స్వచ్ఛభారత్‌తో జాతిపితకు నివాళి | central minister dattatreya pay tributes to gandhiji with swachbharath | Sakshi
Sakshi News home page

స్వచ్ఛభారత్‌తో జాతిపితకు నివాళి

Published Sun, Oct 2 2016 10:29 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్న దత్తాత్రేయ, లక్ష్మణ్‌ తదితరులు

స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్న దత్తాత్రేయ, లక్ష్మణ్‌ తదితరులు

చిక్కడపల్లి: ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాభారత్‌ కార్యక్రమయాన్ని జాతిపిత మహాత్మ గాంధీకి నిజమైన నివాళిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. ఆదివారం వివేక్‌నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని శుభ్రంగా ఉంచినప్పుడే ఆరోగ్య సమాజం నిర్మాణమతుందన్నారు. ఇందులో యువత ప్రధాన భూమిక పోషించాలని కోరారు. లక్ష్మణ్‌ మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ ఉద్యమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో రఘు, వాణిశ్వర శాస్త్రి, బసవానందం, డాక్టర్‌ నరేష్‌గౌడ్, ఎంవీఆర్‌ శాస్త్రి, అఖిలేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement