వినాయక విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సమయం రెండు రోజులే ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో యువత సందడి చేస్తోంది. కరోనా కారణంగా గత రెండు, మూడు సంవత్సరాలుగా అంతంత మాత్రంగానే విగ్రహాలు నెలకొల్పారు.
ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ సమితులు సిద్ధమయ్యాయి. దీనికి తోడు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం ఉత్సవ నిర్వాహకులకు కలిసొచ్చింది. ఆశావహులు, అభ్యర్థులు పెద్ద ఎత్తున విగ్రహాలు ఇప్పిస్తున్నారు. మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో వినాయక విగ్రహాల అమ్మకాలు ఉన్నట్లు తయారీదారులు చెబుతున్నారు.
అయితే మట్టి వినాయకులపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇళ్లలో ఏర్పాటు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.పండుగ మరో రెండు రోజులు ఉన్నందున ఇంకా పెరిగే అవకాశం ఉంది. ధరలు గత ఏడాది మాదిరిగానే నిర్ణయించామని విగ్రహ తయారీదారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment