అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు... సందడి చేసిన బాలీవుడ్‌ తారలు | Shah Rukh Khan, Aishawarya Rai Bachchan And Other Celebs Attend Ambani Ganesh Chaturthi Celebrations - Sakshi
Sakshi News home page

Ganesh Chaturthi Celebrations: అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు... సందడి చేసిన బాలీవుడ్‌ తారలు

Published Wed, Sep 20 2023 10:22 AM | Last Updated on Wed, Sep 20 2023 10:56 AM

Shah Rukh Khan celebs attend Ambani Ganesh Chaturthi celebrations - Sakshi

Ambani Ganesh Chaturthi celebrations: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఇంట గణేష్ చతుర్థి వేడుకలు జరిగాయి.  ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ దంపతులు ముంబైలోని తమ నివాసం యాంటిలియాలో వైభవంగా నిర్వహించిన వేడుకలకు బాలీవుడ్‌ (Bollywood)లోని ప్రముఖ తారలు హాజరై సందడి చేశారు.

(Richest Ganesh Idol In Mumbai: 69 కిలోల బంగారం.. 336 కిలోల వెండి.. చూస్తే రెండు కళ్లూ చాలవు!)

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కుటుంబంతో సహా సంప్రదాయ దుస్తుల్లో హాజరై వేడుకకు వన్నె తెచ్చారు. ఆయనతోపాటు భార్య గౌరీ ఖాన్, పిల్లలు సుహానా ఖాన్, అబ్రామ్ ఉన్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ (Salman Khan) కూడా తెల్లటి కుర్తాలో హుందాగా కనిపించారు.

ఇక ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan)తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి వేడుకకు వచ్చారు. రణవీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొణె (Deepika Padukone) దంపతులు సైతం సంప్రదాయ దుస్తులలో అబ్బురపరిచారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కలిసి రావడం కనిపించింది. 
అలియా భట్, ఓజీ ఫ్యాషన్‌స్టార్ రేఖ అందమైన చీరకట్టుతో ఆకట్టకున్నారు.

అంబానీ ఇంట గణేశుడి ఆశీర్వాదం కోసం వచ్చిన ఇతర బాలీవుడ్ ప్రముఖుల్లో విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా, అథియా శెట్టి, మనీష్ మల్హోత్రా, జూహీ చావ్లా తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement