పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే చెల్లించాలని కోరుతూ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు.
బాన్సువాడ: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే చెల్లించాలని కోరుతూ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో ఉన్న మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. కాగా, పోచారం ఇంటి ముట్టడికి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న ఇంటర్, డిగ్రీ స్కాలర్‌షిప్‌లను చెల్లించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.