
సాక్షి, సిటీబ్యూరో: మట్టి గణపతిని పూజిద్దాం...పర్యావరణాన్ని రక్షిద్దామంటూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మట్టి గణపతులు పంపిణీ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడంలో ముందుందని మునిసిల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ అన్నారు. గురువారం మైహోం నవదీపలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతుల కార్యక్రమంలో తన కుమార్తెతో కలిసి మట్టివిగ్రహలు పంపిణీ చేశారు.
ఉద్యోగులందరికీ మట్టి విగ్రహాలు
హెచ్‌ఎండీఏ ఉద్యోగులందరికీ హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ మట్టి గణేష విగ్రహాలను పంపిణీ చేశారు. చీఫ్ అకౌంట్ ఆఫీసర్ శరత్ చంద్ర, సూపరింటెండెంట్ పరంజ్యోతి, పీఆర్‌ఓ లలిత ప్రతి ఉద్యోగికి మట్టి గణపతి తో పాటు తులసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు పర్యావరణ హితానికి అనుగుణంగా వ్యవహరించాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను విరివిగా పెంచాలని కోరారు.