College fee
-
కాలేజీకి భారీ విరాళం.. ట్యూషన్ ఫీజు మాఫీ!
ఆ మెడికల్ కాలేజీకి ఊహించని రీతిలో ఒక బిలియన్ డాలర్లు(రూ. 10 కోట్లు) విరాళంగా అందాయి. దీంతో ఆ కాలేజీ యాజమాన్యం విద్యార్థుల ట్యూషన్ ఫీజులను మాఫీ చేసి, వారికి ఫీజు భారాన్ని తగ్గించింది. యునైటెడ్ స్టేట్స్‌లోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ ఉదంతం చోటుచేసుంది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ విద్యా సంస్థకు భారీ విరాళం అందడంతో, ఆ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులందరి వార్షిక ట్యూషన్ ఫీజును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కళాశాలకు అనుబంధ ఆసుపత్రి, మోంటెఫియోర్ మెడికల్ సెంటర్ ఉన్నాయి. ఈ కాలేజీ యునైటెడ్ స్టేట్స్‌లోని వెనుకబడిన ప్రాంతంలో ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో ఆరోగ్య పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. కాలేజీ యాజమాన్యం విద్యార్థుల ట్యూషన్ ఫీజు మాఫీకి సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ప్రకటన విన్న విద్యార్థులంతా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఆ వీడియోలో కనిపించారు. ఈ విరాళాన్ని ఐన్‌స్టీన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్, మాంటెఫియోర్ హెల్త్ సిస్టమ్ బోర్డ్ మెంబర్ రూత్ ఎల్ గాట్స్మాన్ అందించారని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. We are profoundly grateful that Dr. Ruth Gottesman, Professor Emerita of Pediatrics at @EinsteinMed, has made a transformational gift to #MontefioreEinstein—the largest to any medical school in the country—that ensures no student has to pay tuition again. https://t.co/XOy9HZLbfD pic.twitter.com/1ijv02jHFk — Montefiore Health System (@MontefioreNYC) February 26, 2024 -
అ‘న్యాయం’గా ఫీజులు పెంపు!
సాక్షి, హైదరాబాద్: పేదవిద్యార్థులకు న్యాయవిద్య ఫీజులు భారంగా మారాయి. ఫలితంగా వారు న్యాయవిద్యకు దూరమవుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మునుపెన్నడూ లేనంతగా ఫీజులు పెంచిందని న్యాయశాస్త్ర విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఐదేళ్ల న్యాయవిద్య కోర్సు వార్షిక ఫీజును రూ.5,460 నుంచి రూ.16 వేలకు పెంచారు. రెండేళ్ల కాలపరిమితి ఉండే ఎల్ఎల్ఎం ఫీజును రూ.4,500 నుంచి రూ.20,100కు పెంచారు. ఎంఎల్ఎం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులు రెండింతలు పెరిగాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు రూ.15 వేల నుంచి రూ.33,000 పెంచారు. ప్రభుత్వ అధీనంలో ఉండే ఉస్మానియా లా కోర్సుల్లో ఫీజులు ఇప్పుడు ప్రైవేటు కాలేజీలతో సమానంగా ఉన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల బెంబేలుతో చేరని విద్యార్థులు లా కోర్సు చదువుదామనుకున్న విద్యార్థులు భారీ ఫీజుల కారణంగా కాలేజీల్లో చేరడం లేదు. ముఖ్యంగా పేద విద్యార్థులు వెనక్కు తగ్గుతు న్నారు. ఈ విద్యాసంవత్సరం 6,724 సీట్లు అందుబాటులో ఉండగా, 12,301 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అందులో మొదటి విడతలో 5,747 మంది మాత్రమే కౌన్సెలింగ్‌లో సీట్లు పొందారు. మూడేళ్ల ఎల్ఎల్బీలో 4,064 సీట్లు అందుబాటులో ఉండగా, 3,598 సీట్లు కేటాయించారు. ఐదేళ్ల ఎల్ఎల్బీలో 1,784 సీట్లకు 1,440 సీట్లు కేటాయించారు. 876 ఎల్ఎల్ఎం సీట్లకు 709 మంది అభ్యర్థులు సీట్లు పొందారు. గడువు ముగిసే నాటికి దాదాపు వెయ్యి మంది వరకూ కాలేజీల్లో చేరేందుకు ఇష్టపడలేదని అధికారులు చెబుతున్నారు. ప్రకటన లేకుండానే పెంపు వర్సిటీ అధికారులు ఇష్టానుసారంగా ఫీజుల పెంచారనే విమర్శలొస్తున్నాయి. కోవిడ్ తర్వాత కాలేజీలకు ఖర్చు పెరిగిందని, ప్రభుత్వం నుంచి ఇందుకు తగ్గట్టుగా నిధులు రావడం లేదని, అందుకే ఫీజులు పెంచాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. లాసెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాత్రమే ఓయూ న్యాయ కళాశాలలో సీట్లు పొందుతారు. ఇప్పుడు సాధారణ ర్యాంకులతో ప్రైవేట్ కాలేజీల్లో చేరినవారు, ఓయూ కళాశాలలో సీట్లు పొందినవారు దాదాపు సమానంగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉస్మానియా వర్సిటీ న్యాయ కళాశాలల్లో రెగ్యులర్ కోర్సుల ఫీజు పెరగడాన్ని ఓయూ జేఏసీ అధ్యక్షుడు కురవ విజయ్‌కుమార్ ఖండించారు. ఫీజులపెంపు వల్ల ప్రతిభ గల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు న్యాయవిద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన లా కోర్సుల ఫీజులను తగ్గిస్తూ ఓయూ పాలకవర్గం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కాలేజీలకు ఏఆర్ఎఫ్సీ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(ARFC) కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. ఈ మేరకు అధిక ఫీజులు వసూలు చేస్తే ఊపేక్షించేది లేదని కమిటీ పేర్కొంది. అదనంగా ఫీజులు వసూలు చేస్తే రూ. 2 లక్షలు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ARFC ద్వారా వచ్చి బీ-కేటగిరీ దరఖాస్తులను పరిశీలించాలి. అర్హులైన వారికి కచ్చితంగా సీటు ఇవ్వాల్సిందే. అలా కాకుండా మెరిట్ లేనివారికి సీటు కేటాయిస్తే రూ. 10 లక్షలు జరిమానా విధిస్తామని పేర్కొంది. -
కాలేజీ ఫీజు కోసం బాలుడి ‘కిడ్నాప్’.. డిగ్రీ స్టూడెంట్ ప్లాన్‌తో షాక్!
బెంగళూరు: కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు? బ్యాంకులో విద్యారుణం తీసుకోవటం, తెలిసినవార వద్ద అప్పుగా తీసుకోవటం వంటివి చేస్తారు? కొందరు తప్పని పరిస్థితుల్లో చదువు మానేస్తారు కూడా. కానీ, ఓ డిగ్రీ విద్యార్థి ఏకంగా కిడ్నాప్ చేశాడు. ఓ ధనవంతుడి కుమారుడిని కిడ్నాప్ చేసి రూ.15 లక్షలు తీసుకున్నాడు. వాటితో కాలేజీ ఫీజు కట్టి ఓ బైక్, డిజిటల్ కెమేరా కొనుగోలు చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఈ కేసులో 14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకున్న బికాం విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు 23 ఏళ్ల ఎం సునీల్ కుమార్‌గా గుర్తించారు. అలాగే.. నిందితుడి స్నేహితుడు, మండికల్కు చెందిన వైవీ నగేశ్ని సైతం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. రమేశ్ బాబు అనే కార్పొరేట్ వర్కర్ కుమారుడిని ఇద్దరు స్నేహితులు కలిసి సెప్టెంబర్ 2న కిడ్నాప్ చేశారు. రమేశ్ బాబు కొడుకు భవేశ్ తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాడని ముందుగానే తెలుసుకుని.. అక్కడికి వెళ్లారు నిందితులు. కత్తి చూపించి బాలుడిని తండ్రి కారులోనే కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకోసం భవేశ్ తండ్రి మొబైల్ ఫోన్‌నే ఉపయోగించటం గమనార్హం. డబ్బులు ఇచ్చేందుకు రమేశ్ బాబు అంగీకరించటంతో.. రైల్వే ట్రాక్ సమీపంలో నగదు తీసుకుని బాలుడిని విడిచిపెట్టారు. ఆ తర్వాత ఈ సంఘటనపై రమేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాలు, మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. నిందితుడు ప్రస్తుతం నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కళాశాల ఫీజు చెల్లించలేకపోవటంతో.. బాలుడిని కిడ్నాప్ చేయాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. బాలుడి తండ్రి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నతర్వాత నిందితుడు.. కళాశాలలో ఫీజు కట్టాడు. అందులోంచి ఓ బైక్, డిజిటల్ కెమెరాను కొనుగోలు చేశాడు. ఇదీ చదవండి: చైనా మాస్టర్ ప్లాన్.. ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు! -
సెల్ఫ్ ఫైనాన్స్ వ్యవసాయ కోర్సు ఫీజు రూ. 14 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు భారీగా ఫీజులు వసూలు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ఫీజుల కారణంగా సీట్లు మిగిలిపోతున్నా పేద, గ్రామీణ విద్యార్థులకు భారంగా మారుతున్నా విశ్వవిద్యాలయం పునఃసమీక్ష చేయట్లే దన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకు ఏకంగా రూ. 14 లక్షలను ఫీజుగా వర్సిటీ ఖరారు చేసింది. అలాగే బీఎస్సీ ఉద్యాన కోర్సుకు రూ. 9 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు రూ. 34 లక్షలు వసూలు చేస్తోంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అవే ఫీజులు ఉంటా యని చెబుతున్నా విద్యార్థుల మొరను మాత్రం ఆలకించట్లేదు. వ్యవసాయ, ఉద్యాన సీట్లలో 40% గ్రామీణ ప్రాంతాల్లో ఎకరా కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగిన రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రిజర్వు చేశారు. కాబట్టి ఆయా కుటుంబాలకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. 219 సీట్లకు అధిక ఫీజులు...: ఇంటర్లో బైపీసీ చదివి తెలంగాణ ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఫిషరీస్ సైన్స్‌లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 2 దరఖాస్తుకు చివరి తేదీ. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆరు వ్యవసాయ కళాశాలల్లో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్లో 475 సాధారణ సీట్లు, 154 పేమెంట్ సీట్లు, సైఫాబాద్‌లోని కమ్యూనిటీ సైన్స్‌లో 38 సాధారణ సీట్లు, ఐదు పేమెంట్ సీట్లు, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని రెండు కళాశాలల్లో బీఎస్సీ ఆనర్స్ హార్టీకల్చర్‌లో 170 సాధారణ సీట్లు, 40 పేమెంట్ సీట్లు ఉన్నాయి. అలాగే పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విద్యాలయం పరిధిలోని 3 కళాశాలల్లో బీవీఎస్సీ అండ్ యానిమల్ హజ్బెండరీలో 174సీట్లు, వనపర్తి జిల్లా పెబ్బేరులో 28, ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూర్లలో ఉన్న ఫిషరీస్ సైన్స్ కళాశాలల్లో బీఎఫ్ఎస్సీలో 11 సీట్లను వర్సిటీ భర్తీ చేయనుంది. ఇక ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్లో 20 సీట్లు, ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. మొత్తంగా 219 సీట్లకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఐకార్ గుర్తింపులేని ప్రైవేటు కాలేజీల్లోనూ వ్యవసాయ కోర్సులు...: రాష్ట్రంలో ప్రైవేటు వ్యవసాయ కాలేజీలు పుట్టుకొచ్చాయి. ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహిస్తున్న కొన్ని ప్రైవేటు కాలేజీల్లోనూ వ్యవసాయ కోర్సులున్నాయి. అయితే ఆయా కోర్సులకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) గుర్తింపు లేకపోవడంతో ఆయా సీట్లలో చేరే విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. నాలుగేళ్లు కోర్సు నిర్వహించాక ఐకార్ తనిఖీలు చేసి అనుమతి ఇస్తేనే వాటికి అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ అనుమతి రాకుంటే అందులో చదివిన విద్యార్థులు వ్యవసాయ వర్సిటీలోని పీజీ కోర్సులకు అనర్హులవుతారని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా ప్రైవేటు కాలేజీలు కోర్సు కాలానికి రూ. 10 లక్షలపైనే ఫీజు వసూలు చేస్తున్నాయి. -
మా లెక్కే కరెక్ట్.. ఇక మీ ఇష్టం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఆడిట్ రిపోర్టుల పరిశీలన కార్యక్రమం మంగళవారం కూడా కొన సాగింది. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్ఎఫ్ ఆర్సీ) కార్యాలయంలో దాదాపు 29 కాలేజీల ప్రతినిధులు హాజరయ్యారు. ఒక్కోకాలేజీ ప్రతినిధితో అధికారులు విడి విడిగా చర్చలు జరిపారు. జమాఖర్చుల వివరాలపై మరింత లోతుగా ప్రశ్నలు వేశారు. ఎఫ్ఆర్సీ వర్గాలు మాత్రం కాలేజీలు సమర్పించిన నివేదికల్లోని ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలించాయి. యాజమాన్య ప్రతిని ధులు మాత్రం తమ ఖర్చులన్నీ న్యాయబద్ధమైనవేనని కమిటీ ఎదుట స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజుల ఖరారుపై కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో 2019లో ఖరారు చేసిన ఫీజులే కొనసాగించాలని ఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో 80కిపైగా కాలేజీల యజమా న్యాలు ఎఫ్ఆర్సీ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశాయి. ఈ నేపథ్యంలో కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులనే కొనసాగించేందుకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుదిఫీజు ఖరారు బాధ్యతను ఎఫ్ఆర్సీకి అప్పగించడంతో ఆడిట్ రిపోర్టుల పునఃపరిశీలన చేపట్టారు. అప్పుడు ఎందుకు ఆమోదించారు? కొన్నినెలల క్రితం ఇవే ఆడిట్ రిపోర్టులను ఎఫ్ఆర్సీ ఆమో దించిందని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కోర్టు వ్యాజ్యాలు, రవాణా చార్జీలు వంటివి తీసేసి, మిగతా ఖర్చులన్నీ న్యాయమైనవేనని ఎఫ్ఆర్సీ సమ్మతించినట్టు చెబుతున్నాయి. ఇప్పుడు అవే రిపోర్టులపై పరిశీలన చేపట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నాయి. ఈసారి భిన్నమైన రీతిలో ప్రశ్నలు వేస్తున్నారని అంటున్నాయి. కాలేజీ ప్రాంగణంలో చేసిన రిపేర్లు, లేబొరేటరీల్లో అదనంగా ఏర్పాటు చేసిన వసతులపై కొన్ని కాలేజీలను గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్టు తెలిసింది. మూడేళ్లలోనే రిపేర్లు ఎందుకు వచ్చాయి? ఈ వ్యయాన్ని ఆడిట్ రిపోర్టులో ఎందుకు చూపించారు? అని ఎఫ్ఆర్సీ నిలదీసినట్టు సమాచా రం. కాలేజీ ప్రాంగణంలో శుభ్రత కోసం చేపట్టిన ఖర్చును కూడా ప్రశ్నించినట్టు సమాచారం. ఆన్లైన్ విద్యాబోధనకు ఉపయోగించిన విధానాలు, అయిన ఖర్చులపై మరింత నిశితంగా పరిశీలించేందుకు ఎఫ్ఆర్సీ ఆసక్తి చూపినట్టు తెలిసింది. ఫీజు ఎంతో మేమే నిర్ణయిస్తాం.. ఆడిట్ రిపోర్టులు పరిశీలించిన తర్వాత కాలేజీ నిర్వాహకులతో అధికారులు ఏ విషయమూ చర్చించడం లేదు. గతంలో ఎంత ఫీజు ఇవ్వాలనుకునేది తమతో చర్చించి అంగీకారం కూడా తీసుకున్నాయని చెబుతు న్నాయి. మరోవైపు ఫీజు పెంచాలా? వద్దా? ఎంత పెంచాలి? అనే విషయాలను తర్వాత తెలియజేస్తామని అధికారులు అంటున్నారు. ఫీజు నిర్ణయంపై తమకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఎఫ్ఆర్సీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్నిబట్టి ఎక్కడో ఒకచోట అవసరమైన మేర నిర్వహణ వ్యయంలో కోత పెట్టే అవకాశం కన్పిస్తోంది. మొత్తం మీద వీలైనంత మేర ఫీజులు తగ్గించాలనే యోచనలో ఉన్నట్టు ఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. -
ఇంజనీరింగ్ ఫీజు పెంపు ఖాయం!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజు పెంచాల్సిందేనని ప్రైవేటు కాలేజీలు పట్టుబడుతున్నాయి. తమ జమా ఖర్చులన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రవే శాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) ముందు వాదన వినిపిస్తున్నాయి. హైకోర్టు సూచన మేరకు ఫీజుల నిర్ధారణపై ప్రైవేటు కాలేజీల మూడేళ్ల ఖర్చును సోమవారం నుంచి తిరిగి పరిశీలించడం మొదలుపెట్టింది. దాదాపు 19 కాలేజీలు ఫీజుల పెంపును కోరుతూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించాయి. తొలుత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు, వారి జమా ఖర్చులను పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని ఎఫ్ఆర్సీకి సూచించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. వాస్తవానికి ప్రతీ మూడేళ్లకోసారి ఎఫ్ ఆర్సీ ఇంజనీరింగ్ ఫీజులను సమీక్షిస్తుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. లాక్డౌన్ ఉన్నా ఖర్చులు పెరిగాయా? 2023లో ఇంజనీరింగ్ ఫీజుల పెంపు కోసం కాలేజీలు ఆరునెలల క్రితమే ఆడిట్ నివేదికలు సమర్పించాయి. గత మూడేళ్లుగా కాలేజీల నిర్వహణ ఖర్చులు పెరిగాయని పేర్కొన్నాయి. కరోనా కారణంగా కాలేజీలు సరిగా నడవకపోయినా, కొన్ని కాలేజీలు భారీగానే వ్యయం చేసినట్టు లెక్కలు చూపించాయి. సాంకేతికత అందిపుచ్చుకోవడం, ప్రత్యేక ఫ్యాకల్టీతో పాఠాలు చెప్పించామనే వాదనను తెరమీదకు తెచ్చాయి. కొన్ని కాలేజీలు న్యాయ సంబంధమైన లావాదేవీలకు అయిన ఖర్చును కూడా లెక్కల్లో చూపించాయి. వీటన్నింటిపైనా ఎఫ్ఆర్సీ కొన్నినెలల క్రితమే అభ్యంతరం తెలిపింది. వాటిని తొలగించి వాస్తవ ఖర్చుతో పెంపును నిర్ధారించింది. అయితే, ఇదే సమయంలో విద్యార్థులు, వివిధ వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో ఈ ఏడాది పాత ఫీజులే అమలు చేయాలని ప్రభుత్వానికి ఎఫ్ఆర్సీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని కాలేజీలు కోర్టును ఆశ్రయించగా, ఎఫ్ఆర్సీ అంగీకరించిన ఫీజునే కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కావాలంటే కాస్త్త తగ్గిస్తాం... ఎఫ్ఆర్సీ దగ్గర జరిగిన సంప్రదింపుల్లో కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కొంత తగ్గినట్టు తెలిసింది. రూ. 1.73 లక్షలు డిమాండ్ చేస్తున్న కాలేజీ రూ.10 వేలు తగ్గించుకునేందుకు, రూ.1.50 పైన ఫీజులు డిమాండ్ చేసే కాలేజీలు రూ. 5 వేలు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీన్నిబట్టి కనిష్ట ఫీజు రూ 45 వేలు, గరిష్ట ఫీజు రూ.1.63 లక్షల వరకూ ఉండొచ్చని కాలేజీలు భావిస్తున్నాయి. అయితే ఈ వాదనను మాత్రం ఎఫ్ఆర్సీ వర్గాలు అంగీకరించడం లేదు. కాలేజీలు సమర్పించిన ఆడిట్ రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా మని, ఏమేర ఫీజులను నిర్ధారించాలనే దిశగా అడుగులు వేస్తున్నామని ఎఫ్ఆర్సీకి చెందిన ఓ అధికారి తెలిపారు. -
ఇంజనీరింగ్ విద్యార్థుల పేరెంట్స్‌కు బిగ్ షాక్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యార్థుల పేరెంట్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఫీజులపై జీవో ఇవ్వకుండానే ప్రభుత్వం కౌన్సెలింగ్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో హైకోర్టు నుంచి 79 కాలేజీలు మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. TSAFRC వద్ద అంగీకరించిన ఇంజనీరింగ్ ఫీజులకు హైకోర్టు అనుమితి ఇచ్చింది. దీంతో, 36 ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ఫీజు రూ. లక్ష దాటింది. దీంతో, 10వేలు ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులపై ఫీజుల బారం పడనుంది. కాగా, రేపు(మంగళవారం) నుంచి తొలి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగనుంది. ఈ మేరకు ఈ నెల 13 వరకు ఫీజు చెల్లింపునకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. సీబీఐటీలో లక్షా 73వేలు, వాసవి, వర్ధమాన్, సీవీఆర్, బీవీఆర్ ఐటీ మహిళా కాలేజీల్లో లక్షా 55వేలు, శ్రీనిధి, వీఎన్ఆర్ జ్యోతి వంటి కాలేజీల్లో లక్షా 50వేలపై చొప్పున ఫీజులు పెంచినట్టు సమాచారం. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో మిగతా కాలేజీలు సైతం ఫీజులను భారీగా పెంచే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: రెవెన్యూలో పదోన్నతులు! -
తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజనీరింగ్ ఫీజులు
-
ఫీజు కట్టనిదే సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పడంతో.. విద్యార్థి అఘాయిత్యం
జన్నారం: కాలేజీ ఫీజు కట్టనిదే సర్టిఫికెట్లు ఇవ్వమని కళాశాల యాజమాన్యం చెప్పడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో జరిగింది. విద్యార్థి తండ్రి జక్కుల శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..కలమడుగు గ్రామానికి చెందిన జక్కుల అంజిత్(19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ పూర్తిచేశాడు. ఇటీవల ఎంసెట్ రాశాడు. ఈనెల 28న జగిత్యాలలో కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సి ఉంది. కౌన్సెలింగ్‌కు ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరం ఉండటంతో అంజిత్ తండ్రి శ్రీనివాస్ ఇటీవల కళాశాలకు వెళ్లాడు. సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరగా ఫీజు బకాయి రూ.30 వేలు ఉందని, వాటిని చెల్లిస్తే సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. తమ వద్ద అంత డబ్బు లేదని, కౌన్సెలింగ్ తర్వాత చెల్లిస్తామని శ్రీనివాస్ వేడుకున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగాడు. ఈ విషయం తెలుసుకున్న అంజిత్ మనస్తాపానికి లోనయ్యాడు. ఈ నెల 27న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జన్నారం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ, సోమవారం మృతి చెందాడు. తన కొడుకు మృతికి కారకులైన కళాశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలని మృతుని తండ్రి శ్రీనివాస్ కోరాడు. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తెలంగాణలో భారీగా పెరగనున్న ఇంజనీరింగ్ ఫీజులు.. ఎఫ్ఆర్సీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు పెంపునకు సంబంధించిన మదింపు ప్రక్రియ పూర్తయింది. ఏ కాలేజీకి ఎంత ఫీజు అనేది రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎఫ్ఆర్సీ) నిర్ధారించింది. ఈ వ్యవహారంపై కమిటీ ఇటీవల భేటీ అయి, పెంపునకు ఆమోదం తెలిపింది. ఇదే క్రమంలో పెంపు నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఆగస్టు 5వ తేదీలోగా ఫీజుల పెంపుపై ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. దీంతో 2022–23 విద్యాసంవత్సరం నుంచే కొత్త ఫీజులు అమలుకానున్నాయి. ఎఫ్ఆర్సీ మూడేళ్లకోసారి ఫీజులను నిర్ధారిస్తుంది. 2019లో ప్రకటించిన ఫీజులు 2022 విద్యా సంవత్సరం వరకూ అమలులో ఉన్నాయి. కనీసం రూ.10 వేలు.. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు కనిష్టంగా రూ.35 వేలు, గరిష్టంగా 1.40 లక్షల వరకూ ఉన్నాయి. ఇప్పుడీ ఫీజు కనిష్టంగా రూ.45 వేలు, గరిష్టంగా రూ.1.73 లక్షలు ఉండే అవకాశముంది. దీన్ని బట్టి కనిష్టంగా రూ.10 వేలు, గరిష్టంగా రూ.32 వేలు పెంచే వీలుంది. తెలంగాణలో మొత్తం 175 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వీటిల్లో 21 కాలేజీల్లో ఫీజు రూ.లక్షకుపైగానే ఉంది. పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తే ఈ ఏడాది వీటిసంఖ్య 40పైనే ఉండే అవకాశముంది. 25 కాలేజీల్లో రూ.75 నుంచి రూ.లక్ష వరకూ ఫీజులన్నాయి. ఈసారి ఈ కాలేజీల్లో ఎక్కువశాతం రూ.25 వేల వరకూ వార్షికఫీజు పెంపునకు ఎఫ్ఆర్సీ ఒప్పుకుంది. మూడేళ్ల క్రితం ఫీజులు పెంచినా రూ.లక్ష దాటిన కాలేజీలు నాలుగు ఉంటే, ఇప్పుడు 40కిపైగానే ఉండే అవకాశముంది. పెంచే ఫీజులు మూడేళ్లపాటు అమలులో ఉంటాయి. -
జూనియర్ కాలేజీ ఫీజులను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్కూల్లు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో తొలిసారిగా ఫీజులును ఏపీ సర్కార్ ఖరారు చేసింది. నర్సరీ నుంచి టెన్త్ వరకు ఫీజులు నిర్ణయించింది. ఫీజులు వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న స్కూళ్లకు ప్రైమరీ విద్యకు రూ.10,000, హైస్కూల్ విద్యకు రూ.12000. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్కూళ్లకు..ప్రైమరీ విద్యకు రూ.11,000, హైస్కూల్ విద్యకు రూ.15000. కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్కూళ్లకు.. ప్రైమరీ విద్యకు రూ.12,000, హైస్కూల్ విద్యకు రూ.18000 నిర్ణయించారు. ఇక గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కాలేజీలకు ఎంపీసీ, బైపీసీలకు రూ.15000, ఇతర గ్రూపులకు రూ.12000. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న కాలేజీలకు.. ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500, ఇతర గ్రూపులకు రూ.15000. కార్పొరేషన్ల పరిధిలో ఉన్న కాలేజీలకు.. ఎంపీసీ, బైపీసీలకు రూ.20,000, ఇతర గ్రూపులకు రూ.18000 గా నిర్ణయించారు. చదవండి:Vijayawada: వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ -
ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కాలే.. ఫీజులు కట్టమని బెదిరిస్తున్నారు
సాక్షి, సిటీబ్యూరో : కరోనా కష్టకాలంలో సైతం కార్పొరేట్ కాలేజీలు ముందస్తు ఫీజుల పేరిట బాదుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఆన్లైన్ తరగతులకు శ్రీకారం చుట్టి పట్టుమని పదిరోజులు గడవక ముందే ఫీజుల ఒత్తిళ్లకు పాల్పడుతున్నాయి. పదో తరగతి పరీక్షల కంటే ముందే ఇంటర్మీడియట్లో సీటు బుకింగ్ రిజర్వ్డ్ పేరిట అడ్మిషన్ల సంఖ్యను పూర్తి చేసుకున్న కార్పొరేట్ కాలేజీలు.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పరీక్షల రద్దు ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే ఆన్లైన్ ద్వారా తరగతులు ప్రారంభించాయి. వాస్తవంగా పదో తరగతి పరీక్షలు రద్దయినా గ్రేడింగ్ ఇంకా వెలువడలేదు. కానీ.. కార్పొరేట్ కాలేజీలు సీటు రిజర్వ్డ్ చేసుకున్న విద్యార్థుల సెల్ఫోన్లకు ఆన్లైన్ ఐడీ పంపించి గత నెల 29 నుంచే ఆన్లైన్ బోధన సాగిస్తున్నాయి. కోర్సు ఫీజులో ముందస్తుగా రూ.20 వేలు, పాఠ్యపుస్తకాల కోసం మరో రూ.10 వేలు చెల్లించాలని విద్యార్థుల పేరెంట్స్ సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు అందుతున్నాయి. సోమవారం నుంచి ఫీజు వసూలు కౌంటర్లు తెరిచి ఉంటాయని సమాచారం అందించాయి. తక్షణమే చెల్లించడంతో పాటు పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేసేలా విద్యార్థులపై ఒత్తిళ్లకు దిగుతున్నాయి. ఆది నుంచీ అదే వైఖరి.. చదువుల కోసం ఆది నుంచీ కార్పొరేట్ కాలేజీల బాదుడు మొదలవుతోంది. సీటు రిజర్వ్డ్ పేరిట రూ.2000, దరఖాస్తు ఫారం పేరిట రూ 300 వసూలు సర్వసాధారణమైంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కోర్సును బట్టి రూ.70 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. అదే కార్పొరేట్ విద్యా సంస్థలో పదో తరగతి చదివి ఉంటే మాత్రం కన్వర్షన్ పేరిట కొంత ఫీజులో తగ్గింపు ఇస్తున్నా.. మిగిలిన వారికి మాత్రం ఇష్టానుసారం ముక్కుపిండి వసూలు చేయడం మామూలుగా మారింది. అది కూడా రెండు మూడు విడతల్లోనే పూర్తి ఫీజు చెల్లించే విధంగా కార్పొరేట్ విద్యా సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్న కారణంగా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. విద్యా సంవత్సరానికి ముందే ఆన్లైన్ తరగతులు ప్రారంభమైనా విద్యాశాఖ ప్రేక్షక పాత్ర పోషించడం విస్మయానికి గురి చేస్తోంది. చెల్లింపులన్నీ నగదు రూపంలోనే.. వైరస్ కట్టడిలో భాగంగా నగదు కాకుండా డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు జరపడం మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నప్పటికీ కార్పొరేట్ కాలేజీలు మాత్రం నగదు చెల్లింపు మాత్రమే అంగీకరిస్తామంటున్నాయి. కనీసం సీటు రిజర్వ్డ్ దరఖాస్తుకు చెల్లించే ఫీజునూ నగదు రూపంలోనే తీసుకోవడం విస్మయపరుస్తోంది. తాజాగా ఫీజులు, పాఠ్యపుస్తకాలకూ నగదు చెల్లించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. -
చదువే చెప్పలేదు ఫీజు ఎలా చెల్లిస్తాం?
నగరంలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన అఖిల దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కార్పొరేట్ కాలేజీలో డే స్కాలర్‌గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రూ.45 వేలు ఫీజు చెల్లించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కాలేజీ యాజమాన్యం మాత్రం గతేడాది చెల్లించిన ఫీజుకు అదనంగా మరో ఏడువేలు కలిపి మొత్తం రూ.52 వేలు చెల్లించాలని ఒత్తిడి తెస్తోంది. ఆన్లైన్ తరగతుల సమయంలో రూ.15 వేలు చెల్లించారు. తాజాగా వార్షిక ఫీజు గడువు రావడంతో మొత్తం ఫీజులులో 75 శాతం చెల్లిస్తేనే పరీక్ష ఫీజు కట్టుకుంటామని కాలేజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఒక అఖిలకు ఎదురైన సమస్యకాదు.. నగరంలో వేలాది మంది ఇంటర్మీడియట్ విద్యార్థులదీ ఇదే పరిస్థితి. సాక్షి, హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో సైతం కార్పొరేట్ కాలేజీలు ఫీజుల బాదుడు ఆపడం లేదు. వార్షిక ఫరీక్ష ఫీజుకు మెలిక పెట్టి బాహాటంగానే గతేడాది కంటే అదనంగా ఫీజులను వసూలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో విద్యా సంస్ధలు కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం జీఓ నెంబర్ 52 ద్వారా స్వష్టమైన ఆదేశాలు జారీ చేసినా..ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఇంటర్మీడియట్ అధికారుల ఉదాసీన వైఖరి కార్పొరేట్ కాలేజీలకు కలిసి వస్తోంది. ఆన్లైన్ తరగతుల సమయంలోనే 10 నుంచి 20 శాతం ఫీజులు వసూలు చేశారు. ఇప్పుడు ప్రత్యక్ష తరగతులు ప్రారంభంతో ఫీజుల కోసం మరింత ఒత్తిళ్లు పెంచుతున్నారు. తాజాగా వార్షిక పరీక్ష ఫీజు గడువు రావడంతో..ఏకంగా మొత్తం ఫీజులో 75 శాతం చెల్లిస్తేనే వార్షిక పరీక్ష ఫీజు కట్టుకుంటామని స్పష్టం చేస్తున్నారు. దీంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఒకేసారి పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించలేక తల్లడిల్లుతున్నారు. చదువే చెప్పలేదు ఫీజు ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు. లక్షన్నర పైనే.. హైదరాబాద్ మహనగరంలో సుమారు 782కు పైగా ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉండగా, అందులో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దాదాపు లక్షన్నరకుపైగా ఉన్నారు. ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు వార్షిక ఫీజు చెల్లింపు పెద్దగా ఇబ్బంది లేకపోగా, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న వారికి మాత్రం భారంగా మారింది. కొరవడిన పర్యవేక్షణ ఇంటర్మీడియట్ కాలేజీల ఫీజుల నియంత్రణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. నగరంలో ముగ్గురు ఇంటర్మీడియట్ అధికారులు ఉన్నప్పటికీ వారి పరిధిలోని కాలేజీలపై పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉంది. మొక్కుబడి తనిఖీలకు పరిమితమయ్యారు. ఏకంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏకంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోను సైతం పూర్తిగా అమలు చేయడంలో విఫలం కావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కార్పొ‘రేటు’.. 'తల్లిదండ్రులకు పోటు'
నవీన్‌చంద్ అనే విద్యార్థి విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో 2019–20లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌లో చేరాడు. హాస్టల్, కాలేజీ ఫీజులన్నీ కలిపి రూ.1.70 లక్షలు చెల్లించాడు. ఇప్పుడు సెకండియర్‌కు వచ్చేసరికి ఆ ఫీజు రూ.2 లక్షలకు పెరిగింది. వంశీకృష్ణ విజయవాడలోని ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి. గత ఏడాది ఫస్టియర్ ఫీజు రూ.1.80 లక్షలు. ఈ ఏడాది సెకండియర్‌లో అది కాస్తా 2.30 లక్షలకు పెరిగింది. లైబ్రరీ, ల్యాబ్, బుక్స్ కోసం అదనంగా డబ్బు వసూలు చేశారు. హాస్టల్లో ఉండే వారికి దోబీ చార్జీల కింద రూ.7 వేల వరకు వీటికి అదనం. కరోనా సమయంలో కాలేజీలు, హాస్టళ్లు నడవనప్పుడు ఇంతలా ఫీజులు అన్యాయం అని తల్లిదండ్రులు అడిగితే, నచ్చితేనే మీ పిల్లాడిని ఉంచండి.. లేదంటే తీసుకుపోండి.. అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు తగ్గించమని చెప్పింది కదా.. అంటే మాకు హెడ్డాఫీసు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు కనుక పూర్తి ఫీజు కట్టాల్సిందేనంటూ కాలేజీల సిబ్బంది సమాధానమిస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీల తీరు విద్యార్థుల తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు.. ఇలా ఎక్కడ చూసినా ఈ కాలేజీల వ్యవహారం ఇదే రీతిలో ఉంది. ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లలోని పరిస్థితులపై చేపట్టిన పరిశీలనలో అనేక అంశాలు వెలుగు చూశాయి. కమిషన్ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ విభాగానికి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నందున గత ఏడాది ఫీజులను 30 శాతం మేర తగ్గించి, మిగతా మొత్తం మాత్రమే ఈ ఏడాది వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ప్రయివేటు కార్పొరేట్ కాలేజీలు దీన్ని అమలు చేయడం లేదని కమిషన్ సభ్యుల పరిశీలనలో తేలింది. ఫీజులు తగ్గించకపోగా కొన్ని కాలేజీలు గత ఏడాది కన్నా భారీగా పెంచి మరీ వసూలు చేస్తున్నాయి. కొన్ని ఫీజులు పెంచి ఆపై 30 శాతం తగ్గిస్తున్నట్లు డ్రామాలకు తెర తీశాయి. కొన్ని ఏడాదికి కొంత మంది నుంచి 1.50 లక్షలు తీసుకొంటే, మరికొంత మంది నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలైతే రెండేళ్లకు కలిపి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని కమిషన్ వైస్ చైర్పర్సన్ విజయ శారదా రెడ్డి వెల్లడించారు. వసూళ్లకు లెక్కాపత్రాల్లేవు ► ఆయా కార్పొరేట్ కాలేజీలు వసూలు చేస్తున్న ఫీజులకు ఎక్కడా లెక్క పత్రాలు, ఫీజుల వివరాలు, అకౌంట్సు బుక్స్ ఆ విద్యా సంస్థల్లో ఉండడం లేదు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా, ఆ ఫీజులో దేనికెంత అనే వివరాలు లేవు. ► ఆయా సంస్థల్లో పరిశీలనకు వెళ్తున్న కమిషన్ బృందాలు ఫీజులు, ఇతర వివరాల రికార్డుల గురించి అడిగితే అవన్నీ సెంట్రల్ ఆఫీసులో ఉంటాయని, కేవలం తాము అకడమిక్ వ్యవహారాలే చూస్తామంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కమిషన్ బృందాలు పరిశీలనకు వచ్చినప్పుడు అకౌంట్సు సిబ్బందిని అందుబాటులో లేకుండా చేస్తూ కార్పొరేట్ సంస్థలు ఫీజుల లెక్కలు చూపకుండా తప్పించుకుంటున్నాయి. ► కరోనా సమయంలో కాలేజీలు, హాస్టళ్లు నడవలేదు. పాఠాల బోధన లేనేలేదు. నిర్వహణ ఖర్చులు కూడా చాలా తగ్గాయి. అయినా సరే కాలేజీలు గత విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆన్లైన్ తరగతుల కోసం ప్రతి విద్యార్థికి నెలకు రూ.10 వేలు ఖర్చంటూ లెక్క చెబుతున్నాయి. ఈ ఏడాదిలో సెకండియర్లోకి వచ్చిన విద్యార్థుల ఫీజులను భారీగా పెంచాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురు దాడికి దిగడం, విద్యార్థులను తీసుకుపొమ్మని చెబుతుండడంతో పిల్లల భవిష్యత్తు దెబ్బ తింటుందేమోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సి వస్తోంది. ల్యాబ్‌లు, లేబ్రరీలు లేకున్నా అదనపు ఫీజులు ► ఇటీవల కమిషన్ బృందాలు వరుసగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోని కార్పొరేట్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాయి. కాలేజీల్లో లైబ్రరీ, ల్యాబ్ వంటి వసతులు లేకపోయినా వాటి పేరిట అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తేలింది. ► హాస్టళ్లలో పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. అయినా హాస్టల్ విద్యార్థుల ఫీజులను భారీగా పెంచారు. గతంలో ఒక్కో గదిలో ఆరుగురు విద్యార్థులను ఉంచే వారమని, ఇప్పుడు ముగ్గురు లేదా నలుగురినే ఉంచుతున్నందున అదనంగా కొంత మొత్తం వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ► హాస్టళ్లలో పిల్లలకు సరైన సదుపాయాలు కూడా లేవని కమిషన్ తనిఖీల్లో బయట పడింది. పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండడంతో వాటిని తినలేక వారు నానా అవస్థలు పడుతున్నారు. మరోపక్క కరోనాతో ఇళ్లలోనే ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా హాస్టల్లోని పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రుద్దుడే.. ► కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలతో విద్యార్థుల చదువులు తాపీగా సాగాయి. కాలేజీలు, హాస్టళ్లను తెరచిన యాజమాన్యాలు సిలబస్‌ను పూర్తి చేసేందుకు తొందర తొందరగా బోధన సాగిస్తున్నాయి. పిల్లలకు అర్థమవుతోందా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదు. ► ఉదయం ఏడు గంటల నుంచి తరగతులు ప్రారంభించి.. రాత్రి 9 గంటల వరకు పాఠాలు చెబుతున్నారని, లంచ్ ఇతర విరామ సమయాలు కొద్ది నిముషాలు కూడా ఉండడం లేదని విద్యార్థులు కమిషన్ సభ్యుల దృష్టికి తెచ్చారు. స్టడీ అవర్‌లో కనీసం మూత్ర విసర్జనకూ అనుమతించడం లేదని విద్యార్థులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. కరోనా సమయంలో కార్పొరేట్ కాలేజీలు అనేక మంది సిబ్బందిని తొలగించాయి. వారికి వేతనాలు కూడా చెల్లించలేదు. గత్యంతరం లేక వారంతా వేర్వేరు ఉపాధి మార్గాలు వెతుక్కున్నారు. ఇప్పుడు కాలేజీలు తెరచినా వారెవ్వరూ తిరిగి రాక యాజమాన్యాలు అరకొర సిబ్బందితోనే నడిపిస్తున్నాయి. ► పలు కాలేజీల్లో సరైన బోధనా సిబ్బంది కూడా లేరు. ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ కాకుండా, వారు రూపొందించిన మెటీరియల్‌తో బోధన సాగిస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా వారికి ఆటపాటలు కూడా ఉండాలని ప్రభుత్వం సూచించినా ఏ ఒక్క యాజమాన్యమూ పట్టించుకోవడం లేదు. ► 30 మంది పట్టే తరగతి గదిలో ఏకంగా 80 మందిని కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న దృశ్యాలు అన్ని కార్పొరేట్ కాలేజీల్లో మామూలైపోయింది. దీంతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. -
ఫీజు చెల్లించలేక తనువు చాలించింది
బెలగావి: అసలే కరోనా కాలం. ఆ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కుమార్తె కాలేజీ ఫీజు రూ.40 వేలు చెల్లించే స్థోమత కూడా లేకుండాపోయింది. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి తట్టుకోలేక తనువు చాలించింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లా బిడీ గ్రామంలో చోటుచేసుకుంది. షకీల్ సంగోలి కుమార్తె మెహెక్ (20) ఓ ప్రైవేట్ కాలేజీలో బీసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. లాక్డౌన్ కారణంగా షకీల్ ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఫీజు రూ.40 వేలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఇటీవల మెహెక్‌ను ఆదేశించింది. షకీల్ డబ్బు సర్దుబాటు చేయలేకపోయాడు. తల్లిదండ్రుల పరిస్థితిని చూసి ఆవేదనకు గురైన మెహెక్ ఇంట్లోనే ఉరి వేసుకుని మృత్యు ఒడికి చేరుకుంది. ఆమె తల్లి గృహిణి. 4, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు సోదరులు ఉన్నారు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డి(19) ఇటీవల ఫీజు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఫీజులు లక్షలు.. దొంగ లెక్కలు
సాక్షి, అమరావతి: రూ.లక్షల్లో ఫీజులు.. రికార్డుల్లో చూపిస్తున్నది మాత్రం రూ.వేలల్లో... కనీస సదుపాయాలూ కరువే.. బట్టీ పద్ధతుల్లో చదువులు.. ఆటలు, పాటలు అసలే లేవు. ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చున్న చోటు నుంచి కదిలే అవకాశం ఉండదు. విద్యార్థుల్లో విపరీతమైన మానసిక ఒత్తిడి. ఇవీ రాష్ట్రంలోని పలు ప్రైవేటు కాలేజీల్లో నెలకొన్న దుర్భర పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు పది చొప్పున ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించింది. ఆయా కళాశాలల్లోని పరిస్థితులను చూసి తనిఖీ బృందాలు విస్తుపోయాయి. కాలేజీల యాజమాన్యాలు రికార్డుల్లో చూపిస్తున్న సమాచారానికి... తనిఖీ బృందాలు గుర్తించిన వాస్తవ పరిస్థితులకు మధ్య ఎక్కడా పొంతనే లేకపోవడం గమనార్హం. ప్రైవేట్ కాలేజీల తనిఖీల్లో తేలిందేమిటి? - పలు జూనియర్ కాలేజీలు ఇంటర్మీడియెట్‌కు ఏడాదికి రూ.90 వేల నుంచి రూ.లక్ష దాకా వసూలు చేస్తున్నాయి. కానీ, రూ.40 వేల నుంచి రూ.50 వేలు మాత్రమే వసూలు చేస్తున్నట్లుగా రికార్డుల్లో నమోదు చేస్తున్నాయి. - పలు కాలేజీలు సరైన గుర్తింపు పత్రాలు లేకుండానే యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. - కొన్ని కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మరుగుదొడ్లు కూడా లేవు. కృష్ణా జిల్లాలోని ఒక కాలేజీలో 400 మంది విద్యార్థినులుండగా, 3 మరుగుదొడ్లు మాత్రమే ఉండడం గమనార్హం. - ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయడం లేదు. కాలేజీలు సబ్జెక్టుల వారీగా సొంతంగా ముద్రించిన వర్క్‌బుక్స్ మాత్రమే ఉన్నాయి. వాటికి ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. - పబ్లిక్ పరీక్షల పేరిట, ఎంసెట్, జేఈఈ, ఇతర పరీక్షల ఫీజుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అదనంగా వేలాది రూపాయలు దండుకుంటున్నారు. - ఒక్కో తరగతిలో నిబంధనలకు విరుద్ధంగా 90 మందిని కూర్చోబెడుతున్నారు. - బడా కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. - పలు కాలేజీల్లో 7 నుంచి 10 సెక్షన్ల దాకా నిర్వహిస్తున్నారు. వారానికోసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు మెరిట్లో ఉన్న వారిని ఒకటో సెక్షన్లో ఉంచుతున్నారు. మరో వారం నిర్వహించే పరీక్షలో తక్కువ మార్కులు వస్తే కింది సెక్షన్లకు మార్చేస్తున్నారు. దీంతో విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు. - కొన్ని కాలేజీల్లో తరగతి గదులు నిర్ణీత సైజుల్లో లేవు. సరైన గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లోనే విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. శుభ్రమైన మంచి నీరు కూడా అందించడం లేదు. - అధ్యాపకులకు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా వేతనం ఇస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. వాస్తవానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు మాత్రమే ఇస్తున్నారు. - విద్యార్థులను ఇష్టానుసారంగా చేర్చుకుంటున్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు అనుమతించిన సంఖ్యకు, అక్కడున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. -
కోర్టు ద్వారా సర్టిఫికెట్లు తెచ్చుకున్న విద్యార్థి
నాగర్‌కర్నూల్: విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు వచ్చినా కార్పొరేట్ కళాశాలలకు కల్లెం మాత్రం వేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. విద్యార్థులను కళాశాలలో చేర్చుకునేందుకు మాత్రం తమకు ఇష్టం వచ్చినంత ఫీజులు చెల్లించాలని, కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయంటూ ప్రగల్భాలు పలుకుతారు. ఒక్క సారి విద్యార్థి చేరితే ఇక జైలు జీవితాన్ని తలదన్నేలా విద్యార్థి బతకాల్సివస్తుంది, పైగా ముక్కుపిండి ఫీజులు వసూలు చేయడంలో వీళ్లను మించినవాళ్లు లేరు. సరిగ్గా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ నగరంలోకందనూలుకు చెందిన విద్యార్థికి ఎదురైంది. అయితే అందరు విద్యార్థుల్లా యాజమన్యానికి తలొంచలేదు. సరికాదా యాజమాన్యమే తనకు తలొంచేలా చేశాడు నాగర్‌కర్నూల్‌కు చెందిన నికేష్. ఉన్నత చదువుకై.. నాగర్‌కర్నూల్‌లో పదో తరగతి వరకు చదివిన నికేష్ ఇంటర్ కోసం హైదరాబాద్‌లోని పైన్ గ్రూవ్ జూనియర్ కళాశాలలో చేరాడు. పాఠశాలలో చరే సమయంలో సంవత్సరానికి రూ.1.60 లక్షల చొప్పున రెండు సంవత్సరాలకు కలిపి రూ.3.20లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇదే ఫీజులో హాస్టల్‌తో పాటు ఐఐటీ తరగతులు కూడా నిర్వహిస్తామని యాజమాన్యం చెప్పింది. అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరం కళాశాల యాజమాన్యంలో వచ్చిన మనస్పర్థల వల్ల ఐఐటీ తరగతులు బోధించలేదు. దీంతో విద్యార్థి నికేష్ ప్రత్యేకంగా ఐఐటీ కోచింగ్ కోసం రూ.40వేలతో మరో కోచింగ్ సెంటర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఐఐటీ కోచింగ్ ఇస్తామని, ఇవ్వనందుకు ఫీజులో రాయితీ ఇవ్వాలని సదరు విద్యార్థి కళాశాల యాజమాన్యాన్ని అడగండం జరిగింది. అప్పటికే విద్యార్థి తల్లిదండ్రులు కళాశాలకు రూ.2.80లక్షల ఫీజు చెల్లించారు. అయితే రాయితీ ఇవ్వమని మిగిలిన రూ.40వేలు చెల్లించాలని, చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని తెగేసిచెప్పారు. ఇంతలో విద్యార్థికి ఇంజినీరింగ్ కళాశాలలో సీటు రావడం, ఈ నెల11న కళాశాలలో చేరాల్సిరావడంతో ఖచ్చితంగా సర్టిఫికెట్లు కళాశాలలో ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళాశాల దౌర్జన్యంపై విసిగిన విద్యార్థి నికేష్ ప్రైవేటు కళాశాలలు ఒరిజినల్ సెర్టిఫికెట్లు ఇవ్వకుండా దగ్గర ఉంచుకోవడాన్ని సవాలు చేస్తూ తన తండ్రి స్నేహితుడైన హైకోర్టు న్యాయవాది గుమ్మడవెల్లి వెంకటేశ్వర్లు ద్వారా కళాశాలకు గత మగళవారం నోటీసులను పంపించాడు. అయినా కళాశాల యాజమన్యాం స్పందించకపోవడంతో గత శుక్రవారం నేరుగా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. వ్రైవేటు ఇంటర్ కళాశాల ఫీజులు చెల్లించినప్పటికీ ఒరిజినల్ సర్టిఫికెట్ దగ్గరుంచుకోవడాన్ని తప్పుపట్టింది. రెండు రోజుల్లో విద్యార్థికి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తీర్పును వెలువరించింది. విద్యార్థికి అనుకూలంగా వచ్చిన ఈ తీర్పు ముక్కు పిండి ఫీజులు వసూలు చేసే యాజమన్యాలకు ఒక చెంపపెట్టని అందరూ విద్యార్థిని ప్రశంసిస్తున్నారు. యాజమాన్యాలకు బుద్ధి రావాలి కళాశాలలో చేర్పించుకునేటప్పుడు ఐఐటీలో కోచింగ్ ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వలేదు. ఫీజు మాత్రం ఖచ్చితంగా వసూలు చేస్తున్నారు. ఇలాంటి యాజమాన్యాలకు బుద్దిరావాలనే హైకోర్టును ఆశ్రయించాను. ఇకనైనా కార్పొరేట్ కళాశాలలకు బుద్ధి రావాలి. ఈ కేసు విజయం సాధించడంలో హైకోర్టు న్యాయవాది గుమ్మడవెల్లి వెంకటేశ్వర్లు కీలక పాత్ర పోషించారు. – సొన్నతి నికేష్, విద్యార్థి, నాగర్‌కర్నూల్ -
ప్రైవేటు కాలేజీలో చేర్పించలేదని..
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : మండల పరిధిలోని పార్లపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బోయ రంగస్వామి, చక్రమ్మల కూతురు రాజేశ్వరి(15) ఇటీవల పదో తరగతి పాస్ అయింది. తోటి స్నేహితులతో కలిసి కర్నూలులోని ప్రైవేట్ కళాశాలలో చేర్పించాలని తండ్రిని కోరగా, ఆర్థిక పరిస్థితి బాగోలేదని సర్ధిచెప్పాడు. దీంతో కడివెళ్ల ఏపీ మోడల్ స్కూల్లో గురువారం దరఖాస్తు చేసి వచ్చింది. అక్కడ తోటి విద్యార్థినులు ప్రైవేటు కాలేజీలో చేరుతున్నట్లు చెప్పడంతో మరోసారి తండ్రితో ప్రస్తావించింది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే తాను అంత ఫీజు కట్టలేనని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తల్లిదండ్రులు ఉదయం నిద్రలేచేసరికి కూతురు ఫ్యాన్‌కు వేలాడుతుండటం చూసి గుండెలు పగిలేలా రోదించారు. రూరల్ ఏఎస్ఐ నాయక్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. -
నలుగురి డ్రైఫ్రూట్స్ ఖర్చు 18 లక్షలు
సాక్షి, అమరావతి: విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించేందుకు ఏర్పాటయిన ఉన్నత విద్యామండలి అక్రమాల నిలయంగా మారింది. విద్యా ర్థులు చెల్లించే ఫీజులు, కాలేజీల నుంచి రుసుముల రూపేణా వచ్చే కోట్లాది రూపాయలను కమీషన్ల కోసం పప్పుబెల్లాల్లా కావాల్సిన వాళ్లకు పంపిణీ చేశారు. కేవలం నలుగురు ఉన్నతాధికా రులకు డ్రైఫ్రూట్ల కోసం మూడేళ్లలో రూ.18 లక్షలు ఖర్చు చేశారంటే అక్కడ అవినీతి వ్యవహారం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. కమీషన్లతో పాటు ప్రభుత్వ పెద్దలకు కావలసిన సదుపా యాల కల్పనకు, వారి అనుయాయుల పునరావాసం కోసం ఉన్నత విద్యామండలి నిధులు ఇష్టానుసారంగా ఖర్చుపెట్టేశారు. గత నాలుగేళ్లలో ఈ వ్యవహారం సృతిమించిపోయింది. శిక్షణ పేరుతో రూ.13 కోట్లు... రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కాలేజీల్లోచదువుతున్న లక్షమంది విద్యార్ధులకు ఆంగ్లంలో కమ్యూనికేషన్ స్కిల్స్, వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, తదితర నైపుణ్యాలు పెంచేందుకు బ్రిటిష్ కౌన్సిల్‌తో శిక్షణ ఇప్పించడానికి రూ.13 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. రూ.9 కోట్ల వరకు ఆ సంస్థకు చెల్లించేశారు. తీరా కాలేజీలనుంచి వచ్చిన సమాచారం చూస్తే బ్రిటిష్ కౌన్సిల్ సంస్థ కేవలం 13వేల మంది విద్యార్ధులకు, 2వేల మంది టీచర్లకు మాత్రమే శిక్షణ ఇచ్చినట్లు తేలింది. అయినా ఉన్నత విద్యామండలి అధికారులు ఆ సంస్థకు రూ.9 కోట్లు చెల్లించారు. మిగతా నిధుల చెల్లింపుపై కూడా ఫైలు రెడీ చేసినట్లు తెలిసింది.రెండో విడత శిక్షణ అంటూ మరో రూ.4.5 కోట్లతో ఒప్పందానికి కూడా ఏర్పాట్లు చేశారు. దీనిపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి కోసం మండలి ఫైలు పంపగా.. మొదటి ప్రాజెక్టులో తగినంతమందికి శిక్షణ ఇవ్వలేదు కనుక ఆమేరకు మిగతా వారికి రెండో ప్రాజెక్టులో శిక్షణ ఇవ్వాలని, బకాయిలు అప్పుడే ఇస్తామని ఆయన స్పష్టంచేశారు. బ్రిటిష్ కౌన్సిల్‌తో ఒప్పందంపై విమర్శలు రావడంతో పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ కూడా ప్రభుత్వ సంస్థ అయిన ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)తో శిక్షణ ఇప్పిస్తే తక్కువ ఖర్చు అవుతుందని నివేదిక ఇచ్చింది. అయినా పాత బకాయిలు మొత్తాన్ని చెల్లించి, రెండో విడత ప్రాజెక్టును రూ.4.5 కోట్లతో బ్రిటిష్ కౌన్సిల్‌తో చేపట్టేంరు ఒప్పందం చేసుకోవాలని ఉన్నత విద్యామండలి అధికారులు ఏర్పాట్లు చేయడం విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబు ప్రచారాలకు రూ.10కోట్లు సాధారణ ఎన్నికలకు ఆరునెలల ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు యూనివర్సిటీల పరిధిలోని విద్యార్ధుల ఓట్లకోసం జ్ఞానభేరి పేరిట ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి యూనివర్సిటీ పరిధిలో సభలను ఏర్పాటుచేసి వాటికి వేలాది మంది విద్యార్ధులను రప్పించారు. దీని ఉన్నత విద్యామండలి నుంచే రూ.10 కోట్లకు పైగా చెల్లించారు. ఒక్కో సభకు అడ్వర్టయిజ్మెంట్ల పేరిట కొన్ని పత్రికలకు రూ.60 లక్షల చొప్పున చెల్లించారు. సీఎం ప్రసంగంతో కూడిన బుక్లెట్ ఒక్కోదాన్ని వేయి రూపాయలతో ముద్రించి రూ.20 లక్షల వరకు ఖర్చు చేశారు. ఉపయోగంలేని ఒప్పందాలు... రూ.5 కోట్లు ఖర్చు విద్యాశాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు వివిధ వర్సిటీలతో ఒప్పందాలంటూ విదేశీయాత్రలు చేశారు. ఇందుకు ఏకంగా రూ.5 కోట్లు ఉన్నత విద్యామండలి నిధులు ఖర్చు చేశారు. తప్పుడు ఒప్పందాల కోసం ఎనిమిది దేశాలు తిరిగి వచ్చారు. ఈ యాత్రల వల్ల, ఒక్క ఒప్పందం వల్ల కూడా వీసమెత్తు ప్రయోజనం కూడా ఒనగూరలేదు. మంత్రి, విద్యాశాఖకు చెందిన కొందరు అధికారులకు కార్లు, ఏసీ రూములు, ఇతర ఏర్పాట్ల కోసం, వేర్వేరు పేషీల్లో కన్సల్టెంట్లు, సలహాదారులుగా నియమితులైన వారికి వేతనాలు, రవాణా తదితర భత్యాల కోసం ఉన్నత విద్యామండలి నిధులు భారీగా ఖర్చుచేయించారు. నేషనల్ ర్యాంకింగ్ కోసం యూనివర్సిటీలకు సలహాలు ఇచ్చే పేరిట మంత్రి గంటా అనుచరుడికి సంబంధించిన సంస్థతో రూ.1.50 కోట్లతో తప్పుడు ఒప్పందం చేసుకోవడమే కాకుండా, ఎలాంటి ప్రయోజనం చేకూరకున్నా నిధులు చెల్లించారన్న విమర్శలున్నాయి. ఎల్ఈడీ బల్బులకోసం రూ.50 కోట్లు వర్సిటీల్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు వీలుగా రెండు వర్సిటీల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం మండలికి సూచించింది. ఒక్కో యూనివర్సిటీలో కనిష్ఠంగా రూ.4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం 2 వర్సిటీల్లోనే చేయాలని చెప్పగా మండలి అధికారులు ఏకంగా 16 యూనివర్సిటీల్లో ఈ ప్రాజెక్టు అమలుకు ఒక ప్రయివేటు సంస్థతో ఒప్పందం చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఎలాంటి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు లేకుండానే ఇలా ఒప్పందం చేసుకోవడం వల్ల వర్సిటీలు రూ.50 కోట్లవరకు ఆ సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. అధికారుల వ్యక్తిగత ఖర్చే రూ. 2 కోట్లు ఉన్నత విద్యామండలిలోని ఉన్నతస్థాయి అధికారుల వ్యక్తిగత ఖర్చుల కిందే గత మూడేళ్లలో రూ.2 కోట్ల వరకు ఖర్చు చూపించారు. తమ కుటుంబాలను చూడడానికి సొంతూర్లకు వారం వారం వెళ్లిరావడానికి, వివిధ ప్రాంతాలకు విమాన ప్రయాణాలంటూ ఈ నిధులు ఖర్చు చేశారు. డ్రైఫ్రూట్స్ కోసం ఏకంగా 18 లక్షల ఖర్చయ్యినట్లు చూపిస్తున్నారు. తమకు సంబంధించిన వారిని అవుట్‌సోర్సింగ్‌లో నియమించుకొని వారికి వేలాది రూపాయలు వేతనాలుగా ఇస్తున్నారు. చీఫ్ సెక్రటరీకి కూడా లేని రీతిలో కొందరికి ఏడాదికి రూ.15వేల వరకు ఇంక్రిమెంటుగా వేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇవి కాకుండా వివిధ సెట్ల నిర్వహణలో నిధుల దుర్వినియోగం, స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో అక్రమాలకు అంతే లేదన్న ఆరోపణలున్నాయి వివిధ కమిటీలనున నియమించి వివిధ స్టార్ హోటళ్లలో వాటి సమావేశాలకు లక్షల్లో ఖర్చు చేశారు. ఈ కమిటీల నివేదికలను మాత్రం పక్కన పడేశారు. ఈ పనుల పేరుతో కమీషన్లు దండుకోవడానికే ప్రాధాన్యతనిచ్చినట్లు ఆ విభాగంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బోధనా పోస్టుల భర్తీలోనూ అక్రమాలు... వివిధ యూనివర్సిటీల్లోని బోధనా పోస్టుల భర్తీ విషయంలో ఉన్నత విద్యా మండలి అధికారులు అక్రమాలకు పాల్లపడ్డారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే ప్రయివేటుగా ప్రొఫెసర్ రాఘవులు కమిటీని ఏర్పాటుచేసి వివిధ పోస్టులను హేతుబద్ధీకరణ చేయించారు. తమకు సంబంధించిన వారికి పోస్టులుండేలా ఒక విభాగం పోస్టును వేరే విభాగాలకు తరలించారు. రిజర్వుడ్ పోస్టులను కూడా ఇష్టానుసారంగా మార్చేశారు.1,385 బోధనా పోస్టుల భర్తీకి యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా స్క్రీనింగ్ టెస్టును ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించారు. వీటిపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నా వర్సిటీల ద్వారా ఇంటర్వ్యూలను పూర్తిచేయించి నియామకాలు చేయించడానికి కూడా సిద్ధపడ్డారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. చదువుతున్న లక్షమంది విద్యార్ధులకు ఆంగ్లంలో కమ్యూనికేషన్ స్కిల్స్, వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, తదితర నైపుణ్యాలు పెంచేందుకు బ్రిటిష్ కౌన్సిల్‌తో శిక్షణ ఇప్పించడానికి రూ.13 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. రూ.9 కోట్ల వరకు ఆ సంస్థకు చెల్లించేశారు. తీరా కాలేజీలనుంచి వచ్చిన సమాచారం చూస్తే బ్రిటిష్ కౌన్సిల్ సంస్థ కేవలం 13వేల మంది విద్యార్ధులకు, 2వేల మంది టీచర్లకు మాత్రమే శిక్షణ ఇచ్చినట్లు తేలింది. అయినా ఉన్నత విద్యామండలి అధికారులు ఆ సంస్థకు రూ.9 కోట్లు చెల్లించారు. మిగతా నిధుల చెల్లింపుపై కూడా ఫైలు రెడీ చేసినట్లు తెలిసింది. రెండో విడత శిక్షణ అంటూ మరో రూ.4.5 కోట్లతో ఒప్పందానికి కూడా ఏర్పాట్లు చేశారు. దీనిపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి కోసం మండలి ఫైలు పంపగా.. మొదటి ప్రాజెక్టులో తగినంతమందికి శిక్షణ ఇవ్వలేదు కనుక ఆమేరకు మిగతా వారికి రెండో ప్రాజెక్టులో శిక్షణ ఇవ్వాలని, బకాయిలు అప్పుడే ఇస్తామని ఆయన స్పష్టంచేశారు. బ్రిటిష్ కౌన్సిల్‌తో ఒప్పందంపై విమర్శలు రావడంతో పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ కూడా ప్రభుత్వ సంస్థ అయిన ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)తో శిక్షణ ఇప్పిస్తే తక్కువ ఖర్చు అవుతుందని నివేదిక ఇచ్చింది. అయినా పాత బకాయిల మొత్తాన్ని చెల్లించి, రెండో విడత ప్రాజెక్టును రూ.4.5 కోట్లతో బ్రిటిష్ కౌన్సిల్‌తో ఒప్పందం చేసుకోవాలని ఉన్నత విద్యామండలి అధికారులు ఏర్పాట్లు చేయడం విమర్శలకు తావిస్తోంది. -
ఫీజు కట్టలేదని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్ : తల్లిదండ్రులు కాలేజీ ఫీజు కట్టలేదని మనస్తాపానికి గురయిన ఓ విద్యార్థిని బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. సుస్మిత (21) అనే విద్యార్థిని ఘట్కేసర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఈ నేపథ్యంలో కాలేజీ ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులకు చెప్పింది. అందుకు వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురయిన సుస్మిత మూడవ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుస్మితను విద్యానగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా
మెదక్ : కళాశాలల ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మంగళవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఆర్ఐఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు బైఠాయించారు. అనంతరం విద్యా వ్యవస్థను రక్షించాలని కోరుతూ ఆర్ఐఓకు వినతిపత్రం అందించారు.