chikkadapalli
-
ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు!
పట్టాదారులమంటూ.. కోర్టు ఆదేశం ఉందంటూ పోలీసులు బందోబస్తుతో నాడెం చెరువు తూమును ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకోవడంతో ధ్వంసం చేయించిన వారు తోక ముడిచారు. ఆ తర్వాత బుల్డోజర్ను సీజ్ చేసి కారకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా మూడు నెలల క్రితం జరిగిన సంఘటన. తాజాగా హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ బ్యాంకులో చెరువు భూమిని తనఖా పెట్టి రూ.12కోట్ల రుణం తీసుకోవడంతో నాడెం చెరువు పేరు తిరిగి తెరపైకి వచ్చింది. ఘట్కేసర్: చెరువులు, కుంటలు, జల వనరుల సంక్షరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి వారి మాటలకు భిన్నంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు లేకపోవడంతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. తాజాగా వెంకటాపూర్ నాడెం (నల్ల) చెరువులోని భూమిని తనఖా పెట్టి కొందరు రూ.12 కోట్ల రుణం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. నాడెం చెరువుపై ఆధారపడి వెంకటాపూర్‌కు చెందిన 105 మంది ముదిరాజ్ మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. నీటిని తొలగించే అధికారం లేకున్నా... రెవెన్యూ రికార్డులో ఉన్న చెరువును అందులో ఉన్న నీటిని తొలగించే అధికారం నీటి పారుదల శాఖ అధికారులకే ఉంది. నాడెం చెరువులో నీరు లేదంటూనే చెరువులో చేపలు పట్టొందంటూ కొందరు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్డు ఆర్డర్ ఉందని ఆగస్టు 3, 2022న పోలీస్‌బందో బస్తుతో చెరువు కల్వర్టును ధ్వంసం చేశారు. మత్స్యకారులు చెరువులోకి దిగితే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారని మత్స్యకారులు గతంలో ఆరోపించారు. తక్షణమే రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కోర్టు ఆదేశం చూపించాలని కోరడంతో తోక ముడుచుకున్నారు. పోలీసుల అండతోనే ధ్వంసం.. చెరువులో చేపలు పడితే కేసు పెడతామని గతంలో పోలీసులు బెదిరించారని మత్స్యకారులు పేర్కొన్నారు. పోలీసుల అండతోనే అక్రమార్కులు కల్వర్టు ధ్వంసం చేశారని అప్పట్లో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. మత్స్యకారుల నుంచి విషయం తెలుసుకున్న అధికారులు తూము ధ్వంసాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్రమార్కులపై రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్డు భవనాల శాఖాధికారులు ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఎన్ఓసీ ఇవ్వలేదు ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ పరమేశ్‌ను వివరణ కోరగా బ్యాంకు రుణం కోసం మేము ఎటువంటి ఎన్ఓసీ ఇవ్వలేదని తెలిపారు. బ్యాంకు డాక్యూమెంట్లు చూస్తే కాని ఏమి చెప్పలేమని పేర్కొన్నారు. చెరువు విస్తీర్ణం 62 ఎకరాలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ సర్వేనంబర్ 814, 816లో 62 ఎకరాల విస్తీర్ణంలో నాడెం చెరువును నీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఘట్కేసర్ పరిసరాల్లో భూమి విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను చెరువుపై పడింది. రాజకీయ నాయకుల అండతో నీటిని తొలగించి చెరువు లేకుండా చేయాలని యత్నిస్తున్నారు. చెరువులోని భూమికి రుణం ఎలా ఇచ్చారు.? భూమి పరిశీలించకుండానే చెరువులో నీట మునిగిన భూమికి బ్యాంకు ఎలా రుణం ఇచ్చిందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. లక్ష రుణం కోసం చెప్పులరిగేలా తిప్పుకునే బ్యాంకు అధికారులు నీటిలో ఉన్న భూమికి రుణం ఇవ్వడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!) -
పెట్రోల్ బంక్‌లో బైక్‌కు మంటలు
హైదరాబాద్: చిక్కడపల్లిలోని భారత్ పెట్రోల్ బంక్‌లో భారీ ప్రమాదం తప్పింది. స్కూటీలో పెట్రోల్ పోస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాహన యజమాని భయంతో బంక్ బయటకి పరిగెత్తాడు. అక్కడ ఉన్న బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిలిండర్‌తో స్ప్రే చేసినా మంటలు అదుపులోకి రాకపోవడంతో బంక్ సిబ్బంది అత్యవసరం కోసం నిల్వచేసిన ఇసుక బకెట్లను తెచ్చి బండిపై పోసి మంటలను ఆర్పివేశారు. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలను అన్వేషిస్తున్నారు. చదవండి: అంబర్‌పేట్‌లో విష వాయువుల కలకలం -
విషాదం: వంట చేస్తుండగా మంటలంటుకొని..
సాక్షి, చిక్కడపల్లి: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ మంటలంటుకొని చికిత్స పొందుతూ ఓ గృహిణి మృతి చెందిన ఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో జరిగింది. ఎస్ఐ కోటేశ్ వివరాల ప్రకారం.. బాగ్‌లింగంపల్లి పాలమూరుబస్తీలో నివాసముంటున్న బి.చిట్టి (24) గురువారం రాత్రి గ్యాస్ పొయ్యి పని చేయకపోవడంతో నాలుగో అంతస్తులో ఉన్న టెర్రస్‌పైన కట్టెల పొయ్యిపై వంట చేయడానికి వెళ్లింది. కట్టెల పొయ్యిలో కిరోసిన్ పోసిన సమయంలో మంటలు ఎక్కువగా వచ్చి బట్టలకు అంటుకున్నాయి. కేకలు వేయడంతో అక్కడే ఉన్న గంగాధర్, సాయిలు ఆమె పై బ్లాంకెట్ కప్పి మంటలు ఆర్పేందుకు యత్నించారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కర్నాటక బళ్లారికి చెందిన చిట్టి సోదరుడు రామ్ అంజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ శివశంకర్‌రావు పర్యవేక్షణలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 3 కోట్లు డిమాండ్; అబిడ్స్‌లో వదిలేశారు!
సాక్షి, హైదరాబాద్ : దోమలగూడకు చెందిన వ్యాపారి గజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరిగింది. తనను కిడ్నాప్ చేసి రూ. కోటి వసూలు చేసి విడిచిపెట్టారంటూ గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫార్చ్యూన్ ఫైనాన్స్ కేసులో దాదాపు రూ. 24 కోట్ల మేర మోసం చేశాడనే ఆరోపణలతో... గతంలో గజేంద్రప్రసాద్ అన్నను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో గజేంద్రప్రసాద్ కిడ్నాప్ కేసులో పలు అనుమానాలు తలెత్తున్నాయి. దీంతో గజేంద్ర ప్రసాద్ స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు... అసలు కిడ్నాప్ జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా చిక్కడపల్లిలో వ్యాపారవేత్త గజేందర్ ప్రసాద్ కిడ్నాప్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. దోమల్‌గూడ ప్రాంతానికి చెందిన గజేంద్ర ప్రసాద్ ఆటోమొబైల్ ఫైనాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనను కిడ్నాప్ చేశారు. అనంతరం మూడు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. అయితే కోటి రూపాయలు తీసుకుని సోమవారం ఉదయం ఆయనను అబిడ్స్‌లో విడిచిపెట్టారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మైనంపల్లికి త్రుటిలోతప్పిన ప్రమాదం
హైదరాబాద్: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. లిఫ్ట్ తెగిపడటంతో ఆయనతో పాటు మరో నలుగురికి స్వల్పగాయాలయ్యా యి. చిక్కడపల్లి సాయికృప హోటల్లోని నాల్గవ అంతస్తులో బుధవారం జరిగిన టీఆర్ఎస్ నేత ఎర్రం శ్రీనివాస్‌గుప్తా కుమారుడి తొట్టెల కార్యక్రమానికి మైనంపల్లి హాజరయ్యారు. శ్రీనివాస్‌గుప్తాను మైనంపల్లి అభినందించి తిరిగి వెళ్లిపోతున్న క్రమంలో వీడ్కోలు ఇచ్చేందుకు గుప్తాతో సహా స్థానికనేతలైన అమర్నాథ్రెడ్డి, బద్దం మోహన్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి లిఫ్ట్ ఎక్కారు. మూడో అంతస్తుకి రాగానే లిఫ్ట్‌వైరు తెగిపోవడంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దీంతో మైనంపల్లికి ఎడమకాలి తొడవద్ద గాయమైంది. ఆయన్ని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతున్న వారిని మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముఠాగోపాల్ పరామర్శించారు. లిఫ్ట్ నిర్వహణ పట్ల యాజమాన్యం శ్రద్ధ తీసుకోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు హోటల్ వద్ద ఆందోళన చేశారు. -
ఫీజు కట్టలేదని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్ : తల్లిదండ్రులు కాలేజీ ఫీజు కట్టలేదని మనస్తాపానికి గురయిన ఓ విద్యార్థిని బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. సుస్మిత (21) అనే విద్యార్థిని ఘట్కేసర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఈ నేపథ్యంలో కాలేజీ ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులకు చెప్పింది. అందుకు వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురయిన సుస్మిత మూడవ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుస్మితను విద్యానగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
చిక్కడపల్లి రైల్వే క్వార్టర్స్‌లో విషాదం
హైదరాబాద్: చిక్కడపల్లి రైల్వేక్వార్టర్స్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ బిల్డింగ్ మూడవ అంతస్తుపై నుంచి పడి శ్రావ్య అనే 18 నెల పాప మృతిచెందింది. శ్రావ్యను కాపాడబోయి పల్లవి అనే 13 సంవత్సరాల పాప కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరి మృతితో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
డూప్లికేట్ కెమెరా విక్రయించాడని..
ముషీరాబాద్/చిక్కడపల్లి : ఓఎల్ఎక్స్లో డూప్లికేట్ కెమెరా విక్రయించాడనే కోపంతో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేసిన సంఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాంనగర్ జెమిని కాలనీకి చెందిన ఆకాష్‌సింగ్ నెల రోజుల క్రితం ఓఎల్ఎక్స్లో తన కెమెరాను విక్రయానికి పెట్టగా, కిషన్‌బాగ్‌కు చెందిన కరన్‌వీర్‌సింగ్ రూ.15వేలకు కొనుగోలు చేశాడు. దానిని రిపేర్‌షాపులో చూపించగా డూప్లికేట్ అని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన కరణ్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గురువారం చిక్కడపల్లిలోని ఓ కెమెరా రిపేర్ దుకాణం వద్దకు రావాలని ఆకాశ్‌సింగ్ చెప్పడంతో కరన్‌వీర్‌సింగ్ అక్కడకు వచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన అక్కడే ఉన్న పేపర్లు కట్ చేసే బ్లేడ్‌తో ఆకాశ్‌సింగ్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ముషీరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తిరుమలగిరిలోని మిలటరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిక్కడపల్లి పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి ఏసిపి ప్రదీప్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో చిక్కడపల్లి డిఐ రాకేష్, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం: కేంద్ర మంత్రి గెహ్లాట్
సాక్షి, చిక్కడపల్లి(హైదరాబాద్): కేంద్ర సామాజిక న్యాయం శాఖ మంత్రిగా మూడున్నరేళ్లుగా ఆనందంగా పనిచేస్తున్నానని, తన శాఖలో మూడు గిన్నిస్ రికార్డులు రావడం గర్వకారణంగా ఉందని తావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల హక్కుల కోసం ప్రత్యేక చట్టం తెచ్చిందన్నారు. ఇక్కడి త్యాగరాయ గానసభలో వికలాంగుల హక్కుల చట్టం-2016 పై శనివారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 21 కేటగిరీలను చట్టంలోకి తెచ్చిన ఘనత తమదేనని, 3 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 4 శాతానికి పెంచామని, కళాశాలల్లో చేరికల కోసం 5 శాతం రిజర్వేషన్‌ను తమ ప్రభుత్వమే మొదలు పెట్టిందని వివరించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో 6 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, తెలంగాణలో కూడా ఇస్తే సంతోషమని అన్నారు. వికలాంగుల గుర్తింపు కార్డులు జిల్లాస్థాయిలో మాత్రమే కాదు దేశమంతా చెల్లుబాటయ్యేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఒక్క స్కూల్ అయినా ప్రారంభించిందా అని నిలదీశారు. 10 లక్షల మంది దివ్యాంగులలో 4 లక్షల మందికి మాత్రమే సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. మెట్రో రైలులో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వికలాంగులకు కేంద్రం అమలు జరిపే పథకాలపై అవగాహన కల్పిస్తామని, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు త్వరలో వికలాంగుల హక్కుల భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు రాములు కూడా పాల్గొన్నారు. -
బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకుంటుంది
చిక్కడపల్లి: బంగారు తెలంగాణలో భాగంగా అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ అదుకుంటున్నారని, అందులో భాగంగానే బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం బ్రాహ్మణ సదన్ నిర్మాణం, కార్పొరేషన్ ద్వారా రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని నగర మేయర్ బొంతు రాంమోహన్ అన్నారు, బుధవారం బ్రాహ్మణ యువసేన కో–ఆర్డినేటర్ పర్సా శ్రీధర్‌శర్మ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ మేయర్ బాబాఫసిఝొద్దీన్ , జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, కార్పొరేటర్ వి,శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంమోహన్ మాట్లాడుతూ భారత దేశ చరిత్రలోనే ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ అభినందనీయుడన్నారు. అధ్వానంగా మారిన రోడ్లకు మరమ్మతలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రేషం మల్లేష్,, ఆకుల శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, పాశం రవి, ప్రకాష్‌రెడ్డి, జనార్థన్ చౌదరి, కూరగాయల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛభారత్‌తో జాతిపితకు నివాళి
చిక్కడపల్లి: ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాభారత్ కార్యక్రమయాన్ని జాతిపిత మహాత్మ గాంధీకి నిజమైన నివాళిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. ఆదివారం వివేక్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని శుభ్రంగా ఉంచినప్పుడే ఆరోగ్య సమాజం నిర్మాణమతుందన్నారు. ఇందులో యువత ప్రధాన భూమిక పోషించాలని కోరారు. లక్ష్మణ్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ ఉద్యమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో రఘు, వాణిశ్వర శాస్త్రి, బసవానందం, డాక్టర్ నరేష్‌గౌడ్, ఎంవీఆర్ శాస్త్రి, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.