Railway Quarters
-
కనుమరుగవుతున్న సికింద్రాబాద్ రైల్వే కాలనీలు.. అప్రోచ్ రోడ్లు మూసివేత
రైల్వే కాలనీలు, సాధారణ ప్రజల సమ్మేళనంగా దశాబ్దాల కాలంగా సికింద్రాబాద్ నగరం వర్ధిల్లింది. రైల్వే కాలనీలు, కార్యాలయాలు, స్టేషన్ల సమాహారంగా ఈ ప్రాంతం ప్రత్యేకతను చాటుకుంది. ఇదిలా ఉండగా రైల్వే కాలనీలు, స్థలాల మీదుగా సాధారణ ప్రజలు రాకపోకలకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉండేవి. క్రమేణా పరిస్థితులు మారుతున్నాయి. శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల తొలగింపుతో రైల్వే కాలనీలు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఈ ప్రాంతాల మీదుగా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న రైల్వే అప్రోచ్ రోడ్లు కనుమరుగు అవుతున్నాయి. కొంతకాలం క్రితం హమాలిబస్తీ, మెట్టుగూడ ప్రాంతాల్లో రోడ్లను మూసివేసిన అధికారులు తాజాగా మరిన్ని రోడ్లను మూసి వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. దశాబ్దాల కాలంగా...సికింద్రాబాద్ నియోజకవర్గం మొత్తం రైల్వే స్థలాలు దశాబ్దాల కాలంగా ఆవరించి ఉన్నాయి. మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట డివిజన్ల పరిధిలో రైల్వేశాఖకు చెందిన కాలనీలు నెలకొని ఉన్నాయి. ఆవిర్భావ కాలం నుంచి రైల్వే రోడ్ల మీదుగా పరిసర ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వందలాది మంది సాధారణ ప్రజలు పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లడం కోసం రైల్వే రహదారులను వినియోగించుకుంటున్నారు.శిథిలావస్థకు చేరడంతో.... దశాబ్దాల క్రితం నిర్మించిన రైల్వే క్వార్టర్లు క్రమేణా శిథిలావస్థకు చేరుకున్నాయి. శిథిలావస్థకు చేరుతున్న క్వార్టర్లను రైల్వే అధికారులు నేలమట్టం చేస్తూ వస్తున్నారు. ఖాళీ ప్రదేశాలుగా మారుతున్న సదరు స్థలాల చుట్టూ అధికారులు ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారు. పనిలో పనిగా ఆయా కాలనీల్లోంచి లోగడ కొనసాగిన అప్రోచ్ రోడ్లను కూడా మూసివేస్తున్నారు. మైదానాలుగా మారుతున్న రైల్వే క్వార్టర్లు, కాలనీల స్థలాల్లో కొన్నింటిని రైల్వే అధికారులు పరిరక్షిస్తున్నారు. ఇంకొన్ని స్థలాలను ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇచ్చేశారు. రహదారుల మూసివేతలు పూర్వకాలం నుంచి రైల్వే అప్రోచ్ రోడ్లను వినియోగించుకున్న లష్కర్ ప్రజలకు తాజాగా ప్రవేశాల మూసివేత వ్యవహారం గుదిబండగా మారుతుంది. ఈ వ్యవహారాల్లో భాగంగా హమాలిబస్తీ – చిలకలగూడ కూడలి, విజయపురికాలనీ–రైల్వే ఆసుపత్రి, లాలాగూడ–మారేడుపల్లి అప్రోచ్ రోడ్లను ఇప్పటికే మూసివేశారు. లీజుదారులు రైల్వే స్థలాల్లో నిర్మాణం పనులు ప్రారంభిస్తే మరిన్ని రహదారులు మూతడబడే అవకాశాలు ఉన్నాయి.ఇబ్బంది పడుతున్న ప్రజలు రైల్వే అధికారులు ఎడాపెడా రోడ్లు మూసివేస్తుండడంతో పరిసర ప్రాంతాల వెళ్లి రావడం కోసం తీవ్ర ఇబ్బందులపాలవుతున్నాంమని స్థానికులు వాపోతున్నారు. సమీపంలోని ఆసుపత్రి, పాఠశాల, బస్‌స్టాప్‌లకు వెళ్లడానికి కోసం కిలోమీటర్ల మేర తిరగాల్సి వస్తుంది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు కూడా సరైన సమయంలో వచ్చే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించి అప్రోచ్ రోడ్ల పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలి.చదవండి: మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులుఅనుమతిస్తే డంపింగ్యార్డులుగా మారుతున్నాయి : అధికారులు రైల్వే స్థలాల మీదుగా ప్రయాణాలకు అనుమతిస్తే వాటిని చెత్త డంపింగ్ కేంద్రాలుగా మార్చుతున్నారు. అల్లరిమూకలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులు వ్యర్థ పదార్థాలు డంప్ చేస్తున్నారు. రైల్వే స్థలాల పరిసర ప్రాంతాల ప్రజలకు రక్షణ, ఆరోగ్యకర వాతావరణం కోసం మాత్రమే అప్రోచ్ రోడ్లను మూసివేసి, రైల్వే స్థలాల్లోకి ప్రవేశాలను కట్టడి చేస్తున్నామని రైల్వే డివిజనల్ అధికారులు చెబుతున్నారు. -
10 ఎకరాలు.. రూ. 500 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: రైల్వే శాఖ ప్రైవేటీకరణ వైపు పరుగెడుతోంది. విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వడం ద్వారా ఆదాయ వనరులను సమీకరించునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన రైల్వే స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతోపాటు రైళ్లను కూడా ప్రైవేటీకరించేందుకు ఇప్పటికే బడా సంస్థలకు ఆహ్వానం పలికిన రైల్వేశాఖ.. తాజాగా ఖాళీ స్థలాల వినియోగంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే మౌలాలి, మెట్టుగూడ, లాలాగూడ, చిలకలగూడ, తదితర ప్రాంతాల్లోని సుమారు 10 ఎకరాల విలువైన స్థలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తాలోని రైల్వే అధికారుల క్వార్టర్స్‌ను అప్పగించేందుకు రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ మొత్తం స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు రూ.500 కోట్ల వరకు రాబడి వస్తుందని అంచనా వేస్తోంది. అందరి చూపు అటు వైపే... సంగీత్ చౌరస్తా నుంచి రైల్ నిలయం వైపు వెళ్లే దారిలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దక్షిణమధ్య రైల్వే అధికారుల క్వార్టర్స్ ఇవి. 40 మందికి పైగా అధికారులు ఈ క్వార్టర్స్‌లో నివాం ఉంటున్నారు. జనరల్ మేనేజర్, అదనపు జనరల్ మేనేజర్ మినహాయించి కనీసం పదేళ్లకు పైగా సీనియారిటీ కలిగిన ఉన్నతస్థాయి అధికారులకు ఈ క్వార్టర్స్ కేటాయిస్తారు. ఈ ప్రాంగణంలో జీ+1 భవనాల్లో అన్ని వసతులు ఉంటాయి. ఇళ్లల్లో పని చేసేవాళ్లకు, డ్రైవర్లకు ఔట్ హౌస్‌లు ఉంటాయి. రైల్‌నిలయంతో పాటే ఈ క్వార్టర్లను 1965–1970 మధ్య కట్టించారు. ఇటు రైల్‌నిలయం, అటు సంచాలన్‌భవన్, హైదరాబాద్ భవన్, లేఖాభవన్, తదితర రైల్వేకార్యాలయాలకు అందుబాటులో ఉన్న ఈ రైల్వే క్వార్టర్స్‌పై ప్రస్తుతం ఆర్ఎల్డీఏ కన్ను పడింది.ప్రైమ్ ల్యాండ్ కావడంతో దీన్ని లీజుకు ఇవ్వడం ద్వారా ఎక్కువ ఆదాయం లభించగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. లీజుపైనే సందిగ్ధం... రెండేళ్ల క్రితమే రైల్వేస్థలాల లీజుకోసం రైల్ లాండ్ డెవలప్మెంట్ అథారిటీ సన్నాహాలు చేపట్టింది. మొదట్లో 39 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని భావించారు.కానీ నిర్మాణ సంస్థల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. దీంతో గడువును 99 ఏళ్లకు పెంచినట్లు సమాచారం.కానీ సాధారణంగా స్థలాలను పూర్తిగా కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టే కార్పొరేట్ సంస్థలు లీజు స్థలాల పట్ల ఎలా ఆసక్తి చూపుతారనిదే సందిగ్ధం. లీజుకు ఇలా.... ⇔ రైళ్ల నిర్వహణ, సరుకు రవాణాపైనే కాకుండా రైల్వేస్థలాల నుంచి కూడా ఆదాయాన్ని ఆర్జించేందుకు రైల్వేశాఖ మూడేళ్ల క్రితం రైల్‌లాండ్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ రైల్వేస్థలాలను గుర్తించి బడా కార్పొరేట్ సంస్థలకు 99 ఏళ్ల వరకు లీజుకు ఇస్తుంది. ⇔ ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని రైల్వేకార్టర్స్ స్థలంలో భారీ వ్యాపార,వాణిజ్య భవన సముదాయాలను నిర్మించి నిర్వహించేందుకు (బిల్డ్, ఆపరేట్) లీజుకు ఇవ్వనున్నారు. దీనిద్వారా రైల్వేకు రూ.150 కోట్లకు పైగా ఆదాయం రాబట్టవచ్చని అంచనా. -
ఇద్దరి ప్రాణాలు మింగిన ఆట
హైదరాబాద్: ఇద్దరు చిన్నారులు ఆడుకోవడానికి భవనం పైకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి అనంతలోకాలకు వెళ్లిపోయారు. చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన బాధిత తల్లిదండ్రులతోపాటుగా స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పోలీసులు కథనం మేరకు..రైల్వే ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న బీదర్‌కు చెందిన కృష్ణప్రసాద్, రేణుక దంపతులకు ఏడాదిన్నర పాప శ్రావ్య. రైల్వే ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న బాబురావు, సుమిత్ర దంపతుల కుమార్తె పల్లవి (12). ఈ రెండు కుటుంబాలు చిలకలగూడలోని రైల్వే క్వార్టర్ నంబర్ 1010/ 9, 10 ఇళ్లలో నివసిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో చిన్నారి శ్రావ్యతోపాటు పల్లవి ఆడుకుంటూ మూడవ అంతస్తుపైకి వెళ్లారు. టెర్రాస్ పిట్టగోడ ఒకటిన్నర అడుగుల ఎత్తే ఉండటంతో ప్రమాదవశాత్తు శ్రావ్య కిందపడబోయింది. వెంటనే పల్లవి శ్రావ్య గౌను పట్టుకుని గట్టిగా కేకలు వేసింది. కింది అంతస్తులో ఉన్న రేణుక పైకి వచ్చేలోగా గాలిలో వేలాడుతున్న శ్రావ్య గౌను చిరగడంతో పల్లవి వదిలేసింది. దీంతో కింద పార్కింగ్ చేసిన కారుపై శ్రావ్య పడిపోయింది. పైకి వస్తున్న శ్రావ్య తల్లికి పెద్ద శబ్దం వినిపించ డంతో కిందికి పరుగులు తీసింది. అయితే టెర్రాస్‌పైనే ఉన్న పల్లవి బ్యాలెన్స్ కోల్పోయి తలకిందులుగా కిందపడి అక్కడిక్కడే మృతి చెందింది. కారుపై పడిన చిన్నారి శ్రావ్యకు తీవ్ర గాయాలు కావడంతో ద్విచక్ర వాహనంపై లాలాగూడ రైల్వే ఆస్పత్రికి అక్కడి నుంచి కిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రావ్య మృతి చెందింది. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. పరామర్శించిన మంత్రి పద్మారావు: సమాచారం అందుకున్న అబ్కారీమంత్రి తీగుళ్ల పద్మారావు బుధవారం ఉదయం గాంధీ మార్చురీ వద్దకు వచ్చి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో మృతుల తల్లిదండ్రులు బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తరలించేందుకు అవసరమైన రవాణా ఖర్చులను మంత్రి పద్మారావు చెల్లించారు. పట్టుకునేందుకు పరిగెత్తా అమ్మా అంటూ పల్లవి కేకలు వినిపించడంతో బయటకు వచ్చి చూశాను. ఎదురుగా ఉన్న క్వార్టర్స్ పై అంతస్తులో శ్రావ్య వేలాడుతూ, ఆమెను పట్టుకుని పల్లవి కనిపించారు. కిందపడితే పట్టుకుందామని పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆలోపే శ్రావ్య కారుపై పడిపోయింది. రెండు అడుగులు వేసేలోగా పల్లవి కూడా తన కాళ్ల వద్దే పడి మృతి చెందింది. బాధగా ఉంది. – హిమబిందు, ప్రత్యక్షసాక్షి ఆస్పత్రికి తరలించా డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాను. ఇంతలో క్షణాల వ్యవధిలో రెండు మార్లు పెద్ద శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూసేసరికి పల్లవి రక్తపుమడుగులో పల్లవి, కారుపై శ్రావ్యలు పడిఉన్నారు. వెంటనే బైక్‌పై వారిద్దరినీ రైల్వే ఆస్పత్రికి తీసుకువెళ్లాను. అప్పటికే పల్లవి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. –కిరణ్‌కుమార్, ప్రత్యక్షసాక్షి -
చిక్కడపల్లి రైల్వే క్వార్టర్స్‌లో విషాదం
హైదరాబాద్: చిక్కడపల్లి రైల్వేక్వార్టర్స్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ బిల్డింగ్ మూడవ అంతస్తుపై నుంచి పడి శ్రావ్య అనే 18 నెల పాప మృతిచెందింది. శ్రావ్యను కాపాడబోయి పల్లవి అనే 13 సంవత్సరాల పాప కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరి మృతితో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
కలుషితనీరు తాగి 138 మందికి అస్వస్థత
చిలకలగూడ రైల్వేక్వార్టర్స్ కలుషిత నీరు తాగి 138 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు తాగిన వీరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఇందులో 40 మంది చిన్నారులు కూడా ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితులను మెట్టుగూడ రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలాన్ని రైల్వే అధికారులు పరిశీలించారు. -
పెళ్లింట్లో పట్టపగలే దొంగలు పడ్డారు!
ఆదిలాబాద్ క్రైం: ఇంటికి తాళం వేసి అందరూ ఫంక్షన్ హాల్లో జరిగే వివాహ వేడుకకు వెళ్లారు. అది గమనించిన దొంగలు ఇదే సరైన సమయం అనుకున్నారేమో.. అదనుచూసి ఇంట్లో అందినకాడికి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పట్టణంలోని రైల్వేక్వార్టర్స్‌లో ఉండే రైల్వే ఉద్యోగి రఘునాథ్ కూతురు వివాహం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులంతా ఇంటికి తాళం వేసి పెళ్లి వేడుకకు వెళ్లారు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉంచిన రూ.80వేల నగదుతోపాటు మూడు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. వివాహ వేడుక అనంతరం ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సరైన ఉద్యోగం రాలేదనే బెంగతో..
‘ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయాను. నాకు ఈ లోకంలో జీవించే అర్హత లేదు’ అని సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే క్వార్టర్స్‌లో ఉండే చైతన్య (25) బీటెక్ పూర్తి చేశాడు. కొన్నాళ్లు బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో రూ.8వేల వేతనానికి పని చేశాడు. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించి విఫలమైన చైతన్య ప్రస్తుతం రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు.తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోతున్నానన్న మనస్తాపంతో సూసైడ్నోటి రాసి శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
కడపలో దారుణం
వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలో ఆదివారం దారుణ హత్య వెలుగు చూసింది. కడప రైల్వే కార్వర్టర్స్ వాచ్ మెన్ మస్తాన్ బాబును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. మస్తాన్ బాబును హత్య చేసి.. పెట్రోల్ పోసి తగుల బెట్టారు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు -
కుక్కలను చంపి.. కారం చల్లి..
గుంతకల్లు రూరల్, న్యూస్‌లైన్ : గుంతకల్లులో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. వీధి కుక్కలకు విషం పెట్టిన దుండగలు.. చోరీ చేసిన ఇంట్లో ఆనవాళ్లు లభ్యం కాకుండా కారం పొడి చల్లారు. గుంతకల్లు రైల్వే జిల్లా ఎస్పీ కార్యాలయానికి వంద అడుగుల దూరంలోని వివేకానందనగర్ (వీవీ నగర్) రైల్వే క్వార్టర్స్‌లో జరిగిన ఈ ఘటనలో 30 తులాల బంగారం, కిలో వెండి, రూ.22 వేల నగదు చోరీ అయ్యాయి. బాధితులు, పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కసాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వీవీ నగర్ రైల్వే క్వార్టర్స్‌లో గుంతకల్లు డీజిల్ షెడ్లో పని చేస్తున్న బీఏ నాగరాజు నివాసం ఉంటున్నారు. తన సమీప బంధువు అనారోగ్యంగా ఉండడంతో చూసేందుకు ఈనెల 2న బెంగళూరుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఆదివారం ఇంటి తలుపులు తెరచి ఉండడం.. సమీపంలో మూడు వీధి కుక్కలు చనిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే రైల్వే ఉన్నతాధికారులకు తెలియజేయగా వారు నాగరాజుకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఇక్కడికి చేరుకున్న నాగరాజు.. ఇంట్లోకి వెళ్లిచూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇళ్లంతా కారం పొడి చల్లి ఉండడాన్ని గుర్తించి బెడ్రూంలోకి వెళ్లారు. రెండు బీరువాలను పగులగొట్టిన దుండగులు అందులోని 30 తులాల బంగారు నగలు, కిలో వెండి సామగ్రి, రూ.22 వేల నగదు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా దుండగులు పక్కా ప్రణాళికతో చోరీ చేసినట్లు స్పష్టమవుతోంది. రాత్రి వేళ వీధి కుక్కలు అరవకుండా ఉండేందుకు విషప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఆహారంలో విషం కలిపి కాలనీలో వేయడంతో అవి తిని చనిపోయాక గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేసినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. పైగా ఇంట్లో ఆధారాలు లేకుండా ఉండేందుకు కారం పొడి చల్లినట్లు తెలుస్తోంది. కాగా, శనివారం రాత్రి రైల్వే క్వార్టర్స్‌లో పోలీసులు గస్తీ నిర్వహించలేదని స్థానికులు చెబుతున్నారు. సివిల్ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. క్లూస్ టీం సిబ్బంది, కసాపురం ఎస్ఐ వెంకటరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
మా ఊరెళ్లి పోతాం
=మానవ మృగాల మధ్య బతకలేం =బాధితురాలి భర్త ఆవేదన విశాఖపట్నం, న్యూస్‌లైన్ : కొండల్లో పుట్టారు... కోనల్లో పెరిగారు. బతుకు తెరువు కోసం ఉన్న ఊరికి దూరమయ్యారు. పొట్ట చేత పట్టుకుని నగరానికి వలస వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవన పోరాటం సాగిస్తున్నారు. మానవ మృగాలు వారి బతుకును చిందరవందర చేశారు. భర్త కళ్లెదుటే భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి కంచరపాలెం దరి దోబీ ఘాట్ పాత రైల్వే క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. (వివరాలు మెయిన్‌లో) జి.మాడుగుల మండలం పాంగిమామిడి గ్రామానికి చెందిన ఓ గిరిజన యువకుడు భార్య పిల్లలతో నగరానికి వచ్చి ఆర్.కె.ఏజెన్సీలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అతడి భార్యపై అత్యాచారయత్నం చేశారు. అడ్డుకున్న అతడిని తాళ్లతో కట్టి కర్కశంగా వ్యవహరించారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో వారు ప్రాణ భయంతో వణికిపోయారు. గత్యంతరం లేక రక్షణ కల్పించాలని కంచరపాలెం పోలీసులను ఆశ్రయించారు. బతిమలాడినా కనికరించలేదు ‘బతుకుతెరువుకి వలస వచ్చాం. అద్దె ఇంట్లో ఉండే స్తోమత లేక పాడుబడిన క్వార్టర్స్‌లో ఉంటున్నాం. తుప్పలు, డొంకలు, విష సర్పాల మధ్య జీవిస్తున్నాం. మనుషుల్లో విషం ఉంటుందని గ్రహించలేకపోయాం. మా బతుకుల మీద కొట్టారు. కాళ్లు పట్టుకుని బతిమలాడినా కనికరించలేదు. క్రూరంగా, అతికిరాతకంగా వ్యవహరించారు. నా కళ్ల ముందే నా భార్యపై అత్యాచారం చేశారు. బయటకు చెబితే చంపేస్తామన్నారు. నగరంలో మృగాల మధ్య నివసించలేం మన ఊరికి వెళ్లిపోదామని’ గిరిజన యువకుడు రోదిస్తూ భార్యను ఓదార్చాడు. పోలీస్‌స్టేషన్‌లో బాధిత జంటను చూసిన ప్రజలు చలించిపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానికుల పనే...! అత్యాచారం చేసింది పరిసర ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. భర్త తెలిపిన వివరాల ఆధారంగా యువకులని గ్రహించారు. క్రికెట్ ఆడడానికి వచ్చి కొంతమంది యువకులు క్వార్టర్స్ పరిసరాల్లో తిరుగుతారని, పలుమార్లు తనను కొట్టి జేబులో డబ్బులు తీసుకున్నారని బాధితురాలి భర్త పోలీసులకు చెప్పాడు. నిందితులను గుర్తిస్తానని స్పష్టం చేశాడు.