వెయిటర్‌కి కోట్లలో జాక్‌పాట్‌ తగిలింది! అదే ఆమె జీవితాన్ని.. | A Waitress Life Turned Into A Nightmare After $10 Million Lottery Win | Sakshi
Sakshi News home page

ఆ లాటరీ టికెట్‌ వెయిటర్‌ జీవితాన్ని తలకిందులు చేసి చిక్కుల్లో పడేసింది!

Published Mon, Dec 11 2023 5:40 PM | Last Updated on Mon, Dec 11 2023 5:53 PM

A Waitress Life Turned Into A Nightmare After 10 Million Dollar Lottery Win - Sakshi

కోట్లల్లో లాటరీ తగిలితే వాట్‌ ఏ జాక్‌పాట్‌ అని ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఒక్క క్షణంలో జీవితమే మారిపోయింది అని సంబరపడిపోతాం. అది కూడా ఓ సాధారణ వెయిటర్‌లా పనిచేస్తున్న వ్యక్తికి ఇలాంటి అదృష్టం దక్కితే అతడి సంతోషానికి అవధులే ఉండవు. కానీ అతడికి ఆ లాటరీ టికెట్‌ శాపమైపోయింది. ఎందుకు తగిలిందిరా బాబు అని జుట్టు పీక్కునేలా చుక్కలు చూపించింది. ఇందేంటి అనుకుంటున్నారా..!ఇంకెందుకు ఆలస్యం అలా ఎలా అయ్యిందో త్వరగా చదివేయండి మరీ..!

ఫోరిడాలోని అలబామాలోని వాఫిల్‌​ హౌస్‌ హోటల్‌కి ఎడ్వర్డ్‌ సెవార్డ్‌ అనే కస్టమర్‌ వచ్చాడు. అతడు వెళ్లిపోతూ వెయిటర్‌ టోండా డికర్సన్‌ అనే మహిళకి తాను ఫ్లోరిడాలో కొనుగోలు చేసిన లాటరీని టిప్‌గా ఇచ్చాడు. ఈ ఘటన మార్చి 6, 1999లో చోటు చేసుకుంది. అనూహ్యంగా ఆ మరుసటి రోజే ఆ లాటరీ టికెటే విజేతగా ప్రకటించబడింది. దీంతో డికర్సన్‌కి ఆ లాటరీలో ఏకంగా రూ. 73 ‍కోట్లకు పైగా సోమ్ము వచ్చింది. అంతే ఇక తన జీవితం మారబోతుందన్న ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది డికర్సన్‌. అంతేగాదు ఆ వాఫిల్‌ హౌస్‌లోని మిగతా ఉద్యోగులు కూడా డికర్సన్‌కి లాటరీ తగలిందని సంతోషంగా ఉన్నారు. అక్కడ ఆ హోటల్‌లో తమ ఉద్యోగులు ఎవరైనా జాక్‌పాట్‌ కొట్టినట్లయితే ఆ వచ్చిన మొత్తాన్ని అందరూ షేర్‌ చేసుకుంటామని ఒప్పదం చేసుకున్నారు.

ఇప్పడు డికర్సన్‌ ఇప్పుడు అందుకు ఇష్టపడటం లేదు. దీంతో సహోద్యోగులు కోపంతో ఆమెపై కేసు పెట్టారు. అయితే కోర్టు ఆ ఒప్పదం నోటిమాటే గానీ అధికారికంగా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని వెల్లడించింది. అలబామా చట్టం ఇలాంటి ఒప్పందాలు చట్టం విరుద్ధం కాదని చెబుతుండటంతో కోర్టు ఆ కేసుని కొట్టేసింది. అలాగే డికర్సన్‌ గెలుచుకున్న మొత్తాన్ని తన వద్ద ఉంచుకోవచ్చని తీర్పు ఇచ్చేసింది. ఇలా డికర్సన్‌ తన సహోద్యోగులతో పంచుకోలేదన్న విషయం లాటరీ టికెట్‌ ఇచ్చిన ఎడ్వర్‌ సెవార్డ్‌కి తెలుస్తుంది. దీంతో అతను కూడా డికర్సన్‌పై కేసు పెట్టాడు. తన సహోద్యుగులకు డికర్సన్‌ వాటా ఇ‍వ్వాల్సిందే అని కోర్టుని ఆశ్రయించాడు. ఐతే కోర్టు అతడి కేసుని కూడా కొట్టేసింది.

అయితే డికర్సన్‌కి ఆ కోర్టు కష్టాలు అక్కడితో ఆగలేదు. హమ్మయ్యా!.. అని అన్ని అడ్డంకులు దాటుకుని తన స్నేహితుడితో కలిసి ఎస్‌ కార్పోరేషన్‌ అనే కంపెనీని పెట్టింది. అయితే ఆ కంపెనీ ట్యాక్స్‌లు పెద్ద మొత్తంలో ఎగ్గొట్టినట్టు ఆరోపణలు వచ్చి.. మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రైడ్స్‌(ఐఆర్‌స్‌) ఎదుర్కొంటోంది. డికర్సన్‌ తన కుటుంబానికి రూ. 20 కోట్లు బహుమతిగా ఇచ్చిందన్న అంశం తెరపైకి వచ్చి రాద్ధాంతంగా మారింది. ఆమె గెలుచుకున్న మొత్తంలో సుమారు 51% గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఐఆర్‌ఎస్‌ చెబుతోంది. ఐతే డికర్సన్‌ అది గిఫ్ట్‌ కాదని తమ కుటుంబంలో ఎవరైన పెద్ద మొత్తంలో గెలుచుకుంటే అది అందరం షేర్‌ చేసుకోవడం జరుగుతుందని, అదికూడా ఒకరి బాగోగులు చూసుకోవడంలో భాగంగానే అని వివరణ ఇచ్చుకుంది.

ఇలా ఆమెను 12 ఏళ్ల పాటు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కష్టాలు వెంటాడాయి. ఆ విధంగా ఆమె ఉదారంగా గెలుచుకున్న సొమ్ములో దాదాపు రూ. 9 కోట్ల వరకు పన్నుల రూపంలో చెల్లించాలని 2012లో కోర్టు ఆమెను ఆదేశించింది. కోట్లలో డబ్బు గెలుచుకుందన్నమాటే గానీ ట్యాక్స్‌లు సహోద్యోగుల రూపంలో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కోట్లాధికారిగా మారానన్న సంతోషాన్ని మాత్రం ఇవ్వలేదు సరికదా!. ఆ లాటరీ తగిలాక ప్రతి నిమిషం ఓ టెన్షన్‌.. టెన్షన్‌..అన్నట్లుగా మారిపోయింది జీవితం. టైం బ్యాడ్‌గా ఉంటే అదృష్టం కూడా దురదృష్టంలా ఏడిపించేస్తుందేమో. బహుశా ఊరికే వచ్చిన సొమ్ము లేదా నడిమంత్రపు సిరి ఎక్కువ కాలంనిలవదు అంటే ఇదేనేమో కదా..!.

(చదవండి: 24 గంటలూ ఓపెన్‌... సిబ్బంది మాత్రం నిల్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement