‘వైట్ టాపింగ్’కు మంగళం!
బీటీ బాటలోనే జీహెచ్‌ఎంసీ
సిటీబ్యూరో: నగరంలోని రోడ్లన్నింటినీ దశలవారీగా వైట్ టాపింగ్ రోడ్లుగా మార్చాలన్న నిర్ణయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు ఉపసంహరించుకున్నారు. జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో సింహభాగం నిధులను రోడ్ల కోసమే వెచ్చిస్తుండటం తెలిసిందే. అందులోనూ సుమారు రూ. 250 కోట్లు ఏటా బీటీ రోడ్ల రీ కార్పెటింగ్ పనుల కోసం వినియోగిస్తున్నారు. కొద్దికాలం క్రితం బంజారాహిల్స్ రోడ్డునెంబర్ 10లో ప్రయోగాత్మకంగా సిమెంట్ ఉత్పత్తిదారుల సమాఖ్య (సీఎంఏ) ఆధ్వర్యంలో వైట్‌టాపింగ్‌తో వేసిన కిలోమీటరు రోడ్డు బాగుండటంతో పాటు నగర ప్రజలనుంచి కూడా అలాంటి రోడ్లు కావాలనే డిమాండ్ వచ్చింది. దీంతో దశల వారీగా వైట్‌టాపింగ్ రోడ్లను నిర్మిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు అప్పట్లో ప్రకటించారు. తొలి దశలో భాగంగా 200 కి.మీ.ల రోడ్లను నిర్మిస్తామన్నారు. దశలవారీగా ప్రధాన మార్గాల్లోని దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర వైట్‌టాపింగ్‌రోడ్డుకు ప్రణాళికలు రూపొందించారు. వైట్ టాపింగ్ రోడ్ల వల్ల నిర్మాణ వ్యయం ఎక్కువైనప్పటికీ, ఏటా నిర్వహణ భారం తప్పడమే కాక 30 నుంచి 40 ఏళ్ల వరకు మన్నికగా ఉంటాయని, అప్పటి దాకా మరమ్మతులు కూడా అవసరం లేదని పేర్కొన్నారు. ఏటా 100 నుంచి 200 కి.మీ.ల మేర వీటిని నిర్మించాలని భావించారు. వైట్‌టాపింగ్ వల్ల జీహెచ్‌ఎంసీ ఖజనాపై ఒకేసారి అధిక భారం పడకుండా ఉండేందుకు చెల్లిం పులు కూడా దశలవారీగా చేయాలని యోచిం చారు. చేపట్టిన పనుల్లో ఏటా 20 శాతం నిధుల చొప్పున మొత్తం ఐదేళ్లలో చెల్లించేం దుకు ఆలోచనలు చేశారు.
ైఎక్కడైనా నిర్మాణ లోపాలుంటే వాటిని సరిదిద్దేందుకూ ఈ సమయం కలిసి వస్తుందని అంచనా వేశారు. గత సంవత్సరాంతానికి 200 కి.మీ.ల మేర వైట్‌టాపింగ్ పనులు చేయాలని భావించారు. కానీ పనులు చేపట్టలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రావడంతో ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఎన్నికలు ముగిసి, కొత్తపాలకమండలి వచ్చాక కొత్తగా చేపట్టిన రోడ్లన్నీ బీటీవే. వందరోజుల ప్రణాళికలోనూ రూ. 200 కోట్లతో 569 బీటీ రోడ్ల పనులు ప్రారంభించారు తప్ప ైవె ట్‌టాపింగ్‌వి ప్రస్తావించలేదు. వైట్‌టాపింగ్‌వి ప్రస్తుతానికి లేవని సంబంధిత అధికారులు తెలిపారు. అందుకు కారణాలేమిటంటే మాత్రం చెప్పలేకపోతున్నారు. అయితే బీటీ కాంట్రాక్టర్ల తెర వెనుక మంత్రాంగం వల్లే వైట్‌టాపింగ్ పనులకు తిలోదకాలిచ్చారనేఆరోపణలు వెలువడుతున్నాయి. ఇటీవల మేయర్, కమిషనర్ బెంగళూర్ నగరాన్ని సందర్శించి వచ్చాక అక్కడి మాదిరిగా టెండర్‌ష్యూర్ విధానంలో వేస్తామన్నారు. ఆ విధానంలో రోడ్డు నిర్మాణంలోనే డక్టింగ్ తదితర పనులు పూర్తిచేస్తారు. ఒకసారి రోడ్డు వేశాక తవ్వరని, తద్వారా ఎక్కువకాలం మన్నుతాయని చెబుతున్నారు. బీటీ పనులు వేసిన మూణ్నాళ్లకే కొట్టుకుపోయి రాళ్లు తేలుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి మూడేళ్ల వరకు రోడ్ల నిర్వహణ కూడా కాంట్రాక్టర్లకే అప్పగించాలని యోచిస్తున్నారు. కాగా వందరోజుల ప్రణాళికలో భాగంగా వేగంగా బీటీరోడ్ల నిర్మాణంతోపాటు లే న్‌మార్కింగ్, జీబ్రా మార్కింగ్, పార్కింగ్‌మార్కింగ్, నైట్‌విజన్ రిఫ్లెక్టర్స్ ఏర్పాటు తదితర పనులు చేస్తున్నారు.