డ్రైవర్‌పై అనుమానంతో తిరుమలగిరిలో దిగిన ద్వయం
అక్కడి నుంచి మళ్లీ బోయిన్‌పల్లి వైపు వచి్చనట్టు గుర్తింపు
కాల్పుల కేసులో కొనసాగుతున్న నగర పోలీసుల దర్యాప్తు
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకతో పాటు నగరంలో తుపాకీతో కాల్పులకు తెగబడిన దుండగులు అఫ్జల్‌గంజ్ ఫైరింగ్ తర్వాత గజ్వేల్ వెళ్లాలని భావించారు. సికింద్రాబాద్ నుంచి ఆటోను ఆ ప్రాంతానికే మాట్లాడుకున్నారు. అయితే మార్గమధ్యంలో డ్రైవర్ వ్యవహారశైలిపై వారికి అనుమానం రావడంతో తిరుమలగిరిలో దిగిపోయారని పోలీసుల తాజా దర్యాప్తులో తేలింది. రోషన్ ట్రావెల్స్‌కు చెందిన మేనేజర్ జహంగీర్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు చేస్తున్న నగర పోలీసులు వివిధ కోణాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తున్నారు. బీదర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సైతం దర్యాప్తులో పాలు పంచుకుంటోంది.
ఆటో దిగి బ్యాగులు, వస్త్రాలు కొని...
ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనంపై బీదర్‌లో దాడి చేసి, ఒకరిని కాల్చి పంపిన దుండగులు నగదుతో హైదరాబాద్ చేరుకున్న విషయం విదితమే. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి రాయ్‌పూర్‌కు టిక్కెట్లు బుక్ చేసుకోవడం, మినీ బస్సులో బ్యాగుల తనిఖీ, జహంగీర్‌పై కాల్పులు తర్వాత దుండుగల గమ్యం మారింది. అఫ్జల్‌గంజ్ నుంచి ఆటో ఎక్కిన ఇద్దరూ రైలు మిస్ అవుతుందని, తొందరగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్లాలని డ్రైవర్‌ను కంగారు పెట్టారు. సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వరకు వెళ్లిన ఈ ద్వయం అక్కడ కొత్త బ్యాగ్‌లు, వస్త్రాలు ఖరీదు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో లాడ్జిల్లో గదులు ఇప్పించే దళారులు తిరుగుతూ ఉంటారు. అలాంటి ఓ వ్యక్తి వీరి వద్దకు వచ్చి రూమ్ కావాలా అంటూ ప్రశి్నంచాడు.
గజ్వేల్‌లో మకాం వేయాలని ప్లాన్...
తాము ఉండటానికి రూమ్ కావాలని చెప్పిన దుండగులు అయితే ఇక్కడ వద్దని, గజ్వేల్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాల్సి ఉందని చెప్పారు. అక్కడ అద్దె ఇల్లు దొరికే వరకు హోటల్‌లో రూమ్ కావాలని చెప్పారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దళారి తనకు పరిచయస్తుడైన గజ్వేల్‌లోని దళారితో మాట్లాడాడు. అతడు రోజుకు రూ.1500 అద్దెకు రూమ్ సిద్ధంగా ఉందని చెప్పడంతో ఇరువురినీ గజ్వేల్ వెళ్లమని ఇక్కడి దళారి సూచించాడు. అలా వెళ్లడానికి ఆటో మాట్లాడి పెట్టమని దుండగులు కోరడంతో సికింద్రాబాద్ దళారి రూ.1500 కిరాయికి ఆటో సైతం మాట్లాడి పెట్టాడు. గజ్వేల్ దళారి నెంబర్ ఆటోడ్రైవర్‌కు ఇచ్చి, ఇద్దరినీ అతడి వద్ద దింపి రమ్మని చెప్పాడు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతూనే ఆటోడ్రైవర్ ఓసారి దళారితో మాట్లాడాడు.
పదేపదే దళారీతో మాట్లాడుతుండటంతో...
వీరి ఆటో బయలుదేరిన తర్వాత గజ్వేల్ దళారి రెండుసార్లు డ్రైవర్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆటో తిరుమలగిరి వరకు వెళ్లిన తర్వాత మరోసారి కాల్ చేయడంతో దుండగులకు అనుమానం వచి్చంది. అక్కడ ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆటో ఆపమని చెప్పిన ఇరువురూ బ్యాగ్‌లతో సహా ఆటో దిగి రూ.500 చెల్లించి వెళ్లిపోయారు. అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో నగదును ట్రాలీ బ్యాగ్‌ల నుంచి మరో బ్యాగుల్లోకి మార్చుకున్నారు. ఆపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత వ్రస్తాలు సైతం మార్చేశారు. అక్కడ నుంచి మళ్లీ తిరుమలగిరి ప్రధాన రహదారి మీదికి వచ్చి బోయిన్‌పల్లి వైపు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఈ విషయాలు గుర్తించిన పోలీసులు ఇప్పటికే ఆటోడ్రైవర్లు, దళారుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేశారు.
బీ–క్లాస్ పట్టణాలనే ఎంచుకుని...
ఈ నేరాలు జరిగిన తీరు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు దుండగులు బీ–క్లాస్ సిటీలు, పట్టణాలనే ఎంపిక చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. పోలీసుల అప్రమత్తత, హడావుడి తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే దుండగులు ఇలా చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలోని ఈ తరహాకు చెందిన పట్టణం బీదర్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లో ఫైరింగ్ తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లకుండా ఇలాంటి పట్టణమే అయిన గజ్వేల్ వెళ్లడానికి ప్రయతి్నంచారు. ఈ కీలకాంశాన్ని సైతం పరిగణలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. మరోపక్క బీదర్‌లో నేరం చేయడానికి, అక్కడ నుంచి సిటీ రావడానికి నిందితులు వినియోగించిన వాహనాన్ని సైతం హైదరాబాద్ పోలీసులు స్వాదీనం చేసుకున్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment