26 వినాయక మండపాల్లో లడ్డూల చోరీ | Laddu Chori In Vinayaka Mandapam In Nalgonda District | Sakshi
Sakshi News home page

26 వినాయక మండపాల్లో లడ్డూల చోరీ

Published Sun, Sep 4 2022 4:53 AM | Last Updated on Sun, Sep 4 2022 4:53 AM

Laddu Chori In Vinayaka Mandapam In Nalgonda District - Sakshi

చోరీకి యత్నించి రోడ్డుపై వదిలేసిన విగ్రహం 

చిట్యాల/మీర్‌పేట: వినాయకుడి చేతిలో పూ­జ­లందుకున్న లడ్డూ­లను గణేశ్‌ నిమజ్జనం రోజున వేలంలో వేలు, లక్షల రూపాయలు పెట్టి దక్కించుకుంటారు. అయితే నల్లగొండ జిల్లా చిట్యాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తులు లడ్డూ­లను ఎత్తుకెళ్లిపో­యా­రు. వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో్ల మండపాలను ఏర్పాటు చేసి గణేశ్‌ విగ్రహాలను ప్రతిష్టించారు.

అయితే, కొందరు దుండగులు పట్ట­ణంలోని 26 మండపాల్లో ఉన్న లడ్డూలను అపహరించుకుపోయారు. శివా­ల­యం వీధిలో ఏర్పాటు చేసిన గణేశ్‌ విగ్రహం నుంచి లడ్డూను అప­హరిస్తున్న క్రమంలో విగ్రహం చేయి విరిగిపోయింది. ఓ వార్డులో ల­డ్డూ చోరీకి వచ్చిన ఇద్దరు అనుమానితులను స్థానికులు పట్టుకుని పో­లీ­సులకు అప్పగించారు.

విచారణలో లడ్డూల చోరీ విషయం వెలుగు­లోకి వచ్చింది. కొన్ని మండపాల నిర్వాహకులు లడ్డూల చోరీ­పై   ఫిర్యాదు చేయలేదు. రంగారెడ్డి జిల్లా మీర్‌­పే­ట­లోని డీఎల్‌ఆర్‌ కాలనీవాసులు స్థానిక కమ్యూనిటీహాల్‌లో నెలకొ­ల్పిన వి­నాయకుడి విగ్రహాన్ని దొంగిలించే యత్నం చేశారు. అదికాస్తా విఫ­లమవడంతో చేసేది లేక విగ్రహాన్ని రోడ్డుపైనే వదిలేసి పారిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement