నగర రోడ్లను పరిశీలిస్తున్న మేయర్ | GHMC Mayor Bonthu Rammohan Inspects Roads in Hyderabad | Sakshi
Sakshi News home page

నగర రోడ్లను పరిశీలిస్తున్న మేయర్

Published Mon, Aug 8 2016 11:20 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

GHMC Mayor Bonthu Rammohan Inspects Roads in Hyderabad

హైదరాబాద్: నగరంలో గత పది రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్లన్ని అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. రహదారులపై ప్రయాణం నరక ప్రాయంగా మారింది. దీంతో రోడ్ల మరమ్మత్తులపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. వర్షాలకు దెబ్బకు కుదేలవుతున్న ప్రస్తుత రోడ్ల స్థానంలో వైట్ ట్యాపింగ్ రోడ్లు నిర్మిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. నగరంలోని 60 ప్రధాన రహదారుల్లో వైట్ ట్యాపింగ్ రోడ్లు నిర్మించాలని ఆలోచిస్తున్న అధికారులు ఈ మేరకు రోడ్లను పరిశీలిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచే నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులతో కలిసి రహదారులను పరిశీలిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement