జైజై గణేశా.. జై బోలో గణేశా! మళ్లీ వినాయక చవితి వస్తోంది. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గణనాధుడి మహాపర్వదినం సందర్భంగా ఊరూ-వాడా మంటపాలతో ముస్తాబవుతున్నాయి. ప్రతి గల్లీలోని మంటపాల్లో గజాననుడు కొలువుదీరబోతున్నాడు. అయితే, ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలతో చేసే విగ్రహాలకు స్వస్తి పలుకుదాం. సర్వ విఘ్నాలను మాపే విగ్నేషుడి విగ్రహాలు ప్రకృతికి విఘాతం కలిగించరాదన్న లక్ష‍్యం కోసం అందరూ నడుం బిగించాల్సిన సమయమిది. గణనాధుడి మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం. ప్రకృతిని ఆరాదించే ఆ దేవదేవుడి ఆశీర్వచనాల కోసం నిండు మనసుతో కొలుద్దాం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రకృతిహితమైన గణనాథులను ఏర్పాటు చేసి మనవంతు సామాజిక కర్తవ్యాన్ని నెరవేర్చుదాం.
నవరాత్రుల పాటు ఆ దేవదేవుడిని కొలవడానికి మీరు ఏర్పాటు చేసే అపురూపమైన మట్టి ప్రతిమల ఫోటోలను ‘సాక్షి’ పంపించండి. మీ సామాజిక కర్తవ్యాన్ని నలుగురికి తెలియజేసి అందరికీ స్పూర్తిగా నిలవండి. మీ నగరంలో, మీ ఊరిలో, మీ వీధిలో, మీ గల్లీలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే వినాయకుడి మట్టి ప్రతిమల ఫోటోలను మొబైల్ ద్వారా మాకు పంపించండి. ఫోటోతో పాటు ఎక్కడ నెలకొల్పిందీ, పేరు, ఊరు, వీధి, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలతో lordganapati@sakshi.comకు మెయిల్ ద్వారా పంపించండి. వాటిని మేము www.sakshi.com వెబ్ సైట్‌లో ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం... ప్రకృతిని కాపాడుకుందాం. నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం.
వినాయకుడికి వినమ్రతతో...
Published Thu, Aug 29 2019 8:53 AM | Last Updated on Sat, Aug 31 2019 1:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment