర్‌లోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజారావు మాట్లాడుతూ జిల్లాలో 290 ఇంటర్ కళాశాలలు, 33 వోకేషనల్ కోర్సులు కళాశాలలు కలిపి 323 కళాశాలు ఉన్నాయని వీటిలో 184 కళాశాలలను ఎంపిక చేసి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 34,441 మంది ఎంపీసీ విద్యార్థులు, 13,508 మంది బైపీసీ విద్యార్థులు, మొదటి సంవత్సరం వోకేషనల్ కోర్సు విద్యార్థులు 965 మంది, రెండో సంవత్సరం వోకేషనల్ కోర్సు విద్యార్థులు 1477 మందికి ఈఏడాది హల టిక్కెట్లు జారీ చేశామని చెప్పారు. గురువారం నుంచి 16వ తేదీ వరకు మొదటి దశ, 18 నుంచి 22వ తేదీ వరకు రెండో దశ, 23 నుంచి 27 వరకు మూడో దశ, 28 నుంచి మార్చి 4 వరకు నాలుగో దశల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్‌బోర్డు ఆర్ఐవో నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన డిస్టిక్ ఎగ్జామినేషన్ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తానని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు మల్లయ్యస్వామి (నూజివీడు),రవికుమార్ (మువ్వ) ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల లెక్చరృర్ జి,శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ విభాగం నుంచి ఉండే హైపవర్ కమిటీ సభ్యులు, పెడన ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ బీఎస్ఆర్వీ ప్రసాద్ లు సభ్యులుగా ఉంటారని వివరించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గటంల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని చెప్పారు. నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 102 ఆన్ఎయిడెడ్ కళాశాలకు ప్రభుత్వ శాఖల నుంచి అధికారులను చీఫ్ సూపరింటెండెంట్లుగా నియమించామన్నారు. -
భార్య ఉండగానే మరో రెండు వివాహాలు
సంతబొమ్మాళి: భార్య, ముగ్గురు పిల్లలు ఉండగానే మరో ఇద్దరు యువతులను రహస్యంగా వివాహాలు చేసుకుని దర్జా వలగ బోస్తున్నాడో ప్రబుద్ధుడు. సంతబొమ్మాళి మండలం పెద్దకేశనాయుడుపేట (పలికిలివానిపేట) గ్రామానికి చెందినన అతడి పేరు పలికిలి కర్రెన్న. అతడి మొదటి భార్య భగవతమ్మ శనివారం విలేకరులకు భర్త నిర్వా కాన్ని వివరించింది. టెక్కలి మండలం భగీరథపేటకు చెందిన పిన్నింటి రాజారావు కుమార్తె భగవతమ్మకు సంతబొమ్మాళి మండలం పెద్దకేశనాయుడుపేటకు చెందిన కర్రెన్నతో 1994లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. రూ.40 నగదు, తులంన్నర బంగారం, ఇతర వస్తువులను కట్నంగా ఇచ్చారు. ఈ దంపతులకు 1996లో రాణి అనే ఆడ బిడ్డ పుట్టింది. అప్పటి నుంచి కర్రెన్న భార్య భగవతమ్మకు శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. దీంతో ఆమె 1999లో భగీరథపేటలోని పుట్టినింటికి వెళ్లిపోయింది. భార్యకు తెలియకుండా 2002లో బెంగళూరు వలస వెళ్లి మూడేళ్లు అక్కడే ఉన్న కర్రెన్న అక్కడ వేరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి 2005లో స్వగ్రామమైన పెద్దకేశనాయుడుపేట వ చ్చాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య భగవతమ్మ భర్తను నిలదీసింది. పెద్దల సమక్షంలో ఒక అంగీకారానికి వచ్చిన కర్రెన్న ఇరువురితో కాపురం చేస్తానని అంగీకరించాడు. ఎనిమిది నెలలు గడచిన తర్వాత బెంగళూరు నుంచి రెండో భార్య తల్లిదండ్రులు వచ్చి తమ కుమార్తెను తీసుకు వెళ్లిపోయారు. దీంతో అతడి కాపురం మొదటి భార్యతో కొంతకాలం సాఫీగా సాగింది. ఆ దంపతులకు 2007లో మోహిని అనే కుమార్తె, 2010లో మణి అనే కుమారుడు పుట్టారు. ఆ తర్వాత తరచూ కర్రెన్న భార్యను కొట్టేవాడు. పెద్దలు రాజీ చేసి కాపురానికి పంపేవారు. ఇలా పలుమార్లు జరగడంతో పుట్టింటి వద్దే పిల్లలతో భగవతమ్మ ఉండిపోయింది. దీంతో కర్రెన్న ఈ ఏడాది మేలో తిప్పానబొడ్డపాడుకు చెందిన నీలాపు జ్యోతిని రహస్యంగా వివాహం చేసుకుని వేరొక చోట కాపురం పెట్టాడు. ఇటీవల మూడో భార్య జ్యోతిని స్వగ్రామం పెద్దకేశనాయుడుపేటకు తీసుకు రావడంతో మొదటి భార్య భగవతమ్మ ఇదేం పద్ధతని భర్తను నిలదీసింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె నౌపడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు జూన్‌లో సిద్ధపడింది. పెద్దలు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పటి వరకు ఆగిపోయింది. ఇంత వరకు న్యాయం జరగకపోవడంతో శనివారం నౌపడ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమకు న్యాయం చేయాలని తన భర్తపైన, అత్తపైన,మూడో వివాహానికి సహకరించిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని కోరింది. న్యాయం చేయండి సారూ... నౌపడ పోలీస్‌స్టేషన్ పరిశీలనకు వచ్చిన ఎస్పీ ఎ.కె.ఖాన్‌కు న్యాయం చేయాలని బాధితురాలు భగవతమ్మ వేడుకుంది. వెంటనే ఎస్పీ స్పందించి భారాభర్తలను రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయం జరిగేలా చూడాలని ఎస్సైకు సూచించారు. -
సంప్రదాయ మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
అభివృద్ధి పేరుతో తీరాన్ని కొల్లగొడితే సహించబోం తీరప్రాంతంపై మత్స్యకారులకు హక్కులు కల్పించాలి తీరప్రాంత నియంత్రణ మండలికి చట్టభద్రత కల్పించాలి ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారావు విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరిట తీరప్రాంత మత్స్యకారుల జీవనానికి, జీవనోపాధికి ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్య కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూరాడ రాజారావు హెచ్చరించారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి తీరప్రాంతంపై పడిందన్నారు. ఇందుకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణమని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు అతిపెద్ద తీరం ఉందని, అభివృద్ధి చేసుకుంటామని చెబుతున్న నాయకులు మత్స్యకారుల సమస్యలపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 60 లక్షలకుపైగా ఉన్న మత్స్యకారుల సంక్షేమానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరచాలని డిమాండ్ చేశారు. మత్స్య కారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో మత్స్యకారులను ఎస్టీలుగా పరిగణిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. మండల కమిషన్ నివేదికలోనూ ఈ అంశం ఉందన్నారు. తీరప్రాంతంపై మత్స్యకారులకు హక్కులు కల్పించాలని, 2009లో రూపొందించిన ముసాయిదా బిల్లుకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలని కోరారు. చేపల బజారుల్లో వ్యాపారాలు చేసుకుంటున్న మహిళా మత్స్యకార కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. 2011లో రూపొందించిన తీరప్రాంత క్రమబద్ధీకరణ మండలి (సీఆర్‌జడ్) ముసాయిదా బిల్లును చట్టం చేయాలన్నారు. సముద్రంలో చేపలవేట సాగిస్తున్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.లక్ష నుంచి 5 లక్షలకు పెంచాలన్నారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు బియ్యంతో పాటు రూ.9,400 నగదు చెల్లించాలన్నారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉందన్నారు. సంప్రదాయ మత్స్యకారుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చేపల వేట సాగించేవారికి సబ్సిడీపై డీజిల్ అందజేయాలన్నారు. వ్యవసాయదారులకు ఇస్తున్నట్లే మత్స్యకారులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలని కోరారు. అభివృద్ధి పేరుతో తీరప్రాంతాన్ని కొల్లగొట్టి మత్స్యకారులనే తరిమివేయాలని చూస్తే సహించబోమన్నారు. ఈ సమావేశంలో మత్స్యకార యువజన సంఘం అధ్యక్షుడు తెడ్డు శంకర్, కె.ఆదిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. -
లెక్క తేలింది
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లా ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో అవినీతి లెక్కతేలింది. నిధుల గోల్మాల్ వ్యవహారం కొలిక్కి వచ్చింది. గుంటూరు ఎస్ఈ రాజారావు ఐదునెలల పాటు నెల్లూరు జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. గుంటూరులో నిధుల కుంభకోణం వ్యవహారంలో ఆధారాలతో సహా చిక్కి ఆయన సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో సీఈ జగన్మోహన్ ఆధ్వర్యంలో నెల్లూరులో కూడా విజి లెన్స్ కమిటీ రెండు రోజులు విచారణ జరిపి రూ.3.66 కోట్లు పక్కదారి పట్టినట్టు లెక్కలు తేల్చింది. ఇందులో రూ.1.85 కోట్లను నెల్లూరు నుంచి గుంటూరు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయానికి డైవర్ట్ చేశారు. మరో రూ.1.19 కోట్లను సెల్ఫ్ చెక్కుల రూపంలో డ్రా చేశారు. ఇందులో రూ.26 లక్షలను జిల్లాలో వాహనాల కొనుగోలుకు ఉపయోగించారు. మిగతా డబ్బును దిగమింగారు. మరో రూ.62 లక్షలను సమ్మె కాలంలో ఉద్యోగులకు చెల్లించేందుకు సెల్ఫ్ చెక్కుల ద్వారా డ్రా చేశారు. ఈ సొమ్మును అధికారులు రికవరీ చేశారు. సీనియర్ అసిస్టెంట్‌ను నిలదీసిన సీఈ విచారణ సందర్భంగా సీఈ జగన్మోహన్ చెక్కులను రాసిన సీనియర్ అసిస్టెంట్ శీనయ్యను నిలదీశారు. కలెక్టర్‌కు తెలపకుండా చెక్కులను ఎలా రాస్తావని గద్దించారు. సీనియర్ అసిస్టెంట్ సమాధానమిస్తూ ఎస్ఈ రాజారావు చెక్కులు రాయమంటేనే రాశానని, అంతకు మించి తనకేమీ తెలియదన్నారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్‌ను కూడా నిలదీశారు. డబ్బులు డీడబ్ల్యూఎస్ఎం పథకానివి... ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఎస్ఈ అకౌంట్లో ఒక్క రూపాయి కూడా ఉండదు. ఈ అకౌంట్ నుంచి నిధులు డ్రా చేసేందుకు కుదరదు. అయితే జిల్లా తాగునీటి పథక మేనేజ్మెంట్ (డీడబ్ల్యూఎస్ఎం) పథకాానికి కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేసింది. దీనికి కార్యదర్శిగా ఎస్ఈనే వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌కు కూడా తెలియకుండా, పై అధికారులు అనుమతి తీసుకోకుండా సెల్ఫ్ చెక్కుల రూపంలో నిధులను అప్పటి ఇన్చార్జ్ ఎస్ఈ మింగేశారు. బలికాబోతున్న చిరు ఉద్యోగులు ఈ అవినీతి వ్యవహారంలో నేరుగా ఆర్డబ్ల్యూఎస్, డీఈ, ఈఈలకు సంబంధం ఉన్నట్టు ఆధారాలు దొరకలేదు. అయితే డీడబ్ల్యూఎస్ఎం పథకం ద్వారా నిధులను డ్రాచేసే విషయంలో ఎస్ఈ ఆదేశాల మేరకు సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు తెలిసి చేసినా, తెలియక చేసినా సహకారం అందించారు. వీరి ద్వారా విజిలెన్స్ కమిటీ స్టేట్ మెంట్ తీసుకుంది. రికార్డులను హైదరాబాద్‌కు విజిలెన్స్ కమిటీ అధికారులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆధారాలు దొరికిన చిరుద్యోగులపై వేటు పడే అవకాశం ఉంది. దీంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. అవినీతిలో తమకు ఎలాంటి సంబంధం లేదని, పై అధికారిగా ఎస్ఈ ఆదేశాల మేరకే చెక్కులు రాశామని చెబుతున్నారు.