బాలాపూర్‌లో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి.. | Man Brutally murdered In Hyderabad | Sakshi
Sakshi News home page

బాలాపూర్‌లో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి..

Published Sun, Jan 19 2020 9:16 PM | Last Updated on Sun, Jan 19 2020 9:19 PM

Man Brutally murdered In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని బాలాపూర్‌ పీఎస్‌ పరిధిలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు.. ఓ వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి ఉరి వేశారు. దేవతలగుట్ట మార్గంలో ఓ వ్యక్తి మృతదేహం గేటుకు వేలాడుతూ ఉన్నదని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువకుడిని బాలాపూర్‌ నివాసి జొన్నాడ ప్రశాంత్‌గా గుర్తించారు. ప్రశాంత్‌కు తల్లిదండ్రులు లేరని అతని అన్న శ్రీకాంత్‌ వద్ద ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రశాంత్‌ అన్నకు సమాచారం అందించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement