ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు
నెల్లూరులో ఏబీవీపీ నాయకుల ధర్నా.. ఈడ్చిపడేసిన పోలీసులు
నెల్లూరు(టౌన్): ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి యువగళంలో మాట్లాడిన మీ గొంతు మంత్రి పదవి రాగానే మూగబోయిందా లోకేశ్..’ అని ఏబీవీపీ నాయకులు ప్రశి్నంచారు. ‘యువగళంలో మాట్లాడిన నోరు మంత్రి పదవి రాగానే మూగబోయిందా..’ అనే బ్యానర్ చేతపట్టుకుని ఏబీవీపీ నాయకులు సోమవారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్‌లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కనీ్వనర్ రాహుల్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచి్చన వెంటనే జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని లోకేశ్ యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారని చెప్పారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ లేని కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్ మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మంత్రి లోకేశ్ వెంటనే స్పందించాలని, లేకపోతే ఎక్కడికక్కడ ఆయన పర్యటనలను అడ్డుకుంటామని, సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు బలవంతంగా ఈడ్చి పక్కన పడేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సమీర్, సుమన్, రాబర్ట్, వినోద్, హేమంత్, సుకుమార్, నవీన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment