మైనంపల్లికి త్రుటిలోతప్పిన ప్రమాదం | Malkajgiri MLA has missed a high risk | Sakshi
Sakshi News home page

మైనంపల్లికి త్రుటిలోతప్పిన ప్రమాదం

Published Thu, May 23 2019 3:16 AM | Last Updated on Thu, May 23 2019 3:16 AM

Malkajgiri MLA has missed a high risk - Sakshi

హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. లిఫ్ట్‌ తెగిపడటంతో ఆయనతో పాటు మరో నలుగురికి స్వల్పగాయాలయ్యా యి. చిక్కడపల్లి సాయికృప హోటల్‌లోని నాల్గవ అంతస్తులో బుధవారం జరిగిన టీఆర్‌ఎస్‌ నేత ఎర్రం శ్రీనివాస్‌గుప్తా కుమారుడి తొట్టెల కార్యక్రమానికి మైనంపల్లి హాజరయ్యారు. శ్రీనివాస్‌గుప్తాను మైనంపల్లి అభినందించి తిరిగి వెళ్లిపోతున్న క్రమంలో వీడ్కోలు ఇచ్చేందుకు గుప్తాతో సహా స్థానికనేతలైన అమర్‌నాథ్‌రెడ్డి, బద్దం మోహన్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి లిఫ్ట్‌ ఎక్కారు.

మూడో అంతస్తుకి రాగానే లిఫ్ట్‌వైరు తెగిపోవడంతో లిఫ్ట్‌ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దీంతో మైనంపల్లికి ఎడమకాలి తొడవద్ద గాయమైంది. ఆయన్ని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతున్న వారిని మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ పరామర్శించారు. లిఫ్ట్‌ నిర్వహణ పట్ల యాజమాన్యం శ్రద్ధ తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు హోటల్‌ వద్ద ఆందోళన చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement