కాంప్లెక్స్‌గా మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు, వీడియో వైరల్‌ | Ganesha Idol As Ashwatthama: Kalki Ganesha Set Goes Viral | Sakshi
Sakshi News home page

Ganesha Idol As Ashwatthama: ‘కల్కి’ కాంప్లెక్స్‌గా మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు

Published Tue, Sep 10 2024 11:43 AM | Last Updated on Tue, Sep 10 2024 12:32 PM

Ganesha Idol As Ashwatthama: Kalki Ganesha Set Goes Viral

దేశ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఎప్పటి మాదిరే ఈ సారి కూడా స్టార్‌ హీరోలకు సంబంధించిన సినిమా పాత్రలపై స్పెషల్‌ వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్‌ పుష్ప 2, ఎన్టీఆర్‌ దేవరతో పాటు పలువురి స్టార్‌ హీరోల లుక్‌లో ఉన్న గణపతి బొమ్మలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే ‘కల్కి’ రూపంలో ఉన్న వినాయకుడే ఈ ఏడాది స్పెషల్‌ అట్రాక్షన్‌ నిలిచాడు.

కాంప్లెక్స్‌గా మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు
ప్రభాస్‌ హీరోగా కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ ఏడాది జూన్‌ 27న విడుదలై..బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో భైరవగా ప్రభాస్‌, అశ్వత్థామగా అమితాబ్‌, యాస్కిన్‌గా కమల్‌ నటించారు. ఈ సినిమా చూసిన వాళ్లకు ప్రత్యేక కారు ‘బుజ్జి’, కాంప్లెక్స్‌ ప్రదేశాలు అలా గుర్తిండిపోతాయి. ఇప్పుడు ఇదే సినిమాను పోలిన ఓ గణపతి మందిరం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో వినాయకుడు అశ్వత్థామ రూపంలో ఉండగా.. మందిరం కాంప్లెక్స్‌ ప్రదేశంలా ఉంది. 

‘కల్కి’వినాయకుడు ఎక్కడ ఉన్నాడు?
‘కల్కి’ వినాయకుడి విడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అసలు ఈ మందిరం ఎక్కడ ఏర్పాటు చేశారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ వెరైటీ వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేసింది తమిళ ప్రజలే. తమిళనాడులోని  కృష్ణగిరి జిల్లాలో ఈ మందిరం ఉన్నట్లు తెలుస్తోంది. కాంప్లెక్‌ మాదిరి మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్‌లో బుజ్జిని కూడా ఉంచారు. లోపల యాస్కిన్‌ లుక్‌లో ఉన్న కమల్‌ బొమ్మ పెట్టి.. అమితాబ్‌ అశ్వత్థామ లుక్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, నుదుటిపై మణి వెలిగిపోతున్నట్లు ఓ లైట్ కూడా సెట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఏడాది స్పెషన్‌ వినాయక విగ్రహం ఇదేనని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement