సాక్షి, హైదరాబాద్ : ఖైరతాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం కంప్యూటర్ సెక్షన్‌లోనే మంటలు చెలరేగడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే... జీహెచ్‌ఎంసీ కార్యాయంలోని మొదటి అంతస్తులో మంగళవారం ఉదయం మంటలు చెలరేగగా, ఈ ప్రమాదంలో అకౌంట్ సెక్షన్ మొత్తం పూర్తిగా దగ్దం అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
మేయర్ బొంతు రామ్మోహన్ ఆరా
మరోవైపు అగ్నిప్రమాద ఘటనపై మేయర్ బొంతు రామ్మోహన్ ఆరా తీశారు. ఘటనా స్థలానికిచేరుకున్న ఆయన ప్రమాదానికి గురైన భవనాన్ని పరిశీలించారు. ప్రమాదంపై పోలీస్ కేసు నమోదు చేయాలని జోనల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఒకే కాంప్లెక్స్‌లో పలు సర్కిల్ కార్యాలయాలతో ఇరుకుగా ఉన్న జోనల్ కార్యాలయం నుంచి సర్కిల్ కార్యాలయాలను ఆయా ప్రాంతాల్లో పూర్తయిన భవనాలకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ అగ్నిప్రమాదం వెనుక ఏమైనా కుట్రదాగివుందా? లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి వుంది.
Comments
Please login to add a commentAdd a comment