సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్ల తవ్వకాలపై నిషేధం విధించినట్టు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హైదరాబాద్‌లో డ్రైనేజీ లీకేజీ లేకుండా, కొత్త రోడ్లు వేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు తెలిపారు. మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
నగరాన్ని విశ్వనగరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో 10 జోన్లు, 50 సర్కిళ్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. రూ. 2వేల కోట్లతో నగర ప్రజలకు మంచినీళ్లు అందిస్తున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేప్పట్టిందని, సీఎం కేసీఆర్ నగరంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారని తెలిపారు. హరిత హారంలో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 లక్షల మొక్కలు నాటబోతున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment