సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(ARFC) కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది.
ఈ మేరకు అధిక ఫీజులు వసూలు చేస్తే ఊపేక్షించేది లేదని కమిటీ పేర్కొంది. అదనంగా ఫీజులు వసూలు చేస్తే రూ. 2 లక్షలు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ARFC ద్వారా వచ్చి బీ-కేటగిరీ దరఖాస్తులను పరిశీలించాలి. అర్హులైన వారికి కచ్చితంగా సీటు ఇవ్వాల్సిందే. అలా కాకుండా మెరిట్ లేనివారికి సీటు కేటాయిస్తే రూ. 10 లక్షలు జరిమానా విధిస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment