ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో
Published Mon, Jul 25 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
బెజ్జూర్ : విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన ర హదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు పోరాటాన్ని ఆపేది లేదని ఏబీవీపీ నాయకులు తెలిపారు.
ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే తేవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి, జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల నియామకాన్ని వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గహాల్లో పెరిగిన ధరకు అనుగుణంగా చార్జీలు ఇవ్వాలన్నారు. గంట పాటు రోడ్డుపై విద్యార్థులు బైఠాయించడంతో పోలీసులు అక్కడకు చేరుకొని రాస్తారోకోను అడ్డుకున్నారు. అనంతరం విద్యార్థులు తహసీల్దార్ రఫతుల్లాకు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు బాలకష్ణ, కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement