బాలాపూర్ గణనాథుని వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏటా గణేశుడి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్వామి వారి చేతిలోని లడ్డూకు ఎక్కడా లేని డిమాండ్ ఉంటుంది.
ఈసారి ఐదు తలల నాగరాజు పడగల కింద స్వామివారిని సుందరంగా రూపొందించారు. విజయవాడ కనకదుర్గ ఆలయ నమూనాలో మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. కోల్‌కతాకు చెందిన కళాకారులు 11 రోజులుగా ఈ పనుల్లో నిమగ్నమయ్యారు.
18 ఫీట్ల ఎత్తుతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment