
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ ఆట ఇద్దరి యువకుల ప్రాణం తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలో రైల్వేస్టేషన్ వెనుక ఉన్న గ్రౌండ్‌లో రెండు వర్గాలు క్రికెట్ ఆడుతుండగా ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరువర్గాలు కత్తులతో దాడులకు పాల్పడ్డారు.
ఈఘటనలో పవన్ కళ్యాణ్ యాదవ్, నర్సింగ్ యాదవ్ అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ దాడిని వీడియో తీస్తున్న ప్రేమ్ కుమార్ అనే యువకుడిపై ఓ వర్గం దాడికి పాల్పడింది. దీంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. కాగా పాత కక్ష్యలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఒక బర్త్‌డే పార్టీలో, క్రికెట్ ఆడే సందర్భంలో గొడవలు జరిగాయని, ఆ గొడవలే కత్తిపోట్లకు దారితీసినట్లుగా భావిసున్నామని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment