mayor bonthu rammohan
-
ఆ భవనాలను కూల్చివేస్తాం: మేయర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం ముంచెత్తడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలను మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. కేబీఆర్ పార్కులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో 267 మాన్సున్ ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచామని తెలిపారు.16 డిఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.70 జేసీబీలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. చెట్లు పడిన 10 ప్రాంతాల్లో వెంటనే క్లియర్ చేశామని పేర్కొన్నారు. అధికంగా నీళ్లు నిలిచిపోయే 30 ప్రాంతాలను గుర్తించామని.. అక్కడ నీళ్లు తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా నగరంలో 1500 శిథిల భవనాలను కూల్చివేశామని.. మరో 200 భవనాలను గుర్తించామన్నారు. వాటిని త్వరలోనే కూల్చివేస్తామని బొంతు రామ్మోహన్ వెల్లడించారు. -
‘వారి ధైర్యానికి ధన్యవాదాలు’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానే గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు ఎదురొడ్డి పోరాడుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి పారిశుధ్య కార్మికుల చేత అధికారులు పత్రిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, కమిషనర్ లోకేష్‌కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజీత్ కంపాటి పాల్గొన్నారు. (లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేసేదీ చెప్పలేం) ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. నగరాన్ని 20 వేలకు పైగా శానిటేషన్ సిబ్బంది శుభ్రం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండండి.. నగరాన్ని మేమే శుభ్రం చేస్తామంటూ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వైద్యులతో సమానంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో అడుగుపెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారని.. పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ధైర్యంగా పనిచేస్తున్నారన్నారు. మున్సిపల్ శాఖ సేవలు గుర్తించి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని వెల్లడించారు. జీహెచ్ఎంసీలో మరిన్ని మెరుగైన ప్రమాణాలు పెంచుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో పోల్చిస్తే హైదరాబాద్ మున్సిపాలిటీ మెరుగైన స్థానంలో ఉందన్నారు. ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. (తొలుత ఎన్నారై.. ఆ తర్వాత మర్కజ్ లింక్‌లే..) -
‘ఆయన స్పూర్తితోనే ‘అన్నపూర్ణ’ పథకం’
సాక్షి, హైదరాబాద్: ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు(కేటీఆర్) ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం అమీర్ పేట్లో జరిగిన ‘అన్నపూర్ణ’ పథకం ఆరేళ్ల వేడుకలో మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కార్పోరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దివ్వాంగుల సౌలభ్యం కొరకు ‘మొబైల్ అన్నపూర్ణ పథకం’ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇతర మెట్రో నగరాలకంటే హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అన్నపూర్ణ ఆహార పథకం ద్వారా ఆరేళ్లలో 150 ప్రాంతాల్లో 4 కోట్లమందికి ఆహారాన్ని అందించామన్నారు. అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ అన్నపూర్ణ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. కాగా అధికారులు నూతన విధానంతో ఆలోచించాలని, మరిన్ని వినూత్న పథకాలు తీసుకురావాలన్నారు. ఇక అన్నపూర్ణ భోజనం లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తరించాలని మంత్రి వ్యాఖ్యానించారు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ... నగరవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనలతో 150 కేంద్రాలను పెంచామన్నారు. ఎన్నో రాష్ట్రాలు అన్నపూర్ణ పథకంను అమలు చేస్తున్నాయని, అయితే కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయలేక చేతులెత్తేశాయన్నారు. తెలంగాణ జీహెచ్ఎంసీ మాత్రం ఈ పథకాన్ని విజయవంతగా అమలు చేస్తోందని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దూరదృష్టి కారణంగానే ఈ విజయం సాథ్యమైందని పేర్కొన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ... 6 ఏళ్ల క్రితం ఒక సెంటర్లో ప్రారంభించిన ఈ పథకం.. ఇప్పుడు 150 సెంటర్లకు పెరగడం అదృష్టమన్నారు. అనంతపురం జిల్లాలో తాను కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో పల్లెల్లో అన్నం అందించాలని పుట్టపర్తి సాయిబాబా తనకు చెప్పారని తెలిపారు. అలా ఆయన చెప్పడంతో తనలో కొత్త ఆలోచనలు వచ్చాయన్నారు. తాను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం వచ్చిందన్నారు. ఆయన స్పూర్తితోనే అన్నపూర్ణ పథకాన్ని అమలు చేశానన్నారు. కాగా నోట్ల రద్దు సమయంలో సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు సెంటర్లను పెంచమని ఆదేశించిడంతో 150 సెంటర్లలో ఈ పథకాన్ని అమలు చేశామన్నారు. -
నాగ్‌పూర్ ‘దారి’లో..
సాక్షి, హైదరాబాద్: ఒకే పిల్లర్‌పై ఒక వరుసలో ఫ్లైఓవర్, మరో వరుసలో మెట్రోరైలు, దిగువన రహదారిపై వాహనాలు.. ఇలాంటి దృశ్యం భవిష్యత్తులో నగరంలోనూ ఆవిష్కృతం కానుంది. మలిదశలో మెట్రోరైలు మార్గాలొచ్చే ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం నాగ్‌పూర్‌లోని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల పనులను మంగళవారం పరిశీలించింది. సిటీలో ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నా ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మెట్రోరైలు మార్గం వల్ల ఫ్లైఓవర్ల నిర్మాణం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో అవకాశామున్న ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ మార్గాలు నిర్మిస్తే ఒకే పిల్లర్‌పై రెండు వరుసల్లో మార్గాలు ఏర్పడనున్నాయి. ఒక వరుసలో మెట్రోరైలు, మరో వరుసలో ఇతర వాహనాలు ప్రయాణం చేసేందుకు వీలుంటుంది. ఈ విధానంతో భూసేకరణ, నిర్మాణ వ్యయం తగ్గుతుంది. సమయం కూడా కలిసొస్తుంది. ట్రాఫిక్ సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది. ఇలా విస్తృత ప్రయోజనాలు ఉండడంతో నాగ్‌పూర్‌లోని డబుల్ డెక్కర్ మార్గాల పనులను సిటీ బృందం పరిశీలించింది. వివిధ నగరాల్లోని ఉత్తమ విధానాలను, మనకు పనికొచ్చే పద్ధతులను పరిశీలించాలన్న మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు అధికారులు తాజాగా నాగ్‌పూర్‌ను సందర్శించారు. ఈ బృందంలో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్లు శ్రీధర్, జియావుద్దీన్, ఎస్ఈలు వెంకటరమణ, దత్తుపంత్, కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ తదితరులున్నారు. నాగ్‌పూర్ మెట్రోస్టేషన్లో మేయర్ రామ్మోహన్, అర్వింద్‌కుమార్ తదితరులు నాగ్‌పూర్‌లో ఇలా... నాగ్‌పూర్‌లో రూ.8,680 కోట్ల వ్యయంతో చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మేయర్, అధికారుల బృందం ప్రాజెక్ట్ అమలుపై అక్కడి ఉన్నతాధికారులతో సమావేశమైంది. దాదాపు 38.215 కిలోమీటర్ల పొడవుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ వినూత్నంగా ఉండడాన్ని గుర్తించారు. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లకు భూ, ఆస్తుల సేకరణ తక్కువగా ఉండడంతో పాటు ప్రాజెక్ట్ వ్యయంలో దాదాపు 40శాతం తగ్గినట్లు నాగ్‌పూర్ మెట్రో అధికారులు వివరించారు. మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ, ప్రత్యేకతలపై జీహెచ్ఎంసీ అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాజెక్ట్‌లో భాగంగా షటిల్ బస్ సర్వీసులు, బ్యాటరీ ద్వారా నడిచే వాహనాలు, ఫుట్‌పాత్‌లు, సైకిల్‌ట్రాక్‌లు తదితర సౌకర్యాలు కూడా ఉన్నాయి. నాగ్‌పూర్ మాదిరిగా పీపీపీ విధానంలో ఎస్టీపీలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని మేయర్ రామ్మోహన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నగరంలో నానల్‌నగర్–మాసబ్‌ట్యాంక్, బీహెచ్ఈఎల్–ఆల్విన్ మార్గాల్లో డబుల్ డెక్కర్లకు అవకాశం ఉంటుందని ఇంజినీర్లు అభిప్రాయపడ్డారు. నాగ్‌పూర్‌లో వర్షపునీరు రోడ్లపై నిల్వకుండా చేసిన ఏర్పాట్లు, వర్టికల్ గార్డెన్లు, అండర్‌పాస్‌లు తదితరమైనవి కూడా బృందం పరిశీలించింది. హైదరాబాద్‌ను సందర్శించాల్సిందిగా మేయర్ నాగ్‌పూర్ మెట్రో అధికారులను ఆహ్వానించారు. అధికారుల బృందం బుధవారం పుణెను సందర్శించనుంది. -
గ్రేటర్లో రోడ్ల తవ్వకాలపై నిషేధం
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్ల తవ్వకాలపై నిషేధం విధించినట్టు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హైదరాబాద్‌లో డ్రైనేజీ లీకేజీ లేకుండా, కొత్త రోడ్లు వేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు తెలిపారు. మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. నగరాన్ని విశ్వనగరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. జీహెచ్ఎంసీలో 10 జోన్లు, 50 సర్కిళ్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. రూ. 2వేల కోట్లతో నగర ప్రజలకు మంచినీళ్లు అందిస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేప్పట్టిందని, సీఎం కేసీఆర్ నగరంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారని తెలిపారు. హరిత హారంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 40 లక్షల మొక్కలు నాటబోతున్నామని చెప్పారు. -
జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : ఖైరతాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం కంప్యూటర్ సెక్షన్లోనే మంటలు చెలరేగడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే... జీహెచ్ఎంసీ కార్యాయంలోని మొదటి అంతస్తులో మంగళవారం ఉదయం మంటలు చెలరేగగా, ఈ ప్రమాదంలో అకౌంట్ సెక్షన్ మొత్తం పూర్తిగా దగ్దం అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మేయర్ బొంతు రామ్మోహన్ ఆరా మరోవైపు అగ్నిప్రమాద ఘటనపై మేయర్ బొంతు రామ్మోహన్ ఆరా తీశారు. ఘటనా స్థలానికిచేరుకున్న ఆయన ప్రమాదానికి గురైన భవనాన్ని పరిశీలించారు. ప్రమాదంపై పోలీస్ కేసు నమోదు చేయాలని జోనల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఒకే కాంప్లెక్స్‌లో పలు సర్కిల్ కార్యాలయాలతో ఇరుకుగా ఉన్న జోనల్ కార్యాలయం నుంచి సర్కిల్ కార్యాలయాలను ఆయా ప్రాంతాల్లో పూర్తయిన భవనాలకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ అగ్నిప్రమాదం వెనుక ఏమైనా కుట్రదాగివుందా? లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి వుంది. -
భక్తి ముఖ్యం.. గణేశ్ విగ్రహాల ఎత్తుకాదు!
- హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్ హైదరాబాద్: గణేశ్ నవరాత్రుల సందర్భంగా నగరంలో ఏర్పాటుచేసే విగ్రహాల ఎత్తు తగ్గింపుపై ప్రజలకు విజ్ఞప్తిచేస్తామని హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్ చెప్పారు. భక్తి భావం ముఖ్యం కానీ, విగ్రహాల ఎత్తు ప్రాధాన్యం కాబోదని ఆయన అన్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు విగ్రహాల ఎత్తు విషయంలో ప్రచారం చేస్తామని తెలిపారు. రాయదుర్గంలోని మల్కం చెరువులో నిర్మించిన బేబీ పాండ్‌ను సోమవారం మేయర్ రాంమోహన్ పరిశీలించారు. చిన్న విగ్రహాల నిమజ్జనం కోసం నగరవ్యాప్తంగా బేబీ పాండ్స్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. భక్తితో పూజించిన గణేశ్ విగ్రహాలను ఆయా మండపాల నిర్వాహకులు తమ స్వహస్తాలతో నిమజ్జనం చేసేందుకు వీలుగా కొలనులను నిర్మించామన్నారు. -
మేయర్ ఇన్ లవ్..
సాక్షి, సిటీబ్యూరో : ఫేస్బుక్కులు.. వాట్సప్పులు లేవు. సెల్ఫోన్లు.. ఎస్సెమ్మెస్‌లు కూడా లేవు. చాటింగ్‌లు.. ఔటింగ్‌లు.. ఈటింగ్లు అసలే లేవు. పార్కులు, సినిమాలు, షికార్లు జాన్తానై. ఇవేవీ లేకుండానే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, శ్రీదేవిల ప్రేమ మొగ్గతొడిగింది. మొదట వీరి ప్రేమకు శ్రీదేవి కుటుంబం నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా.. నెలరోజుల్లోనే ఆమోదం పొందింది. 2000–01లో ఓయూలో పబ్లిక్అడ్మినిస్ట్రేషన్లో పీజీలో చేరిన రామ్మోహన్ జూనియర్ శ్రీదేవి. విద్యార్థి రాజకీయాల్లో, తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో క్రియాశీలకంగా ఉన్న రామ్మోహన్.. శ్రీదేవి నడవడిక నచ్చి మనసులోని మాట బయట పెట్టాడు. 2001 జూలైలో మొగ్గతొడిగిన వీరి ప్రేమబంధం 2004 ఫిబ్రవరి7న వాలంటైన్స్‌డేకు వారం ముందు వివాహబంధంతో ఒక్కటి చేసింది. రామ్మోహన్ తరపువారి నుంచి అభ్యంతరాల్లేకపోయినా, శ్రీదేవి తరపు నుంచి వెంటనే గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో వనస్థలిపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం నెలరోజులకు శ్రీదేవి కుటుంబీకుల ఆమోదంతో జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో దావత్తో రెండు కుటుంబాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఉద్యమకాలంలో పోలీసు కేసులు, జైళ్లకు వెళ్లడం వంటివి చూసినప్పటికీ వెరవకుండా శ్రీదేవి స్థిరనిర్ణయంతో ఉండటం తనకెంతో నచ్చాయంటాడు రామ్మోహన్. ముందుండి పదుగురిని నడిపించడంలో ఆయన నాయకత్వం ఆకర్షించాయన్నారు శ్రీదేవి. ఆమె క్రియాశీల రాజకీయాల్లో లేనప్పటికీ, నైతిక అండదండలు, మద్దతు పుష్కలంగా ఉండేవి. వాటివల్లే ముందుకు వెళ్లగలిగానంటున్నారు రామ్మోహన్. మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా రామ్మోహన్‌కు చేదోడువాదోడుగా ఉంటూ ప్రచారంలోనూ వెన్నంటి నిలిచారు శ్రీదేవి. వరంగల్ జిల్లాకు చెందిన రామ్మోహన్ , ఇక్కడి అమీర్‌పేటకు చెందిన శ్రీదేవి ఊర్లు వేరైనా , కులాలు వేరైనా ఒక్కటిగా నిలిచారు. వీరికిద్దరు కూతుర్లు. కూజిత నాలుగో తరగతి, ఉషశ్రీ యూకేజీ చదువుతున్నారు. ఆదర్శవంతమైన మార్గంలో నడిచి నలుగురికి ఆదర్శంగా నిలిచారీ జంట. ఉద్యమంలో రామ్మోహన్ క్రియాశీల పాత్రను గుర్తించిన సీఎం కేసీఆర్..కాప్రా డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచాక మేయర్‌గా అవకాశం కల్పించడం తెలిసిందే. -
తాడ్బన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మేయర్
హైదరాబాద్ : నగరంలో కలకలం రేపిన తాడ్బన్ రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని మేయర్ పరిశీలించారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్బన్ వద్ద ఉన్న ప్రమాదకర మలుపును బుధవారం మేయర్ బొంతు రామ్మోహన్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో పాటు పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. తాడ్బన్ మూలమలుపు వద్ద చెట్ల కొమ్మలు తొలగించడంతో పాటు, సమీపంలోని నాలాను వెంటనే తొలగించాలని మేయర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. -
పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ ఆదర్శం
ఏఎస్రావు నగర్ : తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ)హైదరాబాద్, తెలంగాణ ఇండస్ట్రియల్ అసోసియేషన్, చర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో ఎన్ఎస్ఐసీలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక విధానానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు వస్తున్నాయని అన్నారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. నగరానికి మణిహారంలాగా 14 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు సన్నాహలు జరుగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పి.పావనీరెడ్డి, ఎంఎస్ఎంఈ డైరక్టర్ అరవింద్ పట్వారీ, తెలంగాణ ఇండస్ట్రీయల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె. సుధీర్‌రెడ్డి, ఎన్ఎస్ఐసీ మేనేజింగ్ డైరక్టర్ వెంకటచలపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన మేయర్ పారిశ్రామిక వేత్తల నుంచి వివరాలను తెలుసుకున్నారు. ప్రచారం లేక లక్ష్యానికి గండి.. ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ గురించి సరైన ప్రచారం లేక పోవటం వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరటం లేదని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఈ ఎగ్జిబిషన్ గురంచి ముందస్తు ప్రచారం చేస్తే చిన్న పరిశ్రమల వారికి ఎంతో ఉపయోగపడేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా అనేక స్టాల్స్ ఖాళీగా దర్శనం ఇచ్చాయి. పారిశ్రామిక వేత్తల కంటే రాజకీయ నాయకులే ఎక్కువగా కన్పించారు. దీంతో అతిథులు నిరుత్సాహపడ్డారు. -
బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకుంటుంది
చిక్కడపల్లి: బంగారు తెలంగాణలో భాగంగా అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ అదుకుంటున్నారని, అందులో భాగంగానే బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం బ్రాహ్మణ సదన్ నిర్మాణం, కార్పొరేషన్ ద్వారా రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని నగర మేయర్ బొంతు రాంమోహన్ అన్నారు, బుధవారం బ్రాహ్మణ యువసేన కో–ఆర్డినేటర్ పర్సా శ్రీధర్‌శర్మ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ మేయర్ బాబాఫసిఝొద్దీన్ , జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, కార్పొరేటర్ వి,శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంమోహన్ మాట్లాడుతూ భారత దేశ చరిత్రలోనే ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ అభినందనీయుడన్నారు. అధ్వానంగా మారిన రోడ్లకు మరమ్మతలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రేషం మల్లేష్,, ఆకుల శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, పాశం రవి, ప్రకాష్‌రెడ్డి, జనార్థన్ చౌదరి, కూరగాయల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
కూల్చివేతలను పరిశీలిస్తున్న మేయర్
హైదరాబాద్: నాలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపు మూడోరోజు కొనసాగుతోంది. ఈ కూల్చివేతలను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలిస్తున్నారు. మల్కచెరువు, రాయదుర్గం చెరువుల్లో అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. అలాగే, చెరువు లోతట్టు ప్రాంతంలోని బఫర్ జోన్లో నిర్మించిన పెద్ద షెడ్డును కూల్చివేస్తున్నారు. మేయర్ వెంట జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి కూడా ఉన్నారు. -
సమన్వయంతో పనిచేసిన అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: భారీ వర్షం కారణంగా తలెత్తిన సమస్యలను సమన్వయంతో అధిగమించిన అధికారులను ప్రభుత్వ సలహాదారు, ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ ప్రశంసిం చారు. ఆదివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం అభినందించదగ్గ విషయమన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలతో నగరంలో సమారు 3700 గుంతలు ఏర్పడ్డాయని, వాటిని పూడ్చి వేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నగర వాసులు మంచినీటిని వేడి చేసి చల్లార్చి త్రాగాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ బొంతురామ్మోహన్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
వర్షంపై భయపెట్టేలా పోస్టులు పెడితే కేసులే
సాక్షి,సిటీబ్యూరో: సామాజిక మధ్యమాల్లో అసత్యప్రచారాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే క్రిమినల్ కేసులు పెడతామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ కంట్రోల్‌రూమ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. తురక చెరువుకు గండిపడే ప్రమాదం ఉన్నందున పరిసరాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిం దిగా సూచించారు. చెరువు ప్రాంతాల్లో నిర్మాణాలు చేసినందునే వర్షాలకు సెల్లార్లు కుంగుతున్నాయని, వర్షం తగ్గకపోతే పిల్లర్లు కూడా కూలే ప్రమాదం ఉందన్నారు. బండారి లేఔట్ తదితర ప్రాంతాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హుస్సేన్‌సాగర్‌కు ప్రమాదం ఉందని, కాప్రా చెరువు తగ్గుతుందని సోషల్ మీడియాల్లో వస్తున్న ప్రచారాన్ని నమ్మరాదన్నారు. ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై క్రిమినల్ చర్యలకు వెనుకాడబోమన్నారు. -
రాష్ట్రమంతటా గ్రేటర్ కోనేర్ల ఫార్ములా
రాయదుర్గం: గణనాథుల నిమజ్జనం కోసం గ్రేటర్లో ఏర్పాటు చేస్తున్న కోనేర్ల నిర్మాణ ఫార్ములాను రాష్ట్రమంతటా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. వినాయక ప్రతిమల నిమజ్జనం కోసం నగరంలో 10 కోనేర్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో రాయదుర్గం మల్కం చెరువు వద్ద పూర్తయిన మొదటి కోనేరును శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు సాయిబాబా, హమీద్పటేల్లతో కలిసి మేయర్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, అధికారులు... ప్రజలతో కలిసి నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మేయర్ విలేకర్లతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశం, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో ఈ కోనేర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. వీటిని ప్రజలు అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం గ్రేటర్లో 10 కోనేర్ల నిర్మాణం చేపట్టామని, వచ్చే ఏడాది మరో 30–40 చెరువుల వద్ద నిమజ్జన కోనేర్లు నిర్మిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, చెరువులు కలుషితం కాకుండా చూడాలనే ఉద్దేశంతో కేరళ, బెంగళూర్లలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం అనుసరిస్తున్న ఫార్ములాను నగరంలో అమలు చేస్తున్నామన్నారు. ఈ కోనేర్లలో 7–8 ఫీట్ల గణనాథులను నిమజ్జనం చేయడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. పర్యావరణ స్పృహతో చాలాచోట్ల మట్టి గణపతులనే ప్రతిష్టించారని, భవిష్యత్తులో మొత్తం మట్టి గణనాథులనే వినియోగించేలా కృషి చేస్తామన్నారు. రూ. 6.95 కోట్ల వ్యయంతో.. జీహెచ్ఎంసీ ఇరిగేషన్ ఎస్ఈ వై.శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రూ.6.95 కోట్ల వ్యయంతో ఈ కోనేర్ల నిర్మాణం చేపట్టామన్నారు. కోనేర్లు 43(ఇంట్)43 చదరపు మీటర్ల పొడవు, వెడల్పు.. 4 మీటర్ల లోతుతో నిర్మించామని చెప్పారు. కోనేరులో రెండు వేల విగ్రహాలు నిమజ్జనం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతి కోనేరులో స్వచ్ఛమైన నీటినే వాడాలని ఆదేశించడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి కోనేర్లలో నింపుతున్నామన్నారు. ఎప్పటికప్పుడు విగ్రహాలు తొలగించి, నీటిని పంపింగ్ ద్వారా డ్రైనేజీలోకి వదిలి కోనేరులో శుభ్రమైన నీటిని నింపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్, ఈఈ మోహ¯ŒSరెడ్డి, డీఈ కిష్టప్ప, ఏఈ కనకయ్య, శానిటరీ సూపర్వైజర్ జలంధర్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
నగర రోడ్లను పరిశీలిస్తున్న మేయర్
హైదరాబాద్: నగరంలో గత పది రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్లన్ని అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. రహదారులపై ప్రయాణం నరక ప్రాయంగా మారింది. దీంతో రోడ్ల మరమ్మత్తులపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. వర్షాలకు దెబ్బకు కుదేలవుతున్న ప్రస్తుత రోడ్ల స్థానంలో వైట్ ట్యాపింగ్ రోడ్లు నిర్మిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. నగరంలోని 60 ప్రధాన రహదారుల్లో వైట్ ట్యాపింగ్ రోడ్లు నిర్మించాలని ఆలోచిస్తున్న అధికారులు ఈ మేరకు రోడ్లను పరిశీలిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచే నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులతో కలిసి రహదారులను పరిశీలిస్తున్నారు. -
జీహెచ్ఎంసీ మేయర్‌కు ఈ-చలానా
హైదరాబాద్ : హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడుపుతున్నవారిపై కొరడా ఝళిపిస్తున్న పోలీసులు.. రూల్స్ అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదనే చందంగా వ్యవహరిస్తున్నారు. శిరస్త్రాణం లేకుండా వాహనం నడిపిన నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు ఈ-చలాన్లు పంపి తమ వృత్తి ధర్మం నిర్వర్తించారు. నగరంలోని పారిశుద్ధ్య పనులు పరిశీలించడానికి అర్ధరాత్రి వేళ హెల్మెట్ లేకుండా బైక్‌పై పర్యటించిన నగర మేయర్ బొంతు రామ్మోహన్‌కు గురువారం ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్లు పంపారు. అయితే గ్రేటర్ ప్రథమ పౌరుడు ఆకస్మిక తనిఖీల పేరిట హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అంతే నెటిజన్లు తమ ప్రతాపం చూపించారు. సామాన్యుడికి ఓ రూల్, మేయర్‌కు మరో రూలా అంటూ విమర్శలు గుప్పించటంతో... ఎట్టకేలకు పోలీసులు...మేయర్ ఇంటికి ఈ-చలానా పంపించినట్లు సమాచారం.