![ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా](/styles/webp/s3/article_images/2017/09/3/71432638787_625x300.jpg.webp?itok=kiS-gQpJ)
ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా
మెదక్ : కళాశాలల ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మంగళవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు బైఠాయించారు. అనంతరం విద్యా వ్యవస్థను రక్షించాలని కోరుతూ ఆర్‌ఐఓకు వినతిపత్రం అందించారు.