ఫీజు కట్టలేదని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | In Chikkadpally Student Committed Suicide Over Parents Not Paying Fee | Sakshi
Sakshi News home page

3వ అంతస్థుపై నుంచి దూకిన బీటెక్‌ స్టూడెంట్‌

Published Fri, Mar 29 2019 3:42 PM | Last Updated on Wed, Jul 10 2019 2:44 PM

In Chikkadpally Student Committed Suicide Over Parents Not Paying Fee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తల్లిదండ్రులు కాలేజీ ఫీజు కట్టలేదని మనస్తాపానికి గురయిన ఓ విద్యార్థిని బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. సుస్మిత (21) అనే విద్యార్థిని ఘట్కేసర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతోంది. ఈ నేపథ్యంలో కాలేజీ ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులకు చెప్పింది.

అందుకు వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురయిన సుస్మిత మూడవ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుస్మితను విద్యానగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement