bramhins
-
మంచి ముహూర్తం చూడు స్వామీ!
సాక్షి, అనంతపురం : జిల్లా అంతటా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ రాజకీయ వేడి రాజుకుంది. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఎవరు కూడా కాస్తంత కూడా ఖాళీ లేకుండా బిజీగా గడిపేస్తున్నారు. మరో ఇరవై రోజుల వ్యవధిలో నేతల భవితవ్యం తేలిపోనుండడంతో తమ రాతలు గట్టిగా ఉండాలని భావిస్తున్న వారు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. అది ప్రచారమైనా..నామినేషన్ పర్వమైనా సమయం మంచిదా కాదా అంటూ బేరీజు వేసుకుంటున్నారు. రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు సెంటిమెంటు పిచ్చి కాస్త అధికంగానే ఉంటుంది. ఏం చేస్తే ఏమవుతుందోనని జాగ్రత్తగా ఆచితూచి అడుగేయడానికి సిద్ధపడుతుంటారు. నామినేషన్ల పండుగ ప్రారంభం కావడంతో శుభ ముహూర్తం కోసం పండితుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కరోజే.. నగర పాలక, స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్లు వేయడానికి ఈ నెల 9న (సోమవారం) అధికారికంగా ప్రారంభమైనా తొలిరోజు పౌర్ణమి కావడంతో అంత మంచిది కాదని భావించి ఎక్కువమంది నామినేషన్లు వేయడానికి సిద్ధపడలేదు. డమ్మీ నామినేషన్లే ఎక్కువగా వేశారు. ఇక రెండవ రోజు మంగళవారం అదీ అంత శ్రేష్టమైంది కాదన్నది కొందరి విశ్వాసం. ఎల్లుండి బుధవారం చివరి రోజే కాకుండా హస్త నక్షత్రం, విధియ కలసి రావడంతో మంచి ముహూర్తం ఉన్నరోజని పండితులంటున్నారు. అది కూడా ఉదయం 10 గంటల నుండి 12.30 వరకు బాగుంటుందని ముఖ్యంగా 11.32 గంటలకు రవిహోరలో అద్భుత ముహూర్తముంటుందని అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలలో ఉన్నవారికి మంచిదే కాకుండా ముహూర్తాల సెంటిమెంటు ఎంత వరకు వెళ్లిదంటే జాతకాలు, దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేని కమ్యూనిస్టులు కూడా స్నేహితుల వద్ద వీటి ప్రస్తావన తెస్తున్నారని పండితులే అంటున్నారు. జయాపజయాలు ఎలా ఉన్నా ఎవరికైనా జాగ్రత్త పడాలనుంటుందన్నది సత్యం. సెంటిమెంటు బలంగా మారింది చాలామంది నాయకులు నామినేషన్ల కోసం మంచి ముహూర్తాలను ఖరారు చేసుకున్నారు. ఈసారి సమయం తక్కువగా ఉన్నందున ఈ నెల 11న విధియ రోజు వచ్చే రెండు మూడు గంటల పాటు ఉండే ముహూర్తం మాత్రమే చాలా బలంగా ఉంది. ఇక గెలుపోటములు వారి నక్షత్ర జాతకాలను అనుసరించే సాగుతాయి. – కరణం వాసుదేవరావు, జ్యోతిష్యులు, రాప్తాడు -
ఇన్ని లక్షణాలున్న వధువు దొరికేనా..!
రాంచీ: తమకు ఎలాంటి వధువు, వరుడు కావాలో వివరిస్తూ వార్తా పత్రికల్లో, వెబ్సైట్లలో, మ్యారేజ్ బ్యూరోల్లో అనేక ప్రకటనలు వస్తుంటాయి. వాటిని మనం పరిశీలిస్తే.. అందంగా ఉండాలని, డబ్బుండాలని, ఉద్యోగం ఉండాలని కొందరు, పెళ్లయితే ఉద్యోగం మానేయాలని మరికొందరు.. ఇలా అనేక షరతులు కూడా పెడుతుంటారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఏవైనా తక్కువయ్యాయా అన్నట్లుగా.. ఆ కొరత తీర్చడానికి ఓ బ్రాహ్మణ యువకుడు వింత కోరికలతో ఓ వినూత్న ప్రకటన ఇచ్చాడు. జార్ఖండ్‌కు చెందిన డాక్టర్ అభినవ్ కుమార్ అనే యువకుడు వధువు కోసం ఇచ్చిన ప్రకటన ఆసక్తి రేపుతోంది. తన జీవితంలోకి రాబోయే వధువు అందంగా ఉంటూ నమ్మకమైన బ్రాహ్మణ వధువు కావాలని.. ఆమెలో అతివాద లక్షణాలున్నా అభ్యంతరం లేదని అంటున్నాడు. ఇవి మాత్రమే కాకుండా ఆమె ధనవంతురాలు, దేశభక్తురాలై ఉండాలని నిబంధనలు పెట్టాడు. ‘ఆమెకు మనదేశ సైనిక, క్రీడా సామర్థ్యాలను పెంచాలన్న కోరిక ఉండాలి. వంట కూడా బాగా వచ్చి ఉండాలి. పిల్లను పెంచడంలో నైపుణ్యం ఉండాలి, ఉద్యోగం చేస్తుండాలి' అని డిమాండ్లు పెట్టారు. ఇన్ని గుణాలున్న యువతి అసలు భూమి మీద ఉంటుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అతనిది అత్యాశ అని.. పురుషాధిపత్యానికి అద్దం పట్టేలా ఈ ప్రకటన ఉందంటూ అతడిని విమర్శిస్తున్నారు. -
బ్రాహ్మణులకు ‘నారాయణ ప్రసాదం’
కర్నూలు(అర్బన్): బ్రాహ్మణులు మృతి చెందితే వారి కుటుంబాలకు నారాయణ ప్రసాద పథకం ద్వారా ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తామని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ కోఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు తెలిపారు. శనివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా బియ్యం, కందిపప్పు, నూనె, నెయ్యి తదితర వస్తువులను అందించాలనుకునే వారు సంకల్‌బాగ్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలోని నగర సంఘం ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ను సంప్రదించాలన్నారు. ఈ దేవాలయంలోని వనానికి నారాయణవనం అని పేరు పెట్టామన్నారు. ఎండోమెంట్తో సంబంధం లేకుండా అర్చకులు, పురోహితుల ఉపనయనాలకు రూ.25 వేలు, చంద్రశేఖర్ పథకం ద్వారా వధూవరులకు రూ.1 లక్ష అందిస్తామన్నారు. త్వరలోనే కర్నూలు నగరంలో బ్రాహ్మణులు అపకర్మలు చేసుకునేందుకు భవనంతో పాటు విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పేద బ్రాహ్మణ విద్యార్థులకు హాస్టల్ వసతి, వేద పాఠశాల, వృద్ధాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి హెచ్‌కే మనోహర్‌రావు, నగర అధ్యక్షుడు కళ్లె చంద్రశేఖరశర్మ, ఉపాధ్యక్షుడు ఎస్ చంద్రశేఖర్, సీవీ దుర్గాప్రసాద్, శ్యాంసుందరశర్మ, హెచ్‌కే రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకుంటుంది
చిక్కడపల్లి: బంగారు తెలంగాణలో భాగంగా అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ అదుకుంటున్నారని, అందులో భాగంగానే బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం బ్రాహ్మణ సదన్ నిర్మాణం, కార్పొరేషన్ ద్వారా రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని నగర మేయర్ బొంతు రాంమోహన్ అన్నారు, బుధవారం బ్రాహ్మణ యువసేన కో–ఆర్డినేటర్ పర్సా శ్రీధర్‌శర్మ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ మేయర్ బాబాఫసిఝొద్దీన్ , జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, కార్పొరేటర్ వి,శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంమోహన్ మాట్లాడుతూ భారత దేశ చరిత్రలోనే ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ అభినందనీయుడన్నారు. అధ్వానంగా మారిన రోడ్లకు మరమ్మతలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రేషం మల్లేష్,, ఆకుల శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, పాశం రవి, ప్రకాష్‌రెడ్డి, జనార్థన్ చౌదరి, కూరగాయల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలి
– బ్రాహ్మణసేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ శ్రీశైలం: బ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ అన్నారు. ఆదివారం సాయంత్రం కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో బ్రాహ్మణ అర్చక, పురోహిత సంఘం ఉపాధ్యక్షులు గరుడాద్రి దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికంతో బాధపడే బ్రాహ్మణులకు చేయూతనిచ్చేందుకు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఏర్పాటైందన్నారు. భారతీ విద్యాపథకానికి సెప్టెంబర్ 30లోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. అలాగే చాణిక్య పథకం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఒక విడత ఆర్థిక చేయూత అందిస్తామని పేర్కొన్నారు. ఈ పథకానికి సెప్టెంబర్ 30లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య శ్రీశైల మండల అధికార ప్రతనిధిగా పద్మావతిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సదస్సుకు రాష్ట్ర కార్యదర్శి మనోహరరావు, బ్రాహ్మణ అర్చక, పురోహిత, సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెల్లాల మధుసూదశర్మ తదితరులు పాల్గొన్నారు.