బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకుంటుంది | govt should secure bramhins life said mayor | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకుంటుంది

Published Thu, Oct 27 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మేయర్‌ బొంతు రాంమోహన్ తదితరులు

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మేయర్‌ బొంతు రాంమోహన్ తదితరులు

చిక్కడపల్లి: బంగారు తెలంగాణలో భాగంగా అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్‌ అదుకుంటున్నారని, అందులో భాగంగానే బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం బ్రాహ్మణ సదన్ నిర్మాణం, కార్పొరేషన్  ద్వారా రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని నగర మేయర్‌ బొంతు రాంమోహన్  అన్నారు,  బుధవారం బ్రాహ్మణ యువసేన కో–ఆర్డినేటర్‌ పర్సా శ్రీధర్‌శర్మ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఆయనతో పాటు డిప్యూటీ మేయర్‌ బాబాఫసిఝొద్దీన్ , జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ మెంబర్, కార్పొరేటర్‌ వి,శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంమోహన్ మాట్లాడుతూ భారత దేశ చరిత్రలోనే ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌ అభినందనీయుడన్నారు. అధ్వానంగా మారిన రోడ్లకు మరమ్మతలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు రేషం మల్లేష్,, ఆకుల శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, పాశం రవి,  ప్రకాష్‌రెడ్డి, జనార్థన్ చౌదరి, కూరగాయల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement