గణేశ్ విగ్రహాల నిమిజ్జనం ఊరేగింపులో భాగంగా పంపిణీ చేసిన జ్యూస్ తాగి 36 మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.
ముంబై: గణేశ్ విగ్రహాల నిమిజ్జనం ఊరేగింపులో భాగంగా పంపిణీ చేసిన జ్యూస్ తాగి 36 మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ముంబై పట్టణంలోని జోగేశ్వరి ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే వారిలో చికిత్స అనంతరం 17 మందిని డిశ్చార్జి చేయగా, 19 మంది మాత్రం ఆస్పత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నట్టు చెప్పారు.
బాధితులకు ప్రాణపాయం లేదని వైద్యులు వెల్లడించినట్టు డీసీపీ మోహన్ దహికర్ చెప్పారు. గణేశ్ విగ్రహాల నిమిజ్జనం ఊరేగింపులో భాగంగా ఓ గ్రూప్ కలుషితమైన శీతాలపానియాన్ని పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.