భక్తి ముఖ్యం.. గణేశ్ విగ్రహాల ఎత్తుకాదు!
- హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్
హైదరాబాద్: గణేశ్ నవరాత్రుల సందర్భంగా నగరంలో ఏర్పాటుచేసే విగ్రహాల ఎత్తు తగ్గింపుపై ప్రజలకు విజ్ఞప్తిచేస్తామని హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్ చెప్పారు. భక్తి భావం ముఖ్యం కానీ, విగ్రహాల ఎత్తు ప్రాధాన్యం కాబోదని ఆయన అన్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు విగ్రహాల ఎత్తు విషయంలో ప్రచారం చేస్తామని తెలిపారు.
రాయదుర్గంలోని మల్కం చెరువులో నిర్మించిన బేబీ పాండ్‌ను సోమవారం మేయర్ రాంమోహన్ పరిశీలించారు. చిన్న విగ్రహాల నిమజ్జనం కోసం నగరవ్యాప్తంగా బేబీ పాండ్స్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. భక్తితో పూజించిన గణేశ్ విగ్రహాలను ఆయా మండపాల నిర్వాహకులు తమ స్వహస్తాలతో నిమజ్జనం చేసేందుకు వీలుగా కొలనులను నిర్మించామన్నారు.