Ganesh Idols
-
కాంప్లెక్స్‌గా మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు, వీడియో వైరల్
దేశ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఎప్పటి మాదిరే ఈ సారి కూడా స్టార్ హీరోలకు సంబంధించిన సినిమా పాత్రలపై స్పెషల్ వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవరతో పాటు పలువురి స్టార్ హీరోల లుక్‌లో ఉన్న గణపతి బొమ్మలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ‘కల్కి’ రూపంలో ఉన్న వినాయకుడే ఈ ఏడాది స్పెషల్ అట్రాక్షన్ నిలిచాడు.కాంప్లెక్స్‌గా మందిరం.. అశ్వత్థామగా వినాయకుడుప్రభాస్ హీరోగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ ఏడాది జూన్ 27న విడుదలై..బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో భైరవగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్, యాస్కిన్‌గా కమల్ నటించారు. ఈ సినిమా చూసిన వాళ్లకు ప్రత్యేక కారు ‘బుజ్జి’, కాంప్లెక్స్ ప్రదేశాలు అలా గుర్తిండిపోతాయి. ఇప్పుడు ఇదే సినిమాను పోలిన ఓ గణపతి మందిరం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వినాయకుడు అశ్వత్థామ రూపంలో ఉండగా.. మందిరం కాంప్లెక్స్ ప్రదేశంలా ఉంది. ‘కల్కి’వినాయకుడు ఎక్కడ ఉన్నాడు?‘కల్కి’ వినాయకుడి విడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అసలు ఈ మందిరం ఎక్కడ ఏర్పాటు చేశారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ వెరైటీ వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేసింది తమిళ ప్రజలే. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ మందిరం ఉన్నట్లు తెలుస్తోంది. కాంప్లెక్ మాదిరి మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్‌లో బుజ్జిని కూడా ఉంచారు. లోపల యాస్కిన్ లుక్‌లో ఉన్న కమల్ బొమ్మ పెట్టి.. అమితాబ్ అశ్వత్థామ లుక్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, నుదుటిపై మణి వెలిగిపోతున్నట్లు ఓ లైట్ కూడా సెట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఏడాది స్పెషన్ వినాయక విగ్రహం ఇదేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. #wow pic.twitter.com/54ssb41OTm— devipriya (@sairaaj44) September 9, 2024 -
భక్త 'గణ' యాత్ర
సాక్షి, హైదరాబాద్: గణపతి నిమజ్జన వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో విగ్రహాలు, భక్తులతో రహదారులు కిటకిటలాడాయి. నగరం నలువైపుల నుంచి తరలి వచ్చిన భక్తజన సందోహంతో సాగరతీరం సందడిగా మారింది. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, పీపుల్స్‌ప్లాజా తదితర ప్రాంతాల్లో ‘జై బోలో గణపతి మహారాజ్‌కీ జై ’అంటూ నినాదాలు హోరెత్తాయి. వైవిధ్య భరితమైన వినాయక మూర్తుల నిమజ్జన వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. భక్తుల నినాదాలు, నృత్యాలతో కూడిన శోభాయాత్రతో మహానగరం ఆధ్మాత్మికతను సంతరించుకుంది. 63 అడుగుల ఖైరతాబాద్ శ్రీ దశ మహావిద్యా గణపతి నిమజ్జన వేడుకలు మధ్యాహ్నం 1.27 గంటలకే ముగిశాయి. ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్త జనందోహం నడుమ శోభాయాత్ర ప్రశాంతంగా సాగింది. ఉదయం 6.12 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్. రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మీనార్, సచివాలయం, ఎన్టీయార్మార్గ్ మీదుగా ఉదయం 11.40 గంటలకు 4వ నంబర్ క్రేన్ వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం 12.24 గంటలకు చివరి పూజ నిర్వహించిన గంట తరువాత మహాగణపతిని నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని విభాగాల సహకారంతో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేకత ఉందని పది రోజుల్లో 50 లక్షల మంది దర్శించుకున్నారని చెప్పారు. గురువారం నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో భారీగా పోటెత్తిన భక్త జనం వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ మహాగణపతి నిమజ్జన వేడుకలు ముగిసిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి బొజ్జ గణపయ్యలు సాగరతీరంలో నిమజ్జనానికి తరలివచ్చారు. మధ్యలో స్వాగత వేదికలు గణపతులకు సాదర స్వాగతం పలికాయి. రకరకాల ఆకృతులలో అందంగా రూపుదిద్దుకున్న మూషికవాహనుడి విగ్రహాలు ఆకట్టుకున్నాయి. తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం అలంకరణలో ఏర్పాటు చేసిన మండపాలు, విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్ వంటి సోషల్ మీడియాను ప్రతిబింబించే చిన్న చిన్న విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి నిమజ్జనానికి తీసుకొచ్చారు. అబిడ్స్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పండ్లతో అలంకరించిన విగ్రహాలు, కాగితంతో అందంగా తీర్చిదిద్దిన పర్యావరణ గణపతులు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కోసం అమరవీరుల స్మారక చిహ్నం వద్ద బారులు తీరిన వినాయక విగ్రహాలు ఏరియల్ నిఘా రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసేందుకు పోలీస్‌శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీ స్ కమిషనర్లు వినాయక నిమజ్జన ప్రాంతాలు పరిశీలించారు. హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని మంత్రులు మహమూ ద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి డీజీపీ అంజనీకుమార్ ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. హెలికాప్టర్లో శోభాయాత్రను, హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కూడా పాల్గొన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా శోభయాత్రను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల లైవ్ ఫీడ్‌ను చూస్తూ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. నగరం ఆధ్యాత్మిక సంద్రమైంది. ఎటుచూసినా భక్తజన సందోహం.. అంతటా గణనాథుని నిమజ్జన వేడుకల కోలాహలం.. దారిపొడవునా వినాయకులకు ఘన స్వాగతాలు.. ట్యాంక్బండ్లు, చెరువుల వద్ద వీడ్కోళ్లు.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. 63 అడుగుల ఖైరతాబాద్ శ్రీ దశ మహావిద్యా గణపతి నిమజ్జనోత్సవం మధ్యాహ్నం 1.27 గంటలకే ముగిసింది. -
అమెరికాలో ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలు తయారు
-
గణపయ్యలకు మస్తు డిమాండ్.. జోరుగా అమ్మాకాలు
వినాయక విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సమయం రెండు రోజులే ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో యువత సందడి చేస్తోంది. కరోనా కారణంగా గత రెండు, మూడు సంవత్సరాలుగా అంతంత మాత్రంగానే విగ్రహాలు నెలకొల్పారు. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ సమితులు సిద్ధమయ్యాయి. దీనికి తోడు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం ఉత్సవ నిర్వాహకులకు కలిసొచ్చింది. ఆశావహులు, అభ్యర్థులు పెద్ద ఎత్తున విగ్రహాలు ఇప్పిస్తున్నారు. మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో వినాయక విగ్రహాల అమ్మకాలు ఉన్నట్లు తయారీదారులు చెబుతున్నారు. అయితే మట్టి వినాయకులపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇళ్లలో ఏర్పాటు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.పండుగ మరో రెండు రోజులు ఉన్నందున ఇంకా పెరిగే అవకాశం ఉంది. ధరలు గత ఏడాది మాదిరిగానే నిర్ణయించామని విగ్రహ తయారీదారులు తెలిపారు. -
26 వినాయక మండపాల్లో లడ్డూల చోరీ
చిట్యాల/మీర్‌పేట: వినాయకుడి చేతిలో పూజలందుకున్న లడ్డూలను గణేశ్ నిమజ్జనం రోజున వేలంలో వేలు, లక్షల రూపాయలు పెట్టి దక్కించుకుంటారు. అయితే నల్లగొండ జిల్లా చిట్యాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తులు లడ్డూలను ఎత్తుకెళ్లిపోయారు. వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో్ల మండపాలను ఏర్పాటు చేసి గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే, కొందరు దుండగులు పట్టణంలోని 26 మండపాల్లో ఉన్న లడ్డూలను అపహరించుకుపోయారు. శివాలయం వీధిలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహం నుంచి లడ్డూను అపహరిస్తున్న క్రమంలో విగ్రహం చేయి విరిగిపోయింది. ఓ వార్డులో లడ్డూ చోరీకి వచ్చిన ఇద్దరు అనుమానితులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో లడ్డూల చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని మండపాల నిర్వాహకులు లడ్డూల చోరీపై ఫిర్యాదు చేయలేదు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలోని డీఎల్ఆర్ కాలనీవాసులు స్థానిక కమ్యూనిటీహాల్లో నెలకొల్పిన వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించే యత్నం చేశారు. అదికాస్తా విఫలమవడంతో చేసేది లేక విగ్రహాన్ని రోడ్డుపైనే వదిలేసి పారిపోయారు. -
మీ ఇంటి ముందే నిమజ్జనం.. ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ ప్రత్యేక వాహనాలు
సనత్‌నగర్: వాహనం ఎక్కి వినాయకుడు నిమజ్జనానికి తరలడం కాదు.. నిమజ్జన వాహనమే గణేషుడి చెంతకు వచ్చే సరికొత్త విధానానికి ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ నాంది పలికింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఆ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు ‘ఎకో ఫ్రెండ్లీ గణేష్ నిమజ్జనం వాహనాలు’ అందుబాటులోకి వచ్చాయి. తొలిసారిగా ప్రయోగాత్మకంగా కమ్యూనిటీ అపార్ట్మెంట్ల నివాసితులకు ఈ సేవలను అందించనున్నారు. వీటిని శుక్రవారం వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాహనాలపై ఏర్పాటుచేసిన నీటి తొట్టెలో వినాయకుడి విగ్రహాన్ని మంత్రి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంటి ముందే వినాయకుడి నిమజ్జనం చేసేవిధంగా వాహనాలను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ వాహనాలను అవసరాలను బట్టి వచ్చే ఏడాది మరిన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ ఫుడ్ చైర్మన్ రాజీవ్‌సాగర్, ఫ్రీడమ్ ఆయిల్ మార్కెటింగ్ అసిస్టెంట్ మేనేజర్ సురేష్ పాల్గొన్నారు. చదవండి: BJP Telangana: గ్రేటర్‌పై కమలం కన్ను -
విదేశాల్లో వినాయకుడు.. గణేషునికి దేశదేశాల్లో ప్రత్యేక స్థానం
కరోనా మహమ్మారితో విలవిల్లాడిపోయి గత రెండేళ్లుగా గణేశుడి ఉత్సవాలకు దూరంగా ఉన్న ప్రజలు ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో పండుగ జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. కోవిడ్–19 భయాలు అంతగా లేకపోవడం, కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజలకి పూర్తిగా అవగాహన రావడంతో హరిద్వార్ నుంచి భువనేశ్వర్ వరకు పెద్ద ఎత్తున విఘ్నాధిపతిని కొలవడానికి ఏర్పాట్లు చేశారు. ఏనుగు తలతో పిల్లల్ని ఆకర్షించే రూపురేఖలతో గణపతి బప్పా కొలువై ఉండడం ఈ పండుగకి విదేశాల్లో కూడా ఎనలేని ప్రాముఖ్యత ఉంది. గణేశుడిపై అధ్యయనం చేసిన కాలిఫోర్నియా ప్రొఫెసర్ రాబర్ట్ ఎల్ బ్రౌన్ ఆగ్నేయాసియాలో 5, 6 శతాబ్దాల్లోనే గణేశుడి ప్రతిమలు శాసనాల్లో కనిపించాయని వెల్లడించారు. పలు ఆసియన్ దేశాల్లో బొజ్జ గణపయ్య ఆరాధన ఎప్పట్నుంచి ఉందో ఆ ప్రొఫెసర్ ఒక ఆరి్టకల్‌లో వివరించారు. భారత్‌లో 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ పాలనలో గణేశుడి ఉత్సవాలు ఘనంగా జరిగేవి. పుణెలో 18వ శతాబ్దంలో పెషావర్లు గణపతి ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ఇక స్వాతంత్య్ర పోరాటం సమయంలో హిందువులందరినీ ఏకం చెయ్యడానికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి ఊరేగింపుల్ని దేశవ్యాప్తం చేశారు. కాంబోడియా: 7వ శతాబ్దం నుంచే కాంబోడియా ప్రజలు గణేశుడ్ని ప్రథమ దేవుడిగా తొలి పూజలు అందిస్తున్నారు. ఆ దేశంలో ఉన్న ఆలయాలన్నీ వినాయకుడికే అంకితమిచ్చారు. భారత్‌లో గణేశ్ చతుర్థి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ముందే కాంబోడియాలో గణపతిని కొలడం విశేషం. ఈ దేశంలో గణేశ్ ప్రతిమలు ఎక్కువగా నిల్చొనే భంగిమలో మాత్రమే ప్రతిíÙ్ఠస్తారు. కొన్ని కూడళ్లలో కూడా భారీ సైజులో గణేశుడి విగ్రహాలు కనిపిస్తాయి. థాయ్‌లాండ్: థాయ్‌లాండ్‌లో 10వ శతాబ్దం నుంచే గణపతిని కొలుస్తారనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. తమిళం, థాయ్ భాషల్లో రాసిన శాసనాలపై కంచుతో తయారు చేసిన గణేశుడి ప్రతిమ ఫాంగ్ నా ప్రాంతంలో లభించింది. ఈ దేశంలో వ్యాపారస్తులు గణేశుడిని ఎక్కువగా పూజించి బంగారం, మిఠాయిలు సమర్పిస్తూ ఉంటారు. విజయ గణపతిగా కీర్తిస్తారు. సాంస్కృతిక నగరంగా పేరుగాంచిన చాకోఎంగ్సావో నగరం గణేశుడి నగరంగా ఖ్యాతి పొందింది. ఇక్కడ గణేశుడికి 3 ఆలయాలు ఉన్నాయి. బ్యాంకాక్‌లోని సెంట్రల్ వరల్డ్ ఎదురుగా గణేశుడి మండపం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. థాయ్ ప్రభుత్వంలోని ఫైన్ ఆర్ట్స్ శాఖ చిహ్నంగా గణేశుడే ఉండడం విశేషం. చైనా: చైనాలో గణేశుడి పురాతన విగ్రహం తన్ హువాంగ్ ప్రాంతంలోని తవ్వకాలలో బయటపడింది. కుంగ్ హుస్సేన్ ప్రాంతంలోని గణేశుడి ఆలయం ఉన్నాయనడానికి 531 కాలం నాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం చైనాలో గణేశుడి ఒక నెగిటివ్ ఫోర్స్‌గా చూస్తారు. ఏదైనా పనికి అవరోధంగా నిలిచేవాడిగానే చిత్రీకరిస్తూ ఉంటారు. జపాన్: జపాన్‌లో 8వ శతాబ్దంలోనే గణేశుడిని పూజించినట్టు ఆధారాలున్నాయి. అత్యంత శక్తిమంతుడైన దేవుడిగా చూసేవారు. వ్యాపారులు, జూదగాళ్లు, కళాకారులు ఎక్కువగా గణేశుడిని ఆరాధించేవారు. బౌద్ధ ఆరామాలలో గణేశుడి విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. అఫ్గానిస్తాన్: అఫ్గానిస్తాన్‌లోని కాబూల్‌కి సమీపంలో గార్జెడ్లో 7–8 శతాబ్దాల్లోనే గణేశుడి విగ్రహం లభ్యమైంది. ఇండో ఆఫ్గాన్ మధ్య సంబంధాలకు ప్రతీకగా ఈ గణేశుడు ఉండేవాడని పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెప్పారు. టిబెట్: టిబెటన్ బుద్ధిజంలో కూడా గణేశుడి ఆరాధన ఉంది. 11వ శతాబ్దంలో తొలిసారిగా వినాయకుడిపై భారతీయ రచనలు ఎన్నింటినో టిబెటిక్ భాషలోకి అనువదించారు. టిబెట్ పురాణాల్లో కూడా గణేశుడి ప్రస్తావన ఉంది. లామాయిజం వ్యాప్తిలో గణేశుడ్ని కూడా వినియోగించుకున్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. చదవండి: గణేష్.. జోష్ -
పచ్చగా నిను కొలిచేమయ్యా.. చల్లగా చూడు మా బొజ్జ గణపయ్యా..
వినాయక చవితి... యువతరం గుండెల్లో పెట్టుకునే పండగ. ఆనందం, ఆధ్యాత్మిక భావన... వాడవాడల్లో నిండుగా వెలిగే పండగ. కొంతకాలంగా ‘పర్యావరణహితం’ యూత్ ఎజెండాలో మొదటి వరుసలో చేరింది. రసాయన రహిత విగ్రహాలను కొనుగోలు చేయడానికే యువతరంలో ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకు వేసి, మట్టితో విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణి చేస్తున్నారు. పర్యావరణహిత సందేశానికి రెక్కలు ఇస్తున్నారు... వినాయక చవితి యువతరం సొంతం చేసుకునే పండగ. పండగ ముందు పందిరిగుంజలు పాతడం నుంచి నిమజ్జనం వరకు ప్రతిక్షణం ఆధ్యాత్మిక భావన, ఆనందం వారి సొంతం. అయితే గత కొద్దికాలంగా ‘ఎకో–ఫ్రెండ్లీ గణేశ’ విగ్రహాల వైపు యూత్ మొగ్గుచూపుతోంది. వారిలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. లక్నోలోని ఐటీ కళాశాల ముందు గత అయిదు సంవత్సరాలుగా వినాయకుడి విగ్రహాలను అమ్ముతున్నాడు ఆకాష్ కుమార్. ‘గతంతో పోల్చితే మార్పు వచ్చిందనే చెప్పాలి. మట్టితో తయారు చేసిన గణేశుడి విగ్రహాలు కొనడానికి ప్రాధాన్యత ఇస్తున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉంది. కొద్దిపాటి కృత్రిమ రంగులు, ప్లాస్టిక్ అలంకరణను కూడా యువత ఇష్టపడడం లేదు’ అంటున్నాడు ఆకాష్ కుమార్. తనీష ఈసారి ఎకో–ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహాన్ని కొనుగోలు చేసింది. గత సంవత్సరం కొనుగోలు చేసిన విగ్రహంతో పోల్చితే ఆకర్షణీయంగా లేకపోవచ్చుగాక, కాని తన మనసుకు మాత్రం తృప్తిగా ఉంది. ‘ఆకర్షణీయమైన రసాయన రంగుల కంటే పర్యావరణం ముఖ్యం’ అంటుంది తనీష. మరో కస్టమర్ అనీష కూడా ఎకో–ఫ్రెండ్లీ విగ్రహాన్నే కొనుగోలు చేసింది. ‘నేను కొనడమే కాదు, ఇతరులు కూడా కొనేలా నా వంతు ప్రచారాన్ని చేస్తున్నాను’ అంటుంది అనీష. సాధారణ విగ్రహాలతో పోల్చితే పర్యావరణహిత వినాయక విగ్రహాల ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని కొనడానికి ఆసక్తి చూపడం విశేషం. సాధారణంగా కోల్‌కతాలో మట్టితో తయారు చేసిన విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. ముంబైలో మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగించి తయారు చేసే విగ్రహాలే ఎక్కువ. అయితే బాంద్రాలోని పాలి హిల్‌కు చెందిన యువత మట్టిని ఉపయోగించి విగ్రహాలు తయారు చేయడమే కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టి విగ్రహాలకు మధ్య తేడా గురించి ప్రచారం చేస్తున్నారు. ‘ఏదైనా మంచి విషయం చెబితే ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తారు చాలామంది. కాని మేము చెప్పే విషయాలను చాలా ఆసక్తిగా వింటున్నారు. మార్పు వస్తుందనే నమ్మకం వచ్చింది’ అంటున్నాడు మట్టితో వినాయక విగ్రహాలు తయారుచేసే సచిన్. బాంద్రా నుంచి బెంగళూరు వచ్చేద్దాం. బెంగళూరుకు చెందిన శ్రీ విద్యారణ్య యువక సంఘ, కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌తో కలిసి ఔషధ గింజలతో కూడిన పదివేల మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేశారు. జైపుర్‌కు చెందిన కెరీర్ కౌన్సెలర్ షల్లీ కపూర్ తన ఫ్రెండ్ శ్వేతతో కలిసి ‘పర్యావరణహిత వినాయక చవితి’ గురించి స్కూల్, కాలేజీలలో విస్తృతంగా ప్రచారం చేయడమే కాదు, మట్టితో చిన్న చిన్న వినాయక విగ్రహాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తుంది. ‘మార్పు అనేది యువతరంతోనే మొదలవుతుందనే బలమైన నమ్మకం ఉంది. అందుకే ఈ ప్రయత్నం’ అంటుంది శ్వేత. ‘నేను సొంతంగా గణేశుడి విగ్రహాన్ని తయారు చేయడం సంతోషంగా అనిపించింది. వర్క్‌షాప్‌లో నేర్చుకున్న, విన్న విషయాలను తల్లిదండ్రులతో పంచుకున్నాను’ అంటుంది అర్చనా గుప్తా. పదిమంది నడిచే బాటే ఆ తరువాత ట్రెండ్ అవుతుంది. యువతరంలో మొదలైన మార్పును చూస్తుంటే పర్యావరణహిత విగ్రహాలను ఇష్టపడే ధోరణి ట్రెండ్‌గా మారడానికి అట్టే కాలం పట్టకపోవచ్చు. -
Ganesh Chaturthi 2022: హైదరాబాద్‌లో గణేష్.. జోష్
సాక్షి, హైదరాబాద్: భక్తకోటి ఇష్టదైవం బొజ్జ గణపయ్య మరికొద్ది గంటల్లో కొలువుదీరేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాల కోసం నగరం శోభాయమానమైంది. వినాయక చవితి వేడుకలకు మండపాలు అందంగా ముస్తాబవుతున్నాయి. మహానగరం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మరోవైపు వినాయక విగ్రహాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితర వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ప్రధాన రహ దారులకు ఇరువైపులా అమ్మకాలతో సందడి నెలకొంది. పర్యావరణహిత మట్టి ప్రతిమల పట్ల నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ లాంటి ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే లక్షలాది విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశాయి. ధూల్‌పేట్, ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల అమ్మ కాలు మంగళవారంఆఖరి రోజు జోరుగా సాగాయి. విగ్రహాల తరలింపు, పూలు, పండ్లు, పూజావస్తువుల కొనుగోళ్ల కోసం జనం పెద్ద ఎత్తున రహదారులపైకి చేరడంతో నగరంలోని అనేక చోట్ల మంగళవారం ఉదయం నుంచే ట్రాఫిక్ రద్దీ నెలకొంది. వైవిధ్యమూర్తులు.. వైవిధ్యభరితమైన విగ్రహమూర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తిని ప్రతిబింబించే విగ్రహాలు, మహాభారత్ వినాయకుడు, అర్ధనారీశ్వరుడి సమక్షంలో కొలువైన బొజ్జ గణపయ్య, అంగరక్షకులు, సేవకుల సమక్షంలో మందిరంలో కొలువైన దేవదేవుడు, షిరిడీ సాయిబాబా ఆకృతిలో, ముంబై గణేశుడిగా.. ఇలా అనేక రకాల రూపాల్లో కొలువైన వినాయకుడు నవరాత్రి ఉత్సవాలకు సిద్ధంగా ఉన్నాడు. బహు ముఖ వినాయకుడు మరో ప్రత్యేక ఆకర్షణ. భక్తుల మదిని దోచే వివిధ రకాల భంగిమలు, ఆకృతు లతో, చక్కటి రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దిన విగ్రహాలు ఇప్పటికే మండపాలకు చేరుకు న్నాయి. గ్రేటర్ పరిధిలో సుమారు 50 వేలకు పైగా మండపాల్లో నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. సందడిగా మార్కెట్లు.. ధరలకు రెక్కలు వినాయక చవితి సందర్భంగా పూజ కోసం వినియోగించే 21 రకాల పత్రి, బంతిపూలు,మామిడి ఆకులు, మారేడు కాయల అమ్మకాలతో మార్కెట్లలో సందడి నెలకొంది. పండుగ సందర్భంగా పూల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్లలో బంతిపూలు కిలో రూ.70 వరకు ఉంటే పూల దుకాణాల వద్ద కిలో రూ.150 వరకు విక్రయించారు. బుధవారం ఒక్క రోజే సుమారు 21 టన్నులకు పైగా బంతి పూల విక్రయాలు జరిగినట్లు మార్కెట్ వర్గాల అంచనా. చామంతి పూలు హోల్‌సేల్‌గా కిలో రూ. 170 వరకు ఉంటే రిటైల్‌గా రూ.250 వరకు అమ్మారు. అలాగే గులాబీ, కనకాంబరాల ధరలు సైతం భారీగా పెరిగాయి. సెంట్ గులాబీలు హోల్‌సేల్ మార్కెట్లో రూ.200 కిలో చొప్పున, కనకాంబరాలు రూ.1000కి కిలో చొప్పున విక్రయించారు. పూల మార్కెట్ కిటకిట గోల్కొండ: వినాయక చవితిని పురస్కరించుకుని పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గుడిమల్కాపూర్‌లోని పి.ఇంద్రారెడ్డి పూల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. తడి, పొడి పూలు అంటూ విడివిడిగా బంతి, చామంతులను విక్రయించారు. ఒక్కరోజే మార్కెట్‌కు వంద వాహనాల్లో రికార్డుస్థాయిలో బంతిపూలు వచ్చాయని వర్తకుల సంఘం ప్రతినిధి దేవర శ్రీనివాస్ తెలిపారు. -
గణేశ్ విగ్రహాల ధరలు పెరిగాయ్... ఎందుకంటే..
ముంబై: పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంట గ్యాస్ ధరలతో సతమతమవుతున్న వినాయకుని భక్తులకు గణేశ్ విగ్రహాలు, అలంకరణ సామాగ్రి ధరలు కూడా తోడయ్యాయి. విగ్రహాల తయారీకి ఉపయోగించే నల్ల మట్టి, రంగులు, ఇనుప చువ్వలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ), కలప తదితర సామాగ్రి ధరలు 25–30 శాతం పెరిగాయి. అంతేగాకుండా వర్క్ షాపుల్లో విగ్రహాలను తయారుచేసే కళాకారులు, కార్మికుల జీతాలు కూడా పెంచాల్సి వచ్చింది. ఫలితంగా విగ్రహాల ధరలు పెంచక తప్పలేదని తయారీదారులు అంటున్నారు. విగ్రహాలతోపాటు మండపాల నిర్మాణానికి వినియోగించే వెదురు బొంగులు, ప్లాస్టిక్ పేపర్లు, తాడ్పత్రి, అలాగే «థర్మాకోల్, గ్లూ, రంగురంగుల కాగితాలు, విద్యుత్ దీపాలు, లేజర్ లైట్ల తోరణాలు తదితర అలంకరణ సామాగ్రి ధరలు 10–20 శాతం పెరిగాయి. అదేవిధంగా పూజా సాహిత్యం ధరలు 20–25 శాతం పెరిగాయి. దీంతో ఈ ఏడాది గణేశోత్సవాలు నిర్వహించే పేదలు, మధ్య తరగతి కుటుంబాల ఆర్ధిక అంచనాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఉత్సవాలకు భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్ధితి వచ్చింది. పెరిగిన సామాగ్రి ధరల ప్రభావం సార్వజనిక గణేశోత్సవ మండళ్లపై అంతగా పడకపోయినప్పటికీ ముఖ్యంగా ఇళ్లలో ప్రతిష్టించుకుని పేదలు, సామాన్య భక్తులపై తీవ్రంగా చూపనుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సార్వజనిక గణేశోత్సవ మండళ్లు, ఇళ్లలో ప్రతిష్టించుకునే వారు ఉత్సవాలు సాదాసీదాగా నిర్వహించారు. అలంకరణ పనులకు కూడా చాలా తక్కువ స్ధాయిలో ఖర్చు చేశారు. కానీ ఈసారి బీజేపీ ప్రభుత్వం ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో ఇళ్లలో ప్రతిష్టించుకునే వారు, సార్వజనిక మండళ్లు భారీగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కానీ విగ్రహాల ధరలు, అలంకరణ సామాగ్రి ధరలు పెరగడంతో ఉత్సవాలపై నీళ్లు చల్లాల్సిన పరిస్ధితి వచ్చింది. వరదలతో తయారీకి ఇక్కట్లు... గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి అన్ని వస్తువులకు భారీగా ధరలు పెరిగాయి. గత సంవత్సరం కేజీ పీఓపీ రూ.130 లభించగా ఇప్పుడు రూ.210పైగా లభిస్తోంది. అంతేగాకుండా రంగుల ధరలు 10–20 శాతం, ఇనుప చువ్వల ధరలు 50–60 శాతం మేర పెరిగాయి. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక జిలాలలో వరదలు వచ్చాయి. అలాగే గుజరాత్లో కూడా కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి నుంచి వర్క్ షాపుల్లోకి రావల్సిన కలప నిలిచిపోయింది. దీంతో కొరత ఏర్పడడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. సామాగ్రి ధరలు పెరిగినప్పటికీ కొనుగోలు చేయకతప్పడం లేదు. చౌక ధర సామాగ్రి వినియోగిస్తే విగ్రహాల నాణ్యత దెబ్బతింటుంది. దీంతో గత్యంతరం లేక విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని బడా విగ్రహాల తయారీదారులు అంటున్నారు. వలస కూలీలు తిరిగిరాలేదు.. కరోనా కాలంలో అమలుచేసిన లాక్డౌన్ వల్ల ఉపాధి లేక అనేక మంది కళాకారులు, కార్మికులు స్వగ్రామాలకు తరలిపోయారు. అందులో అనేక మంది తిరిగి రాలేకపోయారు. దీంతో కళాకారులు, కార్మికుల కొరత ఏర్పడింది. వారికి కూడా ఎక్కువ కూలీ, వేతనాలిచ్చి రాష్ట్రానికి రప్పించాల్సిన దుస్ధితి వచ్చింది. ఎక్కువ జీతంతో పనులు చేయించుకోవల్సి వస్తోందని విగ్రహాల తయారీదారుడు రాహుల్ ఘోణే పేర్కొన్నారు. మరో విగ్రహాల తయారిదారుడు ప్రశాంత్ దేశాయ్ మాట్లాడుతూ రెండు, నాలుగు అడుగులోపు విగ్రహాలు తయారు చేయడం కొంత గిట్టుబాటు అవుతుంది. అందులో ఇనుప చువ్వలు, కలప వినియోగం ఉండదు. కాని భారీ విగ్రహాలు తయారు చేయాలంటే ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఇందులో ఇనుప చువ్వలు, కలప పెద్ద మాత్రలో వినియోగించాల్సి ఉంటుంది. దీంతో ధరలు పెంచడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదంటున్నారు. విగ్రహాల డిమాండ్ పెరిగింది. కాని సమయం తక్కువగా ఉండడంతో కళాకారులకు, కార్మికులకు ఓవర్ టైం డబ్బులు చెల్లించడంతో భోజన, బస వసతులు కల్పించి పనులు చేయించుకోవల్సిన పరిస్ధితి వచ్చిందంటున్నారు. ఇలా అన్ని విధాల ఖర్చులు పెరగడంతో విగ్రహాల ధరలు పెంచకతప్పడం లేదని వారు వాపోతున్నారు. -
వినాయకుడి విగ్రహాల తయారీ (ఫొటోలు)
-
గణేష్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తాం
-
కుతుబ్ మినార్ తవ్వకాలపై మంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ
న్యూఢిల్లీ: ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న కుతుబ్ మినార్ వార్తల్లోకి ఎక్కింది. అదొక ఆలయం అనే వాదన.. ఈ చారిత్రక కట్టడం చుట్టూ తిరుగుతోంది. ఢిల్లీలోని కుతుబ్ మినార్‌లో తవ్వకాలు జరిపాలని భారత పురావస్తు శాఖను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆ శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. జ్ఞానవాపి మసీదు సర్వే నేపథ్యంలో కుతుబ్ మినార్ నిర్మాణం కింద కూడా హిందూ, జైన్ ఆలయాలున్నాయని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి సమయంలో కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశించినట్టుగా వార్తలు చక్కెర్లు కొట్టడంతో.. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. మరోవైపు పురావస్తు శాఖ మాత్రం తవ్వకాల విషయంపై స్పందించలేదు. మరోవైపు శనివారం కుతుబ్‌మినార్‌ను పురావస్తు శాఖ అధికారులు సందర్శించడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఆర్కియాలజీ సర్వే దీనిని కట్టించెదవరు అనే విషయంపై పరిశోధనలు నిర్వహించబోతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే అది రెగ్యులర్ సందర్శనేని, ఎలాంటి పరిశోధన కోసం రాలేదని అధికారులు ఆ తర్వాత స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. 12వ శతాబ్ధానికి చెందినదిగా భావిస్తున్న కుతుబ్‌మినార్ కట్టడపు కాంప్లెక్స్‌లో ఉన్న రెండు గణేష్ విగ్రహాలను.. తదుపరి ఆదేశాల ఇచ్చేంతవరకు తొలగించవద్దని గతంలో ఢిల్లీ కోర్టు ASIని ఆదేశించింది. రెండు విగ్రహాలను ‘ఉల్టా గణేష్’, ‘పంజరంలో వినాయకుడు’గా పిలుస్తున్నారు. కుతుబ్‌మినార్‌ను UNESCO 1993లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఆ ఆలయాలను పునర్నిర్మించాలి దేశంలో ఒకప్పుడు ధ్వంసం చేసిన ఆలయాలన్నిటినీ పునర్నిర్మించాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. గోవాలో పోర్చుగీసు పరిపాలనలో ధ్వంసమైన ఆలయాలను తిరిగి నిర్మించడానికి తాము బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. గోవాలో సాంస్కృతిక టూరిజంను కూడా ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని సావంత్ తెలిపారు. చదవండి: అది కుతుబ్‌మినార్ కాదు.. సూర్య గోపురం!! -
హైదరాబాద్‌లో ఈ ఏడాది నిమజ్జన చెరువులు ఇవే..
సాక్షి, సిటీబ్యూరో: త్వరలో రానున్న వినాయకచవితి పండుగను పురస్కరించుకొని వినాయక విగ్రహాల నిమజ్జనం, తదితర ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. వీలైనంత వరకు ఎక్కడికక్కడే స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. హుస్సేన్ సాగర్‌తో సహ 32 చెరువులు, కుంటల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిమజ్జనాలు చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. హుస్సేన్‌సాగర్‌తోపాటు మిగతా 31 చెరువుల వద్ద విగ్రహాల నిమజ్జనాల కోసం అవసరమైన క్రేన్లు, సిబ్బంది సమకూర్చుకునే పనిలో పడ్డారు. వినాయక విగ్రహాల నిమజ్జనాల కోసం హుస్సేన్‌సాగర్ వద్ద దాదాపు 55 పెద్ద క్రేన్లు (స్టాటిక్) అవసరమని భావిస్తున్నారు. వినాయక ఉత్సవాలకు సంబంధించి తీసుకునే చర్యలు, చేసే ఏర్పాట్లపై నివేదిక సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తదుపరి ఆదేశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోనున్నారు. ► హైదరాబాద్‌లో.. నిమజ్జనాల కోసం 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లు, జేసీబీలు తదితరమైనవి అందుబాటులో ఉంచుతారు. ► క్రేన్ల అద్దె, నిమజ్జనం చివరి రోజు వరకు వాటిని వినియోగించేందుకు అవసరమైన సిబ్బంది, తదితరమైన వాటికి దాదాపు రూ. 13.50 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ► ప్రధాన రహదారులతోపాటు నిమజ్జనానికి విగ్రహాలు ప్రయాణించే దాదాపు 350 కి.మీ.ల మేర మార్గాల్లో రోడ్లపై ఎలాంటి గుంతలు లేకుండా వాహనాలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేయనున్నారు. ► కరోనా నిరోధక చర్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. నిమజ్జన మార్గాల్లో శానిటైజర్లు,మాస్కు లు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. ► ప్రతియేటా మాదిరిగానే తాత్కాలిక టాయ్లెట్లు, తాగునీటి ఏర్పాట్లు, వైద్య కేంద్రాలు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించనున్నారు. నిమజ్జన చెరువులు ఇవే.. హుస్సేన్‌సాగర్, కాప్రా, చర్లపల్లి, నల్లచెరువు, నాగోల్, మన్సూరాబాద్ పెద్దచెరువు, సరూర్‌నగర్, మీర్ఆలం ట్యాంక్, పల్లెచెరువు, పత్తికుంట, జంగమ్మెట్, రాజన్నబావి, ఎర్రకుంట, దుర్గంచెరువు, గోపిచెరువు, మల్కం చెరువు, గంగారం పెద్దచెరువు, కొత్తకుంట(ప్రకాశ్‌నగర్), గుర్నాథం చెరువు, కైదమ్మకుంట, రాయసముద్రం, సాకి చెరువు, ఐడీఎల్, సున్నం చెరువు, హస్మత్‌పేట, అంబీరు చెరువు, వెన్నెలగడ్డ, పరికి చెరువు, లింగంచెరువు, కొత్తచెరువు, బండచెరువు, సఫిల్‌గూడ మినీట్యాంక్‌బండ్. పర్యావరణ గణపతికి జై పర్యావరణ గణపతి (మట్టి గణపతి)కి హెచ్ఎండీఏ జైకొట్టింది. ఈమేరకు తొలి మట్టి విగ్రహాన్ని శుక్రవారం స్పెషల్ సీఎస్, హెచ్ఎండీఎ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు అందజేశారు. ఆయన వెంట హెచ్ఎండీఎ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ పరంజ్యోతి కూడా ఉన్నారు. ప్రజలను మట్టి విగ్రహాల వైపు మళ్లించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. చదవండి: వైరల్: మంత్రి ట్రై చేశాడు కుదరలే.. పళ్లతో కట్ చేసేశాడు -
మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్
సాక్షి, బంజారాహిల్స్: ఈ ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. వచ్చే నెల 10వ తేదీనుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రి తలసాని అధ్యక్షతన గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సీహెచ్.మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, ప్రభుత్వ విప్ ప్రభాకర్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్రవీంద్ర, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు రాఘవరెడ్డి, భగవంతరావు, ఖైరతాబాద్ బాలాపూర్ సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ. .సెప్టెంబర్10న విగ్రహ ప్రతిష్టతో ప్రారంభమయ్యే ఉత్సవాలు 19న శోభాయాత్రతో నిమజ్జన కార్యక్రమం ముగుస్తుందన్నారు. చదవండి: ‘డబుల్’ ఇళ్ల పంపిణీ: సీఎం ఇంట్లో లిఫ్ట్ మాదిరే ఇక్కడ కూడా ఎలాంటి ఆంక్షలు లేవు... ►విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆంక్షలు లేవని, నిర్వాహకులు ఆయా ప్రాంతాల్లోని అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని భాగ్యనగర ఉత్సవ కమిటీ ప్రతినిధులకు స్పష్టత నిచ్చారు. ►ఈ విషయంలో పోలీసులనుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ►పోలీస్ అధికారులు కూడా ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు పనిచేసేలా ఆదేశాలివ్వాలని డీజీపీకి మంత్రి సూచించారు. ►ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణేష్ శోభాయాత్ర నిర్వహించే దారిలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు ధ్వంసం అయ్యాయని ఉత్సవకమిటీ నిర్వాహకులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ ప్రాంతాన్ని సోమవారం సందర్శించి మరమ్మతు పనులు చేపట్టాలని అక్కడే ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించారు. ►ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనానికి గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పోలీసులు సహకరించాలని, క్రేన్‌ను ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ విజ్ఞప్తి చేశారు. ►అత్యధిక విగ్రహాలను నిమజ్జనం చేసే హుస్సేన్ సాగర్, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, మీరాలం చెరువుల్లో పూడిక తొలగింపు పనులను చేపట్టాలని నిర్వాహకులు కోరగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌ను ఆదేశించారు. ►దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. పీసీబీ ఆధ్వర్యంంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీలు మల్లేశం, వాణీదేవి, దయానంద్ గుప్తా, కాటేపల్లి జనార్దన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటే‹Ù, హోంశాఖ ప్రత్యేక ప్ర«ధాన కార్యదర్శి రవిగుప్తా, మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్‌కుమార్, ఆర్అండ్బీ కార్యదర్శి సునీల్«శర్మ, ఈఎన్సీ గణపతి రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తులు క్యూ
-
తెలుగు రాష్ట్రాలో వినాయక చవితి శోభ
-
సాక్షి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
-
‘మట్టి గణపతులనే పూజిద్దాం’
సాక్షి, సిటీబ్యూరో: మట్టి గణపతిని పూజిద్దాం...పర్యావరణాన్ని రక్షిద్దామంటూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మట్టి గణపతులు పంపిణీ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడంలో ముందుందని మునిసిల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ అన్నారు. గురువారం మైహోం నవదీపలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతుల కార్యక్రమంలో తన కుమార్తెతో కలిసి మట్టివిగ్రహలు పంపిణీ చేశారు. ఉద్యోగులందరికీ మట్టి విగ్రహాలు హెచ్ఎండీఏ ఉద్యోగులందరికీ హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ మట్టి గణేష విగ్రహాలను పంపిణీ చేశారు. చీఫ్ అకౌంట్ ఆఫీసర్ శరత్ చంద్ర, సూపరింటెండెంట్ పరంజ్యోతి, పీఆర్ఓ లలిత ప్రతి ఉద్యోగికి మట్టి గణపతి తో పాటు తులసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు పర్యావరణ హితానికి అనుగుణంగా వ్యవహరించాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను విరివిగా పెంచాలని కోరారు. -
వినాయకుడికి వినమ్రతతో...
జైజై గణేశా.. జై బోలో గణేశా! మళ్లీ వినాయక చవితి వస్తోంది. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గణనాధుడి మహాపర్వదినం సందర్భంగా ఊరూ-వాడా మంటపాలతో ముస్తాబవుతున్నాయి. ప్రతి గల్లీలోని మంటపాల్లో గజాననుడు కొలువుదీరబోతున్నాడు. అయితే, ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలతో చేసే విగ్రహాలకు స్వస్తి పలుకుదాం. సర్వ విఘ్నాలను మాపే విగ్నేషుడి విగ్రహాలు ప్రకృతికి విఘాతం కలిగించరాదన్న లక్ష్యం కోసం అందరూ నడుం బిగించాల్సిన సమయమిది. గణనాధుడి మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం. ప్రకృతిని ఆరాదించే ఆ దేవదేవుడి ఆశీర్వచనాల కోసం నిండు మనసుతో కొలుద్దాం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రకృతిహితమైన గణనాథులను ఏర్పాటు చేసి మనవంతు సామాజిక కర్తవ్యాన్ని నెరవేర్చుదాం. నవరాత్రుల పాటు ఆ దేవదేవుడిని కొలవడానికి మీరు ఏర్పాటు చేసే అపురూపమైన మట్టి ప్రతిమల ఫోటోలను ‘సాక్షి’ పంపించండి. మీ సామాజిక కర్తవ్యాన్ని నలుగురికి తెలియజేసి అందరికీ స్పూర్తిగా నిలవండి. మీ నగరంలో, మీ ఊరిలో, మీ వీధిలో, మీ గల్లీలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే వినాయకుడి మట్టి ప్రతిమల ఫోటోలను మొబైల్ ద్వారా మాకు పంపించండి. ఫోటోతో పాటు ఎక్కడ నెలకొల్పిందీ, పేరు, ఊరు, వీధి, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలతో lordganapati@sakshi.comకు మెయిల్ ద్వారా పంపించండి. వాటిని మేము www.sakshi.com వెబ్ సైట్లో ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం... ప్రకృతిని కాపాడుకుందాం. నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం. -
విభిన్నరూపాల్లో ఉన్న గణేశుల నిమజ్జనం
-
నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
-
ఒకే చోట సకల దేవతల దర్శనం
-
భక్తి ముఖ్యం.. గణేశ్ విగ్రహాల ఎత్తుకాదు!
- హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్ హైదరాబాద్: గణేశ్ నవరాత్రుల సందర్భంగా నగరంలో ఏర్పాటుచేసే విగ్రహాల ఎత్తు తగ్గింపుపై ప్రజలకు విజ్ఞప్తిచేస్తామని హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్ చెప్పారు. భక్తి భావం ముఖ్యం కానీ, విగ్రహాల ఎత్తు ప్రాధాన్యం కాబోదని ఆయన అన్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు విగ్రహాల ఎత్తు విషయంలో ప్రచారం చేస్తామని తెలిపారు. రాయదుర్గంలోని మల్కం చెరువులో నిర్మించిన బేబీ పాండ్‌ను సోమవారం మేయర్ రాంమోహన్ పరిశీలించారు. చిన్న విగ్రహాల నిమజ్జనం కోసం నగరవ్యాప్తంగా బేబీ పాండ్స్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. భక్తితో పూజించిన గణేశ్ విగ్రహాలను ఆయా మండపాల నిర్వాహకులు తమ స్వహస్తాలతో నిమజ్జనం చేసేందుకు వీలుగా కొలనులను నిర్మించామన్నారు. -
ఆ విగ్రహాల ‘ఇనుము’ అక్రమార్కుల పరం
సాక్షి, సిటీబ్యూరో: దేవుడి విగ్రహాల తుక్కునూ వదిలిపెట్టకుండా రూ.కోట్లు స్వాహా చేస్తున్న ఘనుల భాగోతమిది.. భక్తజన నీరాజనాలతో నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడి విగ్రహాల తయారీలో వినియోగించే ఇనుము ఇపుడు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నగరంలో వినాయకనిమజ్జనం పూర్తయిన ప్రతిసారీ ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోన్న తంతు ఇది. వీరికి కళ్లెం వేయడం తమ పరిధిలో లేదని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు పేర్కొంటున్నారు. విలువ రూ.5 కోట్లు..? ఈసారి హుస్సేన్‌సాగర్‌లో నవరాత్రుల సందర్భంగా సుమారు 56 వేల విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. సుమారు పదివేల టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. ఇందులో ఇనుము(ఉక్కు) మూడువేల టన్నులు అంటే..30 లక్షల కిలోలు తుక్కుగా లభ్యమైందని అంచనా. దీనికి కిలో రూ.16 చొప్పున అక్రమార్కులు విక్రయించి సుమారు రూ.5 కోట్లు స్వాహా చేసినట్లు సమాచారం. నిమజ్జనం అనంతరం హుస్సేన్ సాగర్‌లో వ్యర్థాలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి హుస్సేన్‌సాగర్‌లో 56 వేల విగ్రహాలతోపాటు సాగర్‌లోకి చేరుకున్న ఎటువంటి వ్యర్థాలైనా తొలగించాల్సి ఉంది. ఇటీవల ఈ బాధ్యతను హెచ్ఎండీఏ తీసుకుంది. సాగర్ జలాశయం నుంచి తొలగించిన వ్యర్థాలన్నింటిని లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న డంపింగ్ యార్డులో వేస్తున్నారు. అక్కడి జీహెచ్ఎంసీ వాటిని తరలించాల్సి ఉంది. అయితే ఏటా నిమజ్జనం అవుతున్న విగ్రహాల నుంచి ఇనుమును కొందరు వ్యక్తులు తీసుకుని అమ్ముకుంటున్నారు. ఈ సారి కూడా వీరు అదే పనిలో నిమగ్నమయ్యారు. వద్దని వారించే సాహసం అధికారులు చేయలేకపోతున్నారు. నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్టీఆర్ మార్్గతోపాటు ట్యాంక్‌బండ్‌పై మొత్తం 23 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఆయా క్రేన్లు నిమజ్జనం చేసిన విగ్రహాల నుంచి ఇనుము తీసి అక్కడే పోగేస్తున్నారు. దీన్ని గంపగుత్తగా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు చేతులు కలిపి పెద్ద ఎత్తున ఉక్కును సేకరిస్తున్నారు. పెద్ద ఎత్తున పోగుచేసి ఒకేసారి అమ్మి కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారులే నేరుగా నిమజ్జన ప్రాంతాల నుంచి వాహనాల్లో ఉక్కును తీసుకెళ్తున్నారు. ఆదాయ వనరే అయినా.. సాధారణంగా ఆదాయ వనరులను పెంచుకునేందుకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తాయి. ఇందులో భాగంగా కొత్త మార్గాలను కూడా అన్వేషిస్తాయి. కాని నగరంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వినాయక విగ్రహాల ద్వారా వచ్చే ఇనుము ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా చెప్పవచ్చు. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం అయ్యే విగ్రహాల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. అంతేస్థాయిలో విగ్రహాలకు వాడే స్టీల్ కూడా పెరుగుతున్నట్లే. అయితే ఏటా వేల టన్నుల ఇనుమును తుక్కుగా విక్రయించడం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం తప్పక వస్తోంది. ఈ కాసుల రుచికి మరిగిన చాలా మంది ప్రైవేటు వ్యక్తులు ఏళ్లుగా ఇనుమును సేకరించి విక్రయిస్తున్నారు. ఎటువంటి ఖర్చు లేకుండా కోట్లు వెనకేసుకుంటున్నట్లు అధికారులే స్వయంగా చెబుతుండడం విషయం. ఇంత పెద్ద మొత్తంలో ఇనుము ద్వారా డబ్బులు అక్రమార్కుల జేబుల్లోకి పోతున్నా.. ఆదాయ వనరుగా మలచుకోవడంలో ప్రభుత్వ శాఖలు తీవ్రంగా విఫలమయ్యాయి. మొత్తం స్టీల్‌ని సేకరించి బహిరంగ వేలం వేస్తే.. అనుకున్న దానికంటే ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారులకు తెలియక కాదు. రాజకీయ అండదండలతో ఏమీ చేయలేకపోతున్నామని వారు నర్మగర్భంగా చెబుతున్నారు. టెండర్ వేస్తే బాగుంటుంది.. నిమజ్జమైన విగ్రహాల ఇనుమును సేకరించి వేలం వేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. వ్యర్థాల వెలికితీత పనుల్ని ప్రభుత్వం చేయిస్తుండగా.. దాన్ని ఫలితాన్ని మాత్రం వ్రైవేటు వ్యక్తులు అనుభవిస్తున్నారు. దినికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. స్థానిక వ్యక్తులు గ్రూప్‌గా ఏర్పడి ఇనుమును తీసుకెళ్లి అమ్ముకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థాల తొలగింపులో భాగంగా వచ్చే ఇనుమును వేలం వేసే అంశాన్ని జీహెచ్ఎంసీ పరిశీలించాలి. – టి.చిరంజీవులు, హెచ్ఎండీఏ కమిషనర్ -
కలుషిత జ్యూస్ తాగి 36మందికి అస్వస్థత
ముంబై: గణేశ్ విగ్రహాల నిమిజ్జనం ఊరేగింపులో భాగంగా పంపిణీ చేసిన జ్యూస్ తాగి 36 మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ముంబై పట్టణంలోని జోగేశ్వరి ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే వారిలో చికిత్స అనంతరం 17 మందిని డిశ్చార్జి చేయగా, 19 మంది మాత్రం ఆస్పత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. బాధితులకు ప్రాణపాయం లేదని వైద్యులు వెల్లడించినట్టు డీసీపీ మోహన్ దహికర్ చెప్పారు. గణేశ్ విగ్రహాల నిమిజ్జనం ఊరేగింపులో భాగంగా ఓ గ్రూప్ కలుషితమైన శీతాలపానియాన్ని పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. -
గణనాధులతో కిక్కిరిసిన ఎమ్జె మార్కెట్
-
ప్రపంచమంతటా ప్రథమ దేవుడు
సృష్టికి సంకేతం - గణపతి. అందుకే, ఆయనకు ప్రథమ పూజ చేస్తాం. సాక్షాత్తూ, ఈశ్వరుడు కూడా ఏ యుద్ధానికి వెళ్ళినా, ముందుగా గణపతి పూజ చేసి వెళ్ళేవాడని మన పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి దేవతలను ఒక్కటిగా పూజించే సంస్కృతి మన దేశానిది. అయితే, ప్రధానంగా ఏ దేవీదేవతలను ఆరాధిస్తున్నమన్న దాన్ని బట్టి ఆరు వైదికమతాలుగా పేర్కొన్నారు. ఈ షణ్మతాలలో గణపతిని ఆరాధించే వారు ‘గాణాపత్యులు’. గణపతి పేరు చెప్పగానే హిందువుల దేవుడనీ, మన దేశానికే పరిమితమనుకొంటే పొరపాటే. చైనా, జపాన్, శ్రీలంక, ఇండొనేసియా, థాయిలాండ్, కంబోడియా, ఇరాన్లలో గణపతి విగ్రహాలు, ఆరాధన కనిపిస్తాయి. జైనం, బౌద్ధాల్లోనూ వినాయకారాధన ఉంది. జైనంలో.. బౌద్ధంలో.. విఘ్నాధిపతే! మన విఘ్నాలకు అధిపతిగా కొలుచు కొనే గణపతికి సంపదలనిచ్చే కుబేరుడి గుణాలను కూడా జైన మతంలో ఆపాదించారు. ఏ కొత్త పని మొదలెట్టాలన్నా స్వామిని పూజించి, ఆ తరువాతే పని చేపట్టాలనే పద్ధతిని ఇవాళ్టికీ శ్వేతాంబర జైనులు పాటిస్తారు. బౌద్ధమతంలోనూ వినాయకుడున్నాడు. రాగతాళయు క్తంగా నృత్యం చేస్తున్న ‘నృత్త గణపతి’గా ఆయన బొమ్మలు కనిపిస్తాయి. అక్కడా విఘ్నాలను తొలగించే దేవుడిగానే ఆయనను కొలుస్తారు. జపాన్‌లో ప్రేమికుల దైవం గణపయ్యను జపాన్‌లో ‘కాంగిటెన్’ అంటారు. వారి దృష్టిలో అదృష్టప్రదాత. అక్కడి పెద్దవాళ్ళ దృష్టిలో ఆయన వ్యాపారంలో విజయమిచ్చే విఘ్నాధిపతైతే, ప్రేయసీప్రియులకు ‘ప్రణయదేవుడు’. ప్రేమ ఫలించడానికి వారు గణేశుణ్ణి పూజిస్తారు. థాయిలాండ్‌లో... ఫైనార్ట్స్ చిహ్నంలో... విద్య, వాణిజ్యం, కళలకు సంబంధించిన దేవుడు కాబట్టి, థాయి లాండ్లో ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనార్ట్స్’ చిహ్నంలోనూ గణేశుడి బొమ్మ ఉంటుంది. వ్యాపారానికీ, దౌత్యానికీ గణేశుడే అధిపతి అని బ్యాంకాక్ ప్రజల విశ్వాసం. అక్కడ ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’లో ఆయన విగ్రహముం టుంది. ఇక ఇండొనేసియాలో గణపతిని జ్ఞానప్రదాతగా కొలుస్తారు. ఇలా దేశదేశాల్లో గణపతి ఆరాధనున్నా, ప్రత్యేకించి భాద్రపద మాసంలో గణపతిని ప్రధానదైవంగా అర్చించే సంప్రదాయం మనది. ఇప్పటికీ ఏ దేవతా పూజ చేసినా మొదట గణపతి పూజ చేయకుండా చేయం కాబట్టి, మనందరం గాణాపత్యులమే. ఆయనే పరబ్రహ్మ స్వరూపమ్. ‘తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీ మహి, తన్నో దంతిః ప్రచోదయాత్’. - రెంటాల జయదేవ -
ఉచితంగా 7 వేల మట్టివినాయకుల పంపిణి
మారేడుపల్లి: హైదరాబాద్ నగరంలో 7 వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణి చేయనున్నట్లు లయన్స్ ఎంటర్ ప్రై జర్స్ క్లబ్ చైర్ పర్సన్ రమేష్ తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు గత మూడు సంవత్సరాలుగా ఉచితంగా మట్టి గణపతులను నగరంలో వివిధ ప్రాంతాలలో అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.సోమవారం మహేంద్రహిల్స్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం లక్ష యాబై వేల రుపాయల వ్యయంతో 7 వేల విగ్రహాలను కోనుగోలు చేశామని,ఈ విగ్రహాలను బుధవారం నాడు ఉచితంగా జంట నగర వాసులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.దిల్సుఖ్ నగర్ పిఅండ్‌టి కాలనీ,వెస్ట్‌మారేడుపల్లి పార్కు,సైనిక్‌పురి సాయిబాబా ఆఫిసర్ కాలనీ, బిహేచ్ఈఎల్ మహిళ కమ్యూనిటి హాల్ తో పాటు పలు సేంటర్ల వద్ద ఉచితంగా మట్టి వినాయకులను అందించానున్నట్లు రమేష్ తెలిపారు. లయన్స్ ఎంటర్ ప్రై జర్స్ క్లబ్,సుడే పౌండేషన్ సంయుక్తంగా ఉచిత వినాయక పంపిణి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో శశికాంత్,సందీప్ గోండ్రలా తో పాటు పలువురు పాల్గొన్నారు. -
గణనాధా...నువ్యైనా గమనించు
ప్రత్యర్థిని ‘పట్టు’ పట్టాల్సిన చేతులు మట్టి పిసుక్కుంటున్నాయి. అంతర్జాతీయ యవనికపై మువ్వన్నెల జెండా రెపరెపలాడించిన క్రీడాకారుడు... పొట్ట కూటి కోసం రంగులు పట్టుకున్నాడు. సాధించిన విజయాలకు గుర్తింపు లభిస్తే దర్జాగా జీవించాల్సిన ఆటగాడు... సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒలింపిక్ పతకం లక్ష్యంగా నిర్దేశించుకున్న కుర్రాడు... పూట గడిచేందుకు వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన యువ రెజ్లర్ దేవీసింగ్ ఠాకూర్ విషాద గాథ ఇది. ఇప్పటికే పేరు తెచ్చుకున్న క్రీడాకారులకు కోట్లాది రూపాయలు ఇచ్చే ప్రభుత్వాలు... ఇలాంటి మాణిక్యాలని మట్టిలోనే వదిలేస్తున్నాయి. మన వ్యవస్థలో ఉన్న లోపాలకు నిదర్శనం ఈ యువ క్రీడాకారుడి జీవితం... - యువ రెజ్లర్ దేవీసింగ్ విషాద గాథ - ప్రపంచ స్థాయిలో పతకాలు - ఆర్థిక భారంతో శిక్షణకు దూరం - వినాయక విగ్రహాల తయారీలో నిమగ్నం సాక్షి, హైదరాబాద్: దీక్షగా వినాయకుడి విగ్రహాన్ని తీర్చి దిద్దుతున్న ఈ 22 ఏళ్ల కుర్రాడి పేరు దేవీ సింగ్ ఠాకూర్... వినాయక చవితి సీజన్లో నాలుగు విగ్రహాలు తయారు చేస్తేగానీ ఆ కుటుంబానికి ఐదువేళ్లూ నోట్లోకి వెళ్లవు. హైదరాబాద్ పాతబస్తీలోని ధూల్‌పేట ప్రాంతంలో ఇలాంటి వాళ్లు చాలామందే ఉంటారు. ఈ సీజన్లో నాలుగు డబ్బులు సంపాదించుకోకపోతే... ఆ తర్వాత ఏడాదంతా ఇబ్బంది పడాలి. అందుకే రాత్రింబవళ్లు కష్టపడతారు. దేవీసింగ్ కూడా అదే పని చేస్తున్నాడు. అయితే అతను అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు తెచ్చిన రెజ్లర్. భారత్‌లో పెద్ద పెద్ద పేరున్న రెజ్లర్లను చిత్తు చేసిన వీరుడు. అతని దురదృష్టమో... వ్యవస్థలో లోపమో... కారణమేదైనా నైపుణ్యం ఉన్న ఓ గొప్ప క్రీడాకారుడు పేదరికాన్ని జయించడానికి తన కెరీర్‌ను త్యాగం చేశాడు. పతకాలు తేవాల్సిన ఆటగాడు పని కోసం వెతుక్కుంటున్నాడు. ఛత్రశాలలో శిక్షణ పాతబస్తీలో రెజ్లింగ్ చాలా ఫేమస్. ఇక్కడ చిన్నప్పుడే పిల్లలు ఈ ఆటపై మక్కువ పెంచుకుంటారు. దేవీసింగ్ కూడా అలా చిన్నతనంలోనే ఈ క్రీడ పట్ల ఆకర్షణ పెంచుకున్నాడు. మిగిలిన వాళ్లలా టైమ్‌పాస్ చేయకుండా బాగా కష్టపడి రాష్ట్ర స్థాయిలో వరుస విజయాలు సాధించాడు. ఆ తర్వాత ఢిల్లీలోని ప్రఖ్యాత ఛత్రశాల స్టేడియంలో సెలక్షన్స్‌కు వెళ్లి జాతీయ స్థాయిలో ఆకట్టుకున్నాడు. సుశీల్ కుమార్, యోగేశ్వర్‌దత్ సహా దేశంలో ప్రఖ్యాత రెజ్లర్లంతా ఇక్కడ శిక్షణ పొందినవారే. అక్కడ శిక్షణకు ఎంపికైతే భవిష్యత్‌లో అంతర్జాతీయ పతకాల వర్షం ఖాయం. ఎంతో పోటీ ఉండే ఆ సెలక్షన్స్‌లో దేశవ్యాప్తంగా వచ్చిన రెజర్లను ఓడించి దేవీసింగ్ శిక్షణకు ఎంపికయ్యాడు. అక్కడ శిక్షణ ఉచితం. కానీ భోజనం, బస, ఇతర ఖర్చులకు సొంతంగా డబ్బు సమకూర్చుకోవాలి. స్నేహితులు, తెలిసిన వారి సాయంతో గత ఏడాది వర కు అక్కడ శిక్షణ తీసుకున్నాడు. తనలో ఉన్న సహజ నైపుణ్యానికి మెరుగులు దిద్దడంతో దేవీసింగ్ అనతికాలంలోనే తన ఉనికిని చాటుకున్నాడు. జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో పతకాలు సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద రెజ్లర్లు ఆశ్చర్యపోయే ఫలితాలు సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంటికి వెళ్లొస్తానని చెప్పి... ఓ వైపు పతకాలు సాధిస్తున్నా ఎక్కడా ప్రోత్సాహం మాత్రం దొరకలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ శిక్షణ భారంగా మారింది. ఇక్కడ కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారింది. తండ్రి ఆరోగ్యం బాగోవడం లేదు. ఇద్దరు అక్కలకు పెళ్లి చేయాలి. ఈ స్థితిలో ఏమీ పాలుపోక గతేడాది హైదరాబాద్ రెలైక్కాడు. ఇంటికి వెళ్లొస్తా అని చెప్పిన దేవీసింగ్ మళ్లీ ఢిల్లీ ముఖం చూడలేదు. ఛత్రశాల నుంచి కోచ్‌లు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. కానీ వెళ్లలేని పరిస్థితి. కానీ అసలు కారణం మాత్రం ఆర్థిక ఇబ్బందులు. అత్యుత్తమ రెజ్లర్‌గా మారేందుకు శిక్షణతో పాటు ఫిట్నెస్ కోసం తగిన డైట్, ప్రొటీన్లతో కూడిన ఆహారం వంటివి ఎంతో అవసరం. ఎలా చూసుకున్నా అక్కడి ఖర్చును తాను అందుకోలేకపోతున్నాడు. దీంతో రెజ్లింగ్‌ను వదిలేశాడు. కుటుంబ పోషణ కోసం వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నాడు. దేవీసింగ్ సాధించిన ముఖ్య ఘనతలు 2011: ఆసియా క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం (థాయ్‌లాండ్) 2011: ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం (హంగెరీ) 2012: ఆసియా జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం (కజకిస్తాన్) స్థానిక పోటీలకే పరిమితం ఒలింపిక్ స్థాయి ఆటగాళ్లతో పోటీ పడిన ఆ కుర్రాడు ఇప్పుడు స్థానిక కుస్తీ పోటీలకే పరిమితమవుతున్నాడు. ఇందులో చాలా వాటిలో విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ రూ. 10 వేలు మాత్రమే. కొంత మంది నిర్వాహకులు అది కూడా ఎగ్గొడతారు. ‘హింద్ కేసరి’లాంటి పోటీల సమయంలో మాత్రం కాస్త హడావుడి ఉంటుంది. ఇక్కడ విజేతకు ప్రైజ్‌మనీగా బైక్ ఇస్తారు. ఇలా ఐదు బైక్‌లు తను గెలుచుకున్నాడు. కానీ ఆర్థిక ఇబ్బందులతో వాటిని అమ్ముకున్నాడు. నిజానికి దేవీసింగ్‌కు అనేకసార్లు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయిలో ఎంతో మంది ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఎవరూ నెరవేర్చలేదు. రెజ్లింగ్ పోటీల ముగింపు వేడుకలకు వచ్చి బహుమతి ఇచ్చి పొగడ్తలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ సాయం ఇప్పిస్తామంటున్నారు. కానీ మళ్లీ తనని ఎవరూ కనీసం తిరిగి పలకరించిన పాపాన పోలేదు. బజరంగ్నే భయపెట్టాడు రెజ్లర్‌గా దేవీసింగ్లో అపార ప్రతిభ ఉంది. దీనిని గుర్తించే ఛత్రశాలలో అతడిని అందరూ ప్రోత్సహించారు. అక్కడ రెజ్లర్ల మధ్య హోరాహోరీగా బౌట్లు జరుగుతాయి. ఇటీవల ‘అర్జున అవార్డు’ గెలుచుకున్న బజరంగ్ కుమార్ కూడా అక్కడే ప్రాక్టీస్ చేస్తాడు. దేవీసింగ్ ఏకంగా మూడుసార్లు బజరంగ్‌ను చిత్తుగా ఓడించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌కు ముందు భారత రెజ్లింగ్ జట్టుకు అమెరికాలో శిక్షణ కార్యక్రమం జరిగింది. అక్కడకు సీనియర్లతో పాటు దేవీసింగ్ కూడా వెళ్లాడు. ప్రాక్టీస్ సమయంలో దేవీసింగ్ లాంటి నైపుణ్యం ఉన్న కుర్రాడు కావాలని సుశీల్‌కుమార్ లాంటి స్టార్ రెజ్లర్ కోరుకున్నాడ ంటే... తన నైపుణ్యం ఎంతో గ్రహించవచ్చు. ఇక మరో స్టార్ యోగేశ్వర్ దత్... దేవీ సింగ్‌ను సొంత తమ్ముడిలా చూసుకున్నాడు. ఒక దశలో తన ఖర్చులు కూడా భరించాడు. ఇప్పుడు కూడా ఢిల్లీ రమ్మని యోగేశ్వర్ చెబుతున్నాడు. కానీ ‘అన్న’లా ఆదరిస్తున్న మనిషి మీద ఎంతకాలం భారం వేస్తామనే ఆలోచన ఈ కుర్రాడిది. ఒకవేళ వెళ్లి శిక్షణ తీసుకున్నా... ఇక్కడ కుటుంబం ఎలా గడవాలి? ధూల్‌పేటలో ఎక్కడో మూలన మురికివాడలో దేవీసింగ్ ఇల్లు ఉంది. కానీ యోగేశ్వర్, సుశీల్ ఎవరు వచ్చినా అక్కడికి వెళ్లి వస్తారు. ఈ కుర్రాడిని భారత రెజ్లింగ్ ప్రపంచం ఎంత ఇష్టపడుతుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. సాధించగలననే నమ్మకం ఉంది ఉద్యోగం కోసం చేయని ప్రయత్నం లేదు. ప్రాక్టీస్ మానుకుని చాలామంది పెద్దల వెంట తిరిగాను. కానీ ఎవరి నుంచి ఎలాంటి సహాయం, సహకారం రాలేదు. యోగేశ్వర్ భయ్యా రమ్మంటున్నాడు. కానీ నేను నా స్వార్థం చూసుకుని వెళ్లిపోతే ఇక్కడ నా కుటుంబం గడవదు. పైగా భయ్యాకు కూడా భారమే అవుతా. కొంత ఆర్థిక వెసులుబాటు ఉంటే రెజ్లింగ్‌పై దృష్టిపెట్టొచ్చు. నా వయసు ఇంకా 22 ఏళ్లే. కాబట్టి కచ్చితంగా ఇంకా చాలా సాధించగలననే నమ్మకం ఉంది.’ - దేవీసింగ్ -
సిద్ధమవుతున్న 'బాహుబలి'
త్వరలో వచ్చే వినాయక చవితికి ....గణనాధుడు సిద్ధం అవుతున్నాడు. సీజన్ బట్టి అన్నట్లుగా... విగ్రహాలు తయారు చేసేవాళ్లు కూడా ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. సూపర్ హిట్ సినిమాల్లో హీరోలుగా నటించిన వారిలా వినాయకుడి విగ్రహాలను రూపొందించడం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. గతంలో అపరిచితుడు, మగధీర, ఈగ, రోబోగా ...గణనాధులను రూపొందించిన తయారీదారులు ఈసారి.. ఆ క్రేజ్‌ను ఒడిసిపట్టుకున్నారు. దేశవ్యాప్తంగా భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్న 'బాహుబలి' చిత్రంలో హీరో ప్రభాస్ ...శివలింగాన్ని ఎత్తే దృశ్యాన్ని ప్రేరణగా తీసుకుని వినాయకుడిని బాహుబలిగా రూపుదిద్దుతున్నారు. వారి చేతుల్లో బాహుబలి మెరుగులు దిద్దుకుంటున్నాడు. అయితే ఈ బాహుబలుడు తయారయ్యేది ...రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదండోయ్... మహారాష్ట్రలోని షోలాపూర్ లో తయారు కావటం విశేషం. -
శ్రీనిధితో సాక్షి చిట్ చాట్
-
కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం
-
18 అడుగుల విగ్రహాలు చాలు..
సాక్షి, ముంబై: ఈ ఏడాది వినాయక చవితికి నగరంలో ఏర్పాటుచేయనున్న గజానన్ విగ్రహాల ఎత్తు 18 అడుగులకు మించరాదని బృహన్ ముంబై సార్వజనిక్ గణేషోత్సవ్ సమన్వయ సమితి (బీఎస్జీఎస్ఎస్) కోరింది. ఈ సమితి నగరంలో దాదాపు 1,400 మండళ్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఎత్తు ఎక్కువ ఉన్న విగ్రహాల తరలింపు చాలా కష్టంతో కూడుకున్నదని, కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని ఆ సమితి పేర్కొంది. నగరంలో చాలా చోట్ల రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉంటున్నాయని, విగ్రహాల సమయంలో వీటిలో వాహనం దిగబడితే ప్రమాదాలు జరిగి ప్రాణనష్టానికి ఆస్కారమున్నందున ఈసారి విగ్రహాలను 18 అడుగులకు మించి ఏర్పాటుచేయరాదని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా పర్యావరణానికి ఎలాంటి చేటు కలగకుండా ప్రభుత్వం గణేష్ మండళ్లకు విగ్రహాల తయారీ కోసం క్లేను అందచేయాల్సిందిగా బీఎస్జీఎస్ఎస్ కోరింది. ఇటీవల గణేష్ మండళ్ల ప్రతినిధులతో బీఎస్జీఎస్ఎస్ అధ్యక్షుడు నరేష్ దహిబావ్కర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రతిపాదనలు చేశారు. విగ్రహాల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులుగా క్లేను ఉపయోగించుకోవాల్సిందిగా మండళ్లను కోరారు. ప్రతి ఏడాది నగరంలో దాదాపు 1.8 లక్షల విగ్రహాల తయారీ జరుగుతోంది. వీటన్నింటిని క్లే ఉపయోగించి తయారు చేసినట్లయితే నీటి కాలుష్యాన్ని నివారించినవారమవుతామన్నారు. అంతేకాకుండా ఈసారి తాము విగ్రహాల ఎత్తు 18 అడుగుల కంటే కూడా మించరాదని పరిమితి విధించామన్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు ఉండడంతో భారీ విగ్రహాలను తరలించే సమయంలో ప్రమాదాలు చోటుచేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. విగ్రహాల ఎత్తును తగ్గించమని గత ఏడాదిలోనే తాము అన్ని మండళ్లకు వివరించామని దహిబావ్కర్ తెలిపారు. కాగా, లాల్బాగ్ సార్వజనిక్ గణేషోత్సవ్ మండల్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఆ మండల్ కార్యదర్శి స్వప్నిల్ పరబ్ మాట్లాడుతూ.. తమ మండల్ ఎన్నో యేళ్లుగా 20 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ గణేషుడ్ని చూడటానికి భక్తులు వస్తారు కాబట్టి ఈ ఏడాది కూడా 20 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
జోరుగా కొనసాగుతున్న నిమజ్జనం
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జన కార్యక్రమం జోరుగా కొనసాగుతోందని జీహెచ్ఎంసీ కృష్ణబాబు తెలిపారు. ఈ ఏడాది 75వేలకు పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందన్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన సమయంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కృష్ణబాబు తెలిపారు.న హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని పలుచోట్ల నిమజ్జనం వేగవంతం చేసినట్లు చెప్పారు. నిమజ్జనం అనంతరం ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేందుకు 2300 మంది కార్మికులను ఏర్పాటు చేసినట్లు కృష్ణబాబు తెలిపారు. ఆయన బుధవారం నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన కార్యక్రమాలను పరిశీలించారు. విగ్రహాల నిమజ్జనానికి 59 పెద్ద క్రేన్లు, 79 మొబైల్ క్రేన్లతో పాటు 85మంది గజ ఈతగాళ్లను నియమించినట్లు కృష్ణబాబు తెలిపారు. -
నిమజ్జనానికి తరలుతున్న గణనాధులు
హైదరాబాద్ : విఘ్నేశ్వరుడు తొలిపూజలందుకునే దేవుడు. తొమ్మిదిరోజుల పాటు నిత్య పూజలు అందుకున్నమహా గణపతి నిమజ్జనం ఇవాళ. భారతీయ వైదిక సంప్రదాయాలు, ధర్మం అంతా మొదట గణనాథుని నుంచే ప్రారంభమవుతుంది. ఏ కార్యక్రమంచేసినా, ఏ పూజచేసినా మొదట స్మరించుకునేంది, పూజలందుకునేది విఘ్నేశ్వరుడే. అందుకే మన పండుగుల్లో వినాయకుడు వెరీవెరీ స్పెషల్. ఆథ్మాత్మిక స్ఫూర్తిని, స్వాతంత్ర్య సమరస్ఫూర్తి, విభిన్న వర్గాల్లో మమేకతను పెంచిన గణేష్ నిమజ్జనోత్సవం హైదరాబాద్‌కు మరింత ప్రత్యేకం. దశాబ్దాలుగా అవాంతరాలు లేకుండా ఈ మహాయాత్ర సాగుతోంది. గణనాథులు నిమజ్జనానికి తరలి వస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. -
నిమజ్జనానికి తరలి వస్తున్న గణనాథులు
-
వినాయక విగ్రహ తయారీదారులపై బతుకుచిత్రం
-
నగరంలో బొజ్జ గణపయ్యలు