జీహెచ్‌ఎంసీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రభుత్వ సలహాదారుడు, ఎంపీ డి. శ్రీనివాస్
సాక్షి, సిటీబ్యూరో: భారీ వర్షం కారణంగా తలెత్తిన సమస్యలను సమన్వయంతో అధిగమించిన అధికారులను ప్రభుత్వ సలహాదారు, ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ ప్రశంసిం చారు. ఆదివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం అభినందించదగ్గ విషయమన్నారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలతో నగరంలో సమారు 3700 గుంతలు ఏర్పడ్డాయని, వాటిని పూడ్చి వేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నగర వాసులు మంచినీటిని వేడి చేసి చల్లార్చి త్రాగాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ బొంతురామ్మోహన్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.