సాక్షి, హైదరాబాద్ : దోమలగూడకు చెందిన వ్యాపారి గజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరిగింది. తనను కిడ్నాప్ చేసి రూ. కోటి వసూలు చేసి విడిచిపెట్టారంటూ గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫార్చ్యూన్ ఫైనాన్స్ కేసులో దాదాపు రూ. 24 కోట్ల మేర మోసం చేశాడనే ఆరోపణలతో... గతంలో గజేంద్రప్రసాద్ అన్నను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో గజేంద్రప్రసాద్ కిడ్నాప్ కేసులో పలు అనుమానాలు తలెత్తున్నాయి. దీంతో గజేంద్ర ప్రసాద్ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు... అసలు కిడ్నాప్ జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
కాగా చిక్కడపల్లిలో వ్యాపారవేత్త గజేందర్ ప్రసాద్ కిడ్నాప్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. దోమల్‌గూడ ప్రాంతానికి చెందిన గజేంద్ర ప్రసాద్ ఆటోమొబైల్ ఫైనాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనను కిడ్నాప్ చేశారు. అనంతరం మూడు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. అయితే కోటి రూపాయలు తీసుకుని సోమవారం ఉదయం ఆయనను అబిడ్స్‌లో విడిచిపెట్టారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment