White topping roads
-
నగర రోడ్లను పరిశీలిస్తున్న మేయర్
హైదరాబాద్: నగరంలో గత పది రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్లన్ని అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. రహదారులపై ప్రయాణం నరక ప్రాయంగా మారింది. దీంతో రోడ్ల మరమ్మత్తులపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. వర్షాలకు దెబ్బకు కుదేలవుతున్న ప్రస్తుత రోడ్ల స్థానంలో వైట్ ట్యాపింగ్ రోడ్లు నిర్మిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. నగరంలోని 60 ప్రధాన రహదారుల్లో వైట్ ట్యాపింగ్ రోడ్లు నిర్మించాలని ఆలోచిస్తున్న అధికారులు ఈ మేరకు రోడ్లను పరిశీలిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచే నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులతో కలిసి రహదారులను పరిశీలిస్తున్నారు. -
‘వైట్ టాపింగ్’కు మంగళం!
బీటీ బాటలోనే జీహెచ్ఎంసీ సిటీబ్యూరో: నగరంలోని రోడ్లన్నింటినీ దశలవారీగా వైట్ టాపింగ్ రోడ్లుగా మార్చాలన్న నిర్ణయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ఉపసంహరించుకున్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్లో సింహభాగం నిధులను రోడ్ల కోసమే వెచ్చిస్తుండటం తెలిసిందే. అందులోనూ సుమారు రూ. 250 కోట్లు ఏటా బీటీ రోడ్ల రీ కార్పెటింగ్ పనుల కోసం వినియోగిస్తున్నారు. కొద్దికాలం క్రితం బంజారాహిల్స్ రోడ్డునెంబర్ 10లో ప్రయోగాత్మకంగా సిమెంట్ ఉత్పత్తిదారుల సమాఖ్య (సీఎంఏ) ఆధ్వర్యంలో వైట్‌టాపింగ్‌తో వేసిన కిలోమీటరు రోడ్డు బాగుండటంతో పాటు నగర ప్రజలనుంచి కూడా అలాంటి రోడ్లు కావాలనే డిమాండ్ వచ్చింది. దీంతో దశల వారీగా వైట్‌టాపింగ్ రోడ్లను నిర్మిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు అప్పట్లో ప్రకటించారు. తొలి దశలో భాగంగా 200 కి.మీ.ల రోడ్లను నిర్మిస్తామన్నారు. దశలవారీగా ప్రధాన మార్గాల్లోని దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర వైట్టాపింగ్రోడ్డుకు ప్రణాళికలు రూపొందించారు. వైట్ టాపింగ్ రోడ్ల వల్ల నిర్మాణ వ్యయం ఎక్కువైనప్పటికీ, ఏటా నిర్వహణ భారం తప్పడమే కాక 30 నుంచి 40 ఏళ్ల వరకు మన్నికగా ఉంటాయని, అప్పటి దాకా మరమ్మతులు కూడా అవసరం లేదని పేర్కొన్నారు. ఏటా 100 నుంచి 200 కి.మీ.ల మేర వీటిని నిర్మించాలని భావించారు. వైట్‌టాపింగ్ వల్ల జీహెచ్ఎంసీ ఖజనాపై ఒకేసారి అధిక భారం పడకుండా ఉండేందుకు చెల్లిం పులు కూడా దశలవారీగా చేయాలని యోచిం చారు. చేపట్టిన పనుల్లో ఏటా 20 శాతం నిధుల చొప్పున మొత్తం ఐదేళ్లలో చెల్లించేం దుకు ఆలోచనలు చేశారు. ైఎక్కడైనా నిర్మాణ లోపాలుంటే వాటిని సరిదిద్దేందుకూ ఈ సమయం కలిసి వస్తుందని అంచనా వేశారు. గత సంవత్సరాంతానికి 200 కి.మీ.ల మేర వైట్‌టాపింగ్ పనులు చేయాలని భావించారు. కానీ పనులు చేపట్టలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడంతో ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఎన్నికలు ముగిసి, కొత్తపాలకమండలి వచ్చాక కొత్తగా చేపట్టిన రోడ్లన్నీ బీటీవే. వందరోజుల ప్రణాళికలోనూ రూ. 200 కోట్లతో 569 బీటీ రోడ్ల పనులు ప్రారంభించారు తప్ప ైవె ట్టాపింగ్వి ప్రస్తావించలేదు. వైట్టాపింగ్వి ప్రస్తుతానికి లేవని సంబంధిత అధికారులు తెలిపారు. అందుకు కారణాలేమిటంటే మాత్రం చెప్పలేకపోతున్నారు. అయితే బీటీ కాంట్రాక్టర్ల తెర వెనుక మంత్రాంగం వల్లే వైట్‌టాపింగ్ పనులకు తిలోదకాలిచ్చారనేఆరోపణలు వెలువడుతున్నాయి. ఇటీవల మేయర్, కమిషనర్ బెంగళూర్ నగరాన్ని సందర్శించి వచ్చాక అక్కడి మాదిరిగా టెండర్ష్యూర్ విధానంలో వేస్తామన్నారు. ఆ విధానంలో రోడ్డు నిర్మాణంలోనే డక్టింగ్ తదితర పనులు పూర్తిచేస్తారు. ఒకసారి రోడ్డు వేశాక తవ్వరని, తద్వారా ఎక్కువకాలం మన్నుతాయని చెబుతున్నారు. బీటీ పనులు వేసిన మూణ్నాళ్లకే కొట్టుకుపోయి రాళ్లు తేలుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి మూడేళ్ల వరకు రోడ్ల నిర్వహణ కూడా కాంట్రాక్టర్లకే అప్పగించాలని యోచిస్తున్నారు. కాగా వందరోజుల ప్రణాళికలో భాగంగా వేగంగా బీటీరోడ్ల నిర్మాణంతోపాటు లే న్మార్కింగ్, జీబ్రా మార్కింగ్, పార్కింగ్మార్కింగ్, నైట్‌విజన్ రిఫ్లెక్టర్స్ ఏర్పాటు తదితర పనులు చేస్తున్నారు. -
మెరుపు రోడ్లు
కొత్త రహదారుల నిర్మాణం సిద్ధమవుతున్న జీహెచ్ఎంసీ 200 కి.మీ.ల వైట్‌టాపింగ్, 200 కి.మీ.లు బీటీ రోడ్ల ఎంపికకు కసరత్తు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో 400 కి.మీ.ల మేర కొత్త రోడ్లు రానున్నాయి. వీటిల్లో 200 కి.మీ.లు బీటీ రోడ్లు... మరో 200 కి.మీ.లు వైట్ టాపింగ్ రోడ్లు వేయాలని యోచిస్తున్నారు. జీహెచ్ఎంసీలో అన్ని రకాల రోడ్లు దాదాపు 8 వేల కి.మీ.ల మేర ఉన్నాయి. వీటికి మరమ్మతుల పేరిట ఏటా దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయినా... నాలుగు చినుకులు పడగానే పరిస్థితి షరా మామూలుగా మారుతోంది. ఇటీవల బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో నిర్మించిన వైట్‌టాపింగ్ రోడ్డు బాగుందని ప్రజలు కూడా భావిస్తున్నారు. దీంతో గ్రేటర్‌లోని ఐదు జోన్లకుగాను ఒక్కో దానిలో 40 కి.మీ.ల వంతున వైట్‌టాపింగ్ రోడ్లు వేయాలని భావిస్తున్నారు. మరో 40 కి.మీ.ల మేర బీటీ రోడ్లు వేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు మార్గాలు ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే పనులు మొదలు పెడతారు. వైట్‌టాపింగ్‌తో మేలని... బీటీ రోడ్లు వేసిన మూణ్నాళ్లకే కొట్టుకుపోతుండటంతో ఖర్చు ఎక్కువైనా వైట్‌టాపింగ్ రోడ్లే మేలని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ భావిస్తున్నారు. నగరానికి ఇవి అనువైనవే కాకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి కాబట్టి వీటిని నిర్మించాక రోడ్ల నిర్వహణ, మరమ్మతుల వ్యయాలు చాలా వరకు తగ్గుతాయి. వైట్‌టాపింగ్ రోడ్ల నిర్మాణానికి రెండు పద్ధతులను కమిషనర్ ఆలోచిస్తున్నారు. యధావిధిగా టెండర్లు పిలిచి కొన్ని మార్గాల్లో వైట్‌టాపింగ్ పనులు చేయాలని భావిస్తుండగా... మరికొన్ని మార్గాలకు సిమెంటు కంపెనీల యాజమాన్యాల సమాఖ్య సహకారంతో తక్కువ ఖర్చుతో నామినేషన్‌పై ఇవ్వాలని భావిస్తున్నారు. ఈమేరకు వారితో సంప్రదించిన కమిషనర్ వీలైనంత తక్కువ ఖర్చుతో వైట్‌టాపింగ్ రోడ్లు వేయాల్సిందిగా కోరినట్లు తెలిసింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ప్రయోగాత్మకంగా నిర్మించిన రోడ్డును సమాఖ్య ఉచితంగానే నిర్మించింది. సిమెంటు కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నందున, రాష్ట్ర రాజధాని నగరంలో వైట్‌టాపింగ్ రహదారులు వేయడం ద్వారా నగర ప్రతిష్ట పెరుగుతుందని... అందుకుగాను తగిన సహకారం అందించాల్సిందిగా కమిషనర్ వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.