waiters
-
బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. రాజాసింగ్ సీరియస్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని అబిడ్స్ గ్రాండ్ హోటల్లో బిర్యానీ విషయంలో గొడవ కాస్త పరస్పర దాడి దారి తీసింది. మటన్ బిర్యానీ సరిగా ఉడకలేదని.. డబ్బులు చెల్లించమని హోటల్ వెయిటర్లతో వినియోగదారులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెద్దది కావటంతో వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది యువతీ యువకులకు గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఫిర్యాదు రావడంతో.. 10మంది వెయిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు హోటల్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కస్టమర్లపై దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ధూల్‌పేటకు చెందిన కస్టమర్లపై దాడి చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాండ్ హోటల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: బైరి నరేష్ అడ్డగింత.. వాహనం ఢీ కొట్టి అయ్యప్ప భక్తుడికి గాయాలు -
వెయిటర్‌కి కోట్లలో జాక్‌పాట్ తగిలింది! అదే ఆమె జీవితాన్ని..
కోట్లల్లో లాటరీ తగిలితే వాట్ ఏ జాక్‌పాట్ అని ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఒక్క క్షణంలో జీవితమే మారిపోయింది అని సంబరపడిపోతాం. అది కూడా ఓ సాధారణ వెయిటర్‌లా పనిచేస్తున్న వ్యక్తికి ఇలాంటి అదృష్టం దక్కితే అతడి సంతోషానికి అవధులే ఉండవు. కానీ అతడికి ఆ లాటరీ టికెట్ శాపమైపోయింది. ఎందుకు తగిలిందిరా బాబు అని జుట్టు పీక్కునేలా చుక్కలు చూపించింది. ఇందేంటి అనుకుంటున్నారా..!ఇంకెందుకు ఆలస్యం అలా ఎలా అయ్యిందో త్వరగా చదివేయండి మరీ..! ఫోరిడాలోని అలబామాలోని వాఫిల్ హౌస్ హోటల్‌కి ఎడ్వర్డ్ సెవార్డ్ అనే కస్టమర్ వచ్చాడు. అతడు వెళ్లిపోతూ వెయిటర్ టోండా డికర్సన్ అనే మహిళకి తాను ఫ్లోరిడాలో కొనుగోలు చేసిన లాటరీని టిప్‌గా ఇచ్చాడు. ఈ ఘటన మార్చి 6, 1999లో చోటు చేసుకుంది. అనూహ్యంగా ఆ మరుసటి రోజే ఆ లాటరీ టికెటే విజేతగా ప్రకటించబడింది. దీంతో డికర్సన్‌కి ఆ లాటరీలో ఏకంగా రూ. 73 కోట్లకు పైగా సోమ్ము వచ్చింది. అంతే ఇక తన జీవితం మారబోతుందన్న ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది డికర్సన్. అంతేగాదు ఆ వాఫిల్ హౌస్‌లోని మిగతా ఉద్యోగులు కూడా డికర్సన్‌కి లాటరీ తగలిందని సంతోషంగా ఉన్నారు. అక్కడ ఆ హోటల్లో తమ ఉద్యోగులు ఎవరైనా జాక్‌పాట్ కొట్టినట్లయితే ఆ వచ్చిన మొత్తాన్ని అందరూ షేర్ చేసుకుంటామని ఒప్పదం చేసుకున్నారు. ఇప్పడు డికర్సన్ ఇప్పుడు అందుకు ఇష్టపడటం లేదు. దీంతో సహోద్యోగులు కోపంతో ఆమెపై కేసు పెట్టారు. అయితే కోర్టు ఆ ఒప్పదం నోటిమాటే గానీ అధికారికంగా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని వెల్లడించింది. అలబామా చట్టం ఇలాంటి ఒప్పందాలు చట్టం విరుద్ధం కాదని చెబుతుండటంతో కోర్టు ఆ కేసుని కొట్టేసింది. అలాగే డికర్సన్ గెలుచుకున్న మొత్తాన్ని తన వద్ద ఉంచుకోవచ్చని తీర్పు ఇచ్చేసింది. ఇలా డికర్సన్ తన సహోద్యోగులతో పంచుకోలేదన్న విషయం లాటరీ టికెట్ ఇచ్చిన ఎడ్వర్ సెవార్డ్కి తెలుస్తుంది. దీంతో అతను కూడా డికర్సన్పై కేసు పెట్టాడు. తన సహోద్యుగులకు డికర్సన్ వాటా ఇవ్వాల్సిందే అని కోర్టుని ఆశ్రయించాడు. ఐతే కోర్టు అతడి కేసుని కూడా కొట్టేసింది. అయితే డికర్సన్‌కి ఆ కోర్టు కష్టాలు అక్కడితో ఆగలేదు. హమ్మయ్యా!.. అని అన్ని అడ్డంకులు దాటుకుని తన స్నేహితుడితో కలిసి ఎస్ కార్పోరేషన్ అనే కంపెనీని పెట్టింది. అయితే ఆ కంపెనీ ట్యాక్స్‌లు పెద్ద మొత్తంలో ఎగ్గొట్టినట్టు ఆరోపణలు వచ్చి.. మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్(ఐఆర్స్) ఎదుర్కొంటోంది. డికర్సన్ తన కుటుంబానికి రూ. 20 కోట్లు బహుమతిగా ఇచ్చిందన్న అంశం తెరపైకి వచ్చి రాద్ధాంతంగా మారింది. ఆమె గెలుచుకున్న మొత్తంలో సుమారు 51% గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఐఆర్ఎస్ చెబుతోంది. ఐతే డికర్సన్ అది గిఫ్ట్ కాదని తమ కుటుంబంలో ఎవరైన పెద్ద మొత్తంలో గెలుచుకుంటే అది అందరం షేర్ చేసుకోవడం జరుగుతుందని, అదికూడా ఒకరి బాగోగులు చూసుకోవడంలో భాగంగానే అని వివరణ ఇచ్చుకుంది. ఇలా ఆమెను 12 ఏళ్ల పాటు ఇన్కమ్ ట్యాక్స్ కష్టాలు వెంటాడాయి. ఆ విధంగా ఆమె ఉదారంగా గెలుచుకున్న సొమ్ములో దాదాపు రూ. 9 కోట్ల వరకు పన్నుల రూపంలో చెల్లించాలని 2012లో కోర్టు ఆమెను ఆదేశించింది. కోట్లలో డబ్బు గెలుచుకుందన్నమాటే గానీ ట్యాక్స్‌లు సహోద్యోగుల రూపంలో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కోట్లాధికారిగా మారానన్న సంతోషాన్ని మాత్రం ఇవ్వలేదు సరికదా!. ఆ లాటరీ తగిలాక ప్రతి నిమిషం ఓ టెన్షన్.. టెన్షన్..అన్నట్లుగా మారిపోయింది జీవితం. టైం బ్యాడ్‌గా ఉంటే అదృష్టం కూడా దురదృష్టంలా ఏడిపించేస్తుందేమో. బహుశా ఊరికే వచ్చిన సొమ్ము లేదా నడిమంత్రపు సిరి ఎక్కువ కాలంనిలవదు అంటే ఇదేనేమో కదా..!. In 1999, waitress Tonda Dickerson was tipped a lottery ticket and won $10,000,000. Her colleagues then sued her for their share. Then she was sued by the man who tipped her the ticket. Later, she was kidnapped by her ex-husband and had to shoot him in the chest. Finally, she… pic.twitter.com/KpDR4lhN4I — Fascinating (@fasc1nate) December 11, 2023 (చదవండి: 24 గంటలూ ఓపెన్... సిబ్బంది మాత్రం నిల్!) -
డ్రెస్‌కోడ్ మార్చకపోతే రైలుని అడ్డుకుంటాం.. దెబ్బకు దిగొచ్చిన రైల్వే శాఖ
ఉజ్జయిని: రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పనిచేసే వెయిటర్ల డ్రెస్‌కోడ్‌ను రైల్వే శాఖ సోమవారం ఉపసంహరించుకుంది. వారి యూనిఫామ్‌ను మార్చేసింది. వారి డ్రెస్‌కోడ్ పట్ల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మత గురువులు, సాధువులు అభ్యంతరం వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. వెయిటర్లు సాధువుల తరహాలో కాషాయ రంగు దుస్తులు, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి, రైలులో విధులు నిర్వర్తిస్తున్నారని, ఇది హిందూ మతాన్ని అవమానించడమే అవుతుందని వారు ఆక్షేపించారు. డ్రెస్‌కోడ్‌ను మార్చకపోతే ఢిల్లీలో ఈ రైలును అడ్డుకుంటామన్నారు. రెండు రోజుల క్రితం రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు. దీంతో రైల్వే శాఖ వెంటనే స్పందించింది. సిబ్బంది దుస్తులను మార్చింది. సాధారణ చొక్కా, ప్యాంట్, సంప్రదాయ తలపాగా ధరించి, యాత్రికులకు సేవలందిస్తారని తెలిపింది. కాషాయ రంగు మాస్కులు, చేతి గ్లౌజ్‌ల్లో మార్పులు చేయలేదు. రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇటీవలే ఢిల్లీలో ప్రారంభమయ్యింది. 7,500 కి.మీ.ల మేర దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టేసి మళ్లీ ఢిల్లీకి చేరుకోనుంది. -
వెలవెలబోతున్న డ్యాన్స్ బార్లు
ముంబై: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం వివిధ వ్యాపార సంస్థలతో పాటు ముంబైలోని డ్యాన్స్ బార్లపై కూడా పడింది. రద్దయిన మొదటి, రెండు రోజులు అంతగా ప్రభావం చూపలేదు. కానీ గత మూడు రోజులుగా కస్టమర్లు లేక డ్యాన్స్ బార్లతో పాటు సాధారణ బార్లు వెలవెలబోతున్నాయి. అరకొరగా కొందరు వస్తున్నా.. బార్లలో డ్యాన్స్ గర్ల్స్ పై నోట్లు వెదజల్లే వాళ్లు కరువయ్యారు. దీంతో వారు కూడా ఇంటికే పరిమితమయ్యారు. అదేవిధంగా కస్టమర్లు లేక బార్లలో పనిచేసే వెయిటర్లకు అదనపు ఆదాయం పోయింది. బార్ యజమానులు వెయిటర్లకు నెలకు చెల్లించే జీతాల కంటే కస్టమర్లు ఇచ్చే టిప్పు దాదాపు 50 రేట్లు ఎక్కువ ఉంటుంది. దీంతో వారిలో కూడా నిరుత్సాహం నెలకొంది. రోజువారి ఖర్చులకు జేబులో నుంచి తీయాల్సి వస్తోందంటున్నారు. ముంబైలో సుమారు 250 బార్లు ఉన్నాయి. రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణంగా రోజు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు కస్టమర్లు వస్తున్నారు. దీంతో చేసేదిలేక బార్లు మూసివేయడమే ఉత్తమమని అనేక మంది బార్ యజమానులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బార్లు మూసివేశారు. నగరంలో దాదాపు అందరి పరిస్థితి.. ఎకౌంట్లో డబ్బులుండి కూడా చేబులు ఖాళీగానే ఉన్నాయనే విధంగా ఉందని ఆహార్ బార్ అధ్యక్షుడు భారత్ ఠాకూర్ అన్నారు. కౌంటర్లో చిల్లర డబ్బులు లేక బార్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక కస్టమర్లవద్ద కొత్తగా వచ్చిన రూ.500, రూ.2000 నోట్లు ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నామని అన్నారు. కొందరు మధ్యం సేవించి, భోజనం తిన్న తరువాత బిల్లు చెల్లించే సమయంలో రద్దయిన పాత నోట్లు ఇస్తున్నారు. స్వీకరించేందుకు నిరాకరిస్తే తాగిన మత్తులో గొడవపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు నగరంలోని అనేక బార్లలో దర్శనమిస్తున్నాయని ఠాకూర్ తెలిపారు. దీంతో చేసేది లేక బార్లు మూసేయాల్సి వస్తుందన్నారు. -
మంత్రులపై స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్, ప్రభుత్వ అధికారులపై విమర్శులు చేస్తూ వస్తున్న స్వామి.. శుక్రవారం ట్విట్టర్ లో మరో బాంబు పేల్చారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రులు సంప్రదాయ, లేదా మన దేశానికే చెందిన ఆధునిక దుస్తులు ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. వారు టై, కోట్ ధరిస్తే వెయిటర్లలా కనిపిస్తారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం తాజాగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంతాదాస్ లను లక్ష్యంగా చేసుకుని సుబ్రమణ్యం స్వామి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. BJP should direct our Ministers to wear traditional and modernised Indian clothes while abroad. In coat and tie they look like waiters — Subramanian Swamy (@Swamy39) 24 June 2016