హైదరాబాద్: హైదరాబాద్‌లోని అబిడ్స్ గ్రాండ్ హోటల్‌లో బిర్యానీ విషయంలో గొడవ కాస్త పరస్పర దాడి దారి తీసింది. మటన్ బిర్యానీ సరిగా ఉడకలేదని.. డబ్బులు చెల్లించమని హోటల్ వెయిటర్లతో వినియోగదారులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెద్దది కావటంతో వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది యువతీ యువకులకు గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఫిర్యాదు రావడంతో.. 10మంది వెయిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సదరు హోటల్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కస్టమర్లపై దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ధూల్‌పేటకు చెందిన కస్టమర్లపై దాడి చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాండ్ హోటల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చదవండి: బైరి నరేష్ అడ్డగింత.. వాహనం ఢీ కొట్టి అయ్యప్ప భక్తుడికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment