హైదరాబాద్: చిక్కడపల్లి రైల్వేక్వార్టర్స్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ బిల్డింగ్ మూడవ అంతస్తుపై నుంచి పడి శ్రావ్య అనే 18 నెల పాప మృతిచెందింది. శ్రావ్యను కాపాడబోయి పల్లవి అనే 13 సంవత్సరాల పాప కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరి మృతితో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment