అమెరికాలోని నార్త్ కరోలినాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హంటర్స్‌విల్లేలోని సాయిమందిర్‌లో గణపతి ప్రతిమను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా పెద్ద ఊరేగింపుతో మండపానికి తీసుకువచ్చారు. మహిళల కోలాటాలు, భజనలు, భక్తుల జయజయధ్వానాల నడుమ ప్రత్యేకంగా రూపొందించిన మండపాల్లో గణనాథుడిని ప్రతిష్టించారు.
వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. విఘ్నేశ్వరుడ్ని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
11 రోజుల పాటు నిత్యపూజలు, మండపంలో రోజుకో అలంకరణ నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గణేష్ ఉత్సవాలతో పాటు 5వ వార్షికోత్సవం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం, బాబాకి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment