పహాడీషరీఫ్: బైక్‌పై వెళ్తున్న రౌడీషీటర్‌ను గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీ కొట్టి.. కళ్లలో కారం చల్లి.. తుపాకీతో కాలి్చ.. కత్తులతో నరికి చంపిన దారుణ ఘటన బాలాపూర్ పీఎస్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్ షరీఫ్‌నగర్‌లో నివాసం ఉండే రియాజుద్దీన్ అలియాస్ మెంటర్ రియాజ్ (45) లలితాబాగ్ రక్షాపురంలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. గురువారం రాత్రి రాయల్ కాలనీలో జరిగిన ఓ విందుకు హాజరై.. స్నేహితుడు నజీర్‌తో కలిసి బాలాపూర్‌లోని వైన్స్‌లో మద్యం తాగారు.
అనంతరం రాత్రి 10.30 గంటలకు నజీర్ ఇంటికి వెళ్లగా, రియాజ్ తన బైక్‌పై షరీఫ్‌నగర్‌కు బయల్దేరాడు. ఆర్సీఐ రోడ్డులో ‘మంచి’ స్కూల్ వద్దకు రాగానే ముందస్తు పథకంలో భాగంగా వెనక నుంచి కారులో వచి్చన దుండగులు బైక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో రియాజ్ కింద పడిపోగా.. కళ్లలో కారం చల్లి, తుపాకీతో ఛాతీలో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. అయినప్పటికీ కొన ఊపిరితో ఉన్నాడని భావించి కత్తులతో తల, ఛాతీ భాగాల్లో ఇష్టానుసారంగా పొడిచారు.
వచి్చన కారులోనే పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత వాహనదారుల ద్వారా సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా.. రక్తపు మడుగులో పడి ఉన్న రియాజ్ అప్పటికే మృతి చెందాడు. రాచకొండ పోలీస్ కమిషనర్ సు«దీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, బాలాపూర్, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్లు భూపతి, గురువారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. హత్యకు వినియోగించిన బుల్లెట్ షెల్‌తో పాటు ఐరన్ రాడ్డును స్వా«దీనం చేసుకున్నారు.
క్లూస్ టీంతో శాంపిళ్లు సేకరించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగి ఉంటుందని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని సీపీ తెలిపారు. రియాజ్‌తో పాటు మద్యం తాగిన నజీర్ ఇచి్చన పక్కా సమాచారంతోనే నిందితులు వెంబడించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment