మంత్రులపై స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు | Ministers in 'coat and tie' look like waiters, says Subramanian Swamy | Sakshi
Sakshi News home page

మంత్రులపై స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

Published Fri, Jun 24 2016 10:45 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

మంత్రులపై స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

మంత్రులపై స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్, ప్రభుత్వ అధికారులపై విమర్శులు చేస్తూ వస్తున్న స్వామి.. శుక్రవారం ట్విట్టర్ లో మరో బాంబు పేల్చారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రులు సంప్రదాయ, లేదా మన దేశానికే చెందిన ఆధునిక దుస్తులు ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. వారు టై, కోట్ ధరిస్తే  వెయిటర‍్లలా కనిపిస్తారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
 
గత కొంతకాలంగా ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం తాజాగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంతాదాస్ లను లక్ష్యంగా  చేసుకుని  సుబ్రమణ్యం స్వామి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement