సమావేశంలో మాట్లాడుతున్న జ్వాలాపురం శ్రీకాంత్
బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలి
Published Sun, Sep 18 2016 11:43 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
– బ్రాహ్మణసేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్
శ్రీశైలం: బ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ అన్నారు. ఆదివారం సాయంత్రం కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో బ్రాహ్మణ అర్చక, పురోహిత సంఘం ఉపాధ్యక్షులు గరుడాద్రి దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికంతో బాధపడే బ్రాహ్మణులకు చేయూతనిచ్చేందుకు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఏర్పాటైందన్నారు. భారతీ విద్యాపథకానికి సెప్టెంబర్ 30లోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. అలాగే చాణిక్య పథకం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఒక విడత ఆర్థిక చేయూత అందిస్తామని పేర్కొన్నారు. ఈ పథకానికి సెప్టెంబర్ 30లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య శ్రీశైల మండల అధికార ప్రతనిధిగా పద్మావతిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సదస్సుకు రాష్ట్ర కార్యదర్శి మనోహరరావు, బ్రాహ్మణ అర్చక, పురోహిత, సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెల్లాల మధుసూదశర్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement