criket
-
బుల్లి క్రికెట్ స్టార్ సంచలనం : స్టైలిష్ బ్యాటింగ్‌తో సచిన్ ఫిదా
క్రికెట్‌పై అమ్మాయిలు చూపిస్తున్న ఆసక్తి మహిళా క్రికెట్‌పై ఆశల్ని మరింత పెంచుతోంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ క్రికెట్ మహిళలు స్టార్లుగా సత్తా చాటుతున్న నేపథ్యంలో తాజాగా ఒక సంచలన తార అవతరించడం విశేషంగా నిలిచింది. తొమ్మిదేళ్లకే అత్యుత్తమ ప్రతిభతో ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది.Always good to see young girls playing cricket. Watching videos like these brings a smile to my face. https://t.co/LaQv9ymWRx— Sachin Tendulkar (@sachin_rt) March 30, 2024 ఎడమచేతితో బ్యాటింగ్ చేస్తూ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ఆకట్టుకునే స్టైలిష్ బ్యాట్ స్వింగ్‌తో మైదానం నలుమూలలకు బంతిని పరుగులు పెట్టించింది. గొప్ప క్రికెటర్‌గా రాణించాలని కలలు కంటోంది. కశ్మీర్‌లోని సోపోర్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక హర్మత్ ఇర్షాద్ భట్. సాధారణ డ్రైవర్ కుమార్తె. బుమై (జైంగీర్)లో రెండో తరగతి చదువుతోంది. ఇటీవల ప్లేగ్రౌండ్‌లో అబ్బాయిల టీంతో ఆడుతూ షాట్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. ఆమె లాంటి పిల్లలు క్రికెట్‌ను ఆస్వాదించడం చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈవీడియోను రీ-ట్వీట్ చేశాడు. యువత ఆడటం క్రికెట్ ఆడటం చూడటం తనకు చాలా సంతోషానిస్తోందంటూ టూ ట్వీట్‌చేశారు. దీంతో మరింత వైరల్ అయింది. పలువురు ఆమె టాటెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
బెట్టింగ్ బాలరాజులు! కొంపలు కాలిపోతున్నాయి.!
బెట్టింగ్... ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ ... చాప కింద యాసిడ్‌లా విస్తరించి అనేక కొంపల్ని ముంచేస్తోంది . బెట్టింగ్ ఒక మానసిక వ్యసనం ! తల్లితండ్రులు " కంచు" టైపు అయితే పిల్లల్లో బెట్టింగ్ వ్యసనం వచ్చే అవకాశం ఎక్కువ ! " కంచు మొగునట్లు కనకంబు మోగునా ?" అని నానుడి. కొంత మంది ఎంత సేపూ "షో ఆఫ్ " టైపు . తమ గొప్పలు చెప్పుకోవడం .. చూపుకోవడం వీరి దిన చర్య . కిట్టి పార్టీలు మందు పార్టీలలో ఈ "కంచులు" గణగణ మోగుతుంటాయి . " ఈ కాలం కూడా ఇంకా మారుతీ సుజుకిలో ఎట్టా ట్రావెల్ చేస్తారో .. ఏంటో .. నేనైతే మినిమం వోల్వో వదినా .. మా అన్నగారయితే లాండ్రోవర్ దిగరు" అని బిల్డప్‌లు ఇస్తూ బతికేస్తారు. అదొక ఐడెంటిటీ క్రైసిస్. ఆత్మ న్యూనతా భావం. ఆవు చేలో దూడ గట్టున మేస్తుందా ? నేను గొప్ప అని అవతలివారికి చాటి చెప్పుకోవాలి అనే ఆలోచన బెట్టింగ్ కు దారి తీస్తుంది. కష్టపడే తత్త్వం లేకపోవడం , ఈజీ గా డబ్బు సంపాదించాలి అనుకోవడం కూడా ఒక కారణం గ్యాంబ్లింగ్ డిసార్డర్ - అనేది తీవ్ర మానసిక రోగం. నేడు ఎంతో మంది దీని బారినపడి సతమమవుతున్నారు . ఆలోచనలు ఎప్పుడూ గ్యాంబ్లింగ్ చుట్టూ తిరుగుతుంటాయి. ఎన్నికలు .. క్రికెట్... సినిమా జయాపజయాలు.. కాదోయి ఏది బెట్టింగ్ కు అనర్హం. ఒక్క సారి గెలిస్తే.. "ఇప్పుడు మనకు సుడి తిరిగింది.. స్టార్స్ కలిసి వస్తున్నాయి.. బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తే అది ఇప్పుడే.. ఇప్పుడే" అంటూ అందులో లీనం అయిపోతారు. ఓడితే .. "ఇజ్జాత్ కా సవాల్ .. ప్రెస్టేజ్ క్వొశ్చన్.. ఓడిపోయి పోవడమా? గెలిచే దాక ఆడాల్సిందే!" అంటూ ఆటలో మునిగిపోతారు. అంటే బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ అనేది సుడిగుండం. పద్మ వ్యూహం.. ఒక సారి దిగితే సేఫ్ గా బయటకు రావడం అనేది ఉండదు . ఆలా ఒకటి రెండు సార్లు వచ్చినా ఆది అంతం కాదు .. జస్ట్ బిగినింగ్. జూదంలో గెలవడం వల్ల డోపమైన్ హార్మోన్ వస్తుంది . ఇది మహా కిక్కు ఇస్తుంది. ముందుగా ఒక పెగ్గు మందుతో స్టార్ట్ చేసినవాడికి మూడేళ్లయ్యే సరికి కనీసం క్వార్టర్ దిగనిదే కిక్కు ఎక్కదు. బెట్టింగ్ కూడా అంతే. అమౌంట్ పెంచుకొంటూ పెద్ద పెద్ద బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తేనే మునుపటి కిక్కు వస్తుంది. కాబట్టి చిన్నగా మొదలయిన వ్యసనం.. ఆస్తులు... పెళ్ళాం పిల్లల తాకట్టు దాకా దారితీస్తుంది . "నేనట్టా కాదు లే ... నేను మహా స్మార్ట్. జస్ట్ ఫన్ కోసం ఆడుతున్నా". అని ప్రతి బెట్టింగ్ బంగారు రాజు అనుకొంటాడు. బెట్టింగ్ డోపమైన్ "హై" అనేది ఒక సైంటిఫిక్ రూల్. అది ఎవడినీ వదలదు అని వాడు అర్థం చేసుకొనేటప్పటికీ అన్ని అయిపోయి కొంపలు కాలిపోయి ఉంటాయి. మహాభారతం కాలం నుంచి అన్ని రకాల జూదాలు/ బెట్టింగ్ లు మాయా వ్యవహారాలే. కేసినోకు పొయ్యి సర్వ నాశనం కానోడు .. కేసినో నిర్వహించి కోట్లకు పడగలెత్తని వాడు భూప్రపంచం లో కనపడడు. బెట్టింగ్ బంగారు రాజులను బకరాలను చేయడానికి బెట్టింగ్ మాఫియా .." ఫలానా వాడు మిలియన్స్ సాధించాడు" అని బిల్డ్ అప్ స్టోరీ లు వదులుతుంటుంది. బకరాలు నమ్మేస్తారు . బెట్టింగ్ వల్ల నిమ్మళంగా ఒక చోట కూర్చోలేని చంచలత్వం వస్తుంది . ఇలాంటి వారు ఏ పనిపై దృష్టి సారించలేరు . బెడ్ రూమ్‌లో కూడా ఇదే ధ్యాసతో వుంటారు .ఉస్సేన్ బోల్ట్ లయి పోతారు, ఆ తర్వాత ఇంకేముంది.. సంసార జీవనంలో చిక్కులే చిక్కులు. బెట్టింగ్ గాళ్ళు సులభంగా చిరాకు కు గురవుతారు . అసహనం పెరిగిపోతుంది. బెట్టింగ్ అప్పులకు దారి తీస్తుంది . అప్పులు తీర్చ్చడానికి అదనంగా బెట్టింగ్ చేస్తారు . ఆంటే చిన్న ఊబిలో నుంచి మరీనా ట్రెంచ్ లోతుల్లోకి వీరి పతనం వేగంగా సాగుతుంది. తమ కుటుంబానికి తమ వ్యసనం గురించి తెలిసిపోకుండా ఉండేందుకు అబద్దాలు చెప్పడం మొదలెడతారు. బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ జరిగే చోట మందు- విందు- పొందు తప్పని సరి ఆడ్ ఆన్స్. డయాబెటిస్ బిపి కిడ్నీ సమస్యలు ఊబకాయం , ఎయిడ్స్ .. వీరు అదనంగా పొందే కొన్ని బహుమతులు . బెట్టింగ్ వల్ల అప్పుల ఊబి ఖాయం . ఆత్మహత్యలు ... కొన్ని సార్లు హత్యలు .. అటుపై చిప్పకూళ్ళు .. బెట్టింగ్ కుటుంబాలను నాశనం చేస్తుంది . 25ఏళ్ళ లోపు వారిలో మెదడు ముందుభాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ సరిగ్గా అభివృద్ధి చెందివుండదు . దీనితో వీరు భావోద్వేగాలను తట్టుకొనే సామర్థ్యాన్ని కలిగివుండరు . వీరి చేతిలో సెల్ ఫోన్ . నేడు నీలి చిత్రాలు , హింసాత్మక వీడియో గేమ్స్ కన్నా కుటుంబాలను నాశనం చేస్తోంది ఆన్లైన్ బెట్టింగ్. చేతిలో సెల్ ఫోన్ ఏదో చేసుకొంటున్నాడు అని తల్లితండ్రులు అనుకొనే లోపే బెట్టింగ్ మాఫియా లు వచ్చి " మీ వాడు ఇరవై లక్షలు అప్పుపడ్డాడు . ఇస్తారా చస్తారా? అంటూ బెదిరించి ఆస్తులు మానప్రాణాలు తీసిన ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. మీ ఇంటిలో కూడా పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. బెట్టింగ్ మాఫియా కాళ్లావేళ్లా పడ్డా కనికరించదు. దయనీయమయిన స్థితిలో జీవితాన్ని చాలించాల్సి వస్తుంది. సిగరెట్ తాగితే ఇరవై ఏళ్లకు ప్రాణం మీదకు వస్తుంది. మందు తాగితే 15 ఏళ్లకు. గంజాయి కొడితే ఐదేళ్లకు. ఆన్లైన్ బెట్టింగ్ చేస్తే కేవలం ఆరునెలలకు.. చస్తారు. మిగతా వాటిలో తాగిన వాడొక్కడి ప్రాణం. కానీ ఆన్లైన్ బెట్టింగ్ లో ఇంటిల్లి పాదీ.. కట్టకట్టుకుని.. తస్మాత్ జాగ్రత్త . పిల్లల్ని సెల్ ఫోన్ కు దూరంగా ఉంచండి . 'ఈజీ మనీ పాములాంటిది అని చెప్పండి . కష్టపడే తత్వాన్ని నేర్పండి. వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు -
ధోని చివరి మ్యాచ్ వాన గండం తప్పదా...!
-
చెన్నై స్టేడియం లో ధోని చేసిన పనికి ...
-
పాతికేళ్లకు క్రికెట్ ఏంట్రీ.. ఇంజనీర్ T20 బౌలర్
-
CSK సక్సెస్ ఫార్మలా చెప్పిన ధో ని
-
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా టోర్నమెంట్
-
లారాతో ఉన్న యువకుడిని గుర్తుపట్టారా?
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ప్రముఖ ఆటగాళ్లలో ఒకడిగా పేరుపొందిన వెస్టిండిస్ మాజీ క్రికెటర్ బ్రియన్‌లారా ఇన్‌స్టాగ్రామ్‌లో 2003లో ఓ అభిమానితో దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. ఎవరీ యువకులు? ఫ్యాన్ మూమెంట్ అని నాకు అర్థమైంది. అతడే తర్వాతి కాలంలో ఓ స్పెషల్ ఆటగాడిగా మారాడు. అతనెవరో మీరే చెప్పండి అంటూ అభిమానులతో 2003నాటి ఫోటోను పంచుకున్నాడు. ఇంతకీ ఆ స్పెషల్ ఆటగాడు ఎవరో మీరు గుర్తుపట్టారా? ఇంకా లేదా అయితే మీకోసం మరో క్లూ. నాటి అండర్19 జట్టు(క్రింది ఫోటో)లో సర్కిల్ చేసిన యువకుడే అతను. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన నాటి భారత అండర్19 జట్టు అతనెవరో కాదు, భారత స్టైలీష్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా. బ్రియన్‌లారా పోస్ట్‌కు సురేష్ రైనా బదులిస్తూ.. నిజానికి నాకే చాలా ప్రత్యేకమైన సందర్భం. నా అభిమాన క్రికెటర్‌తో దిగిన మధుర క్షణం అది. అండర్ 19 జట్టుకు ఆడే సమయంలో మేమందరం హెతిరో విమానాశ్రయంలో దిగాము. మా ముందే ఉన్న దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారాను చూసి నమ్మలేకపోయా. ఆరోజు మిమ్మల్ని కలవడం, మీతో కలిసి ఫోటో దిగడం, నాలో నూతన ఉత్తేజాన్ని ఇచ్చినట్టయింది. ఆరోజు నుంచి వెనక్కుతిరిగి చూసుకోలేదు. దేశం కోసం ఆడటం, ఉత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టిపెట్టా అంటూ రీపోస్ట్ చేసి కామెంట్ చేశాడు. ఇక ఈ ఫోటోకు నైస్ క్లిక్ అంటూ మరో భారత మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ కామెంట్ చేశాడు. సురేష్ రైనా ఇటీవలి ఫోటో -
ప్రారంభమైన సాక్షి ప్రీమియర్ లీగ్
-
ఆటలో గొడవ ప్రాణం తీసింది
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): క్రికెట్లో గొడవ విద్యార్థి ప్రాణం తీసింది. కడుపులో గట్టిగా కొట్టడంతో విద్యార్థి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందిన ఘటన పాతకరాసాలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాతకరాసాకు చెందిన మరుబారికి రామారావు కుమారుడు విజయ్(13) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఇంటి దగ్గరలోని ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడేందుకు స్నేహితులతో వెళ్లాడు. పాతకరాసాకు చెందిన చిన్నసాయితో కలిసి రెండు టీములుగా ఏర్పడి క్రికెట్ ఆడాడు. రెండు మ్యాచ్‌ల్లో విజయ్ టీమ్ గెలిచింది. మూడో మ్యాచ్ కూడా గెలుపు దిశగా ఉండడంతో సాయి గొడవ పడ్డాడు. ఇది కొట్లాటకు దారితీసింది. సాయి.. విజయ్ కడుపు భాగంలో చేతితో పిడి గుద్దులు గుద్దడమే కాకుండా బ్యాట్‌తో కొట్టినట్లు అక్కడి వారు చెబుతున్నారు. నొప్పితో విజయ్ ఆటస్థలంలో పడిపోయాడు. కొద్దిసేపటి తరువాత తోటివారి సహాయంతో ఇంటికి చేరాడు. కడుపు నొప్పి ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కడుపు లోపలి భాగంలో గట్టి దెబ్బలు తగలడంతో మంగళవారం రాత్రి విజయ్ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై మృతుడు తల్లిదంద్రులు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఖైదు లోంచి ఖైదు లోకి...
జైలు నుంచి తప్పించుకునే ప్రణాళికలు వేస్తుండగానే, ఇమ్రాన్‌ను పుస్తకాలకి అట్టలు వేసే పనిలో నియమిస్తారు జైలు అధికారులు. వాటి ఖాళీ పేజీలని ఒక నోట్బుక్గా కుట్టి, తన ఊరి గురించీ, దానికీ మెహెందీకీ ఉన్న వైరానికున్న మూల కారణాల గురించీ రాసుకుంటాడు పుస్తకాలని అసహ్యించుకునే ఇమ్రాన్. ‘భారతదేశపు ప్రతి పట్టణంలోనూ ఒక చిన్న పాకిస్తాన్ ఉంది’ అన్న మాటలు, ‘వ్యానిటీ బాగ్’ నవల అట్టమీద ఉన్నవి. దీని కథానాయకుడైన ఇమ్రాన్ జైల్లో కూర్చుని, గడిచిన తన జీవితాన్ని గుర్తు చేసుకుంటుంటాడు. కాల్పనిక ‘మ్యాంగో బాగ్’ అనే ఊర్లో ‘మెహెందీ’ ప్రాంతంలో హిందువులుంటే, ‘వ్యానిటీ బాగ్’ అధికంగా ముస్లిములూ, కొద్దిపాటి క్రైస్తవ కుటుంబాలూ ఉండే ప్రదేశం. ‘పాకిస్తాన్లో ప్రసిద్ధికెక్కిన ధనవంతుల పేర్లు పెట్టుకోవడం మాకు అలవాటే’ అంటాడు పాకిస్తానీ క్రికెటర్ పేరున్న ఇమ్రాన్ జబ్బారీ. మెహెందీ వాసులు వీళ్ళ ప్రాంతాన్ని ‘లిటిల్ పాకిస్తాన్’ అని పిలుస్తారు. జీవితంలో ఒక లక్ష్యం అంటూ లేకుండా, బలాదూరుగా తిరుగుతూ సామాన్యమైన జీవితాలు గడుపుతూనే, పరపతి గణిద్దామనుకునే యువకులు ఏర్పరుచుకున్న, ‘5బి పురుషులు’ అన్న గ్యాంగులో ఇమ్రాన్ చేరతాడు. ‘బి’కి కారణం వారిలో ఒకరైన యాహ్యా వినలేకపోవడం, మాట్లాడలేకపోవడం. ఒకరోజు దొంగిలించబడిన స్కూటర్లని పట్టణం నలుమూలలకీ తీసుకెళ్ళి వదిలేసే పని దొరుకుతుంది వీరికి. ఇమ్రాన్ ఆ పని ముగించిన కొంతసేపటికే, స్కూటర్లో ఉన్న బాంబులు పేలి, మ్యాంగో బాగ్ పౌరులని గాయాలపాలు చేస్తాయి. అప్పుడు కానీ తను తీవ్రవాద చర్యలో పాలు పంచుకున్నానని ఇమ్రాన్ గుర్తించడు. 14 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది. జైలు నుంచి తప్పించుకునే ప్రణాళికలు వేస్తుండగానే, అతన్ని పుస్తకాలకి అట్టలు వేసే పనిలో నియమిస్తారు జైలు అధికారులు. వాటి ఖాళీ పేజీలని ఒక నోట్బుక్గా కుట్టి, తన ఊరి గురించీ, దానికీ మెహెందీకీ ఉన్న వైరానికున్న మూల కారణాల గురించీ రాసుకుంటాడు పుస్తకాలని అసహ్యించుకునే ఇమ్రాన్. బయటి లోకంతో అతనికుండే ఒకే సంబంధం ప్రతీ నెలా కొడుకుని కలుసుకునేటందుకు జైలుకొచ్చే అతని తల్లి. ఊర్లో జరిగే సంగతులన్నీ కొడుక్కి చెప్తూ ఉంటుంది. ఆమె రావడం ఆగిపోయిన మూడు నెలలకి తండ్రి వచ్చి, తల్లి మరణించిందని చెప్తాడు. రచయిత అనీస్ సలీమ్, ఇమ్రాన్ పట్ల జాలి కలిగించే ప్రయత్నం చేయరు. ఎవరినీ జడ్జ్ చేయరు. ఏ సెంటిమెంటూ చూపించకుండా, అగౌరవమైన మాటలని కూడా సులభంగా వాడతారు. ఒంటరితనాన్నీ, వ్య«థనీ, నిరాశనీ హాస్యరూపంలో వ్యక్తీకరిస్తారు. నీతులు చెప్పకుండా కథనాన్ని నిర్లిప్తంగా కొనసాగిస్తారు. నవల మధ్యలో అనేకమైన కోట్స్ ఉంటాయి: ‘కథలల్లడం, ప్రతిదానికీ పేరు పెట్టడం అంటే మొహల్లావారికి ఎంత పిచ్చంటే, సరిగ్గా మసీదు ఎదురుగానే ఉన్న చెట్టుని కూడా వదలక, దాన్ని ‘ఫ్రాంక్లిన్ అని పిలుస్తారు. అదేదో క్రైస్తవ తల్లీతండ్రీకి పుట్టి, గరాజిలో పని చేసే పింటోస్తో పాటు సెయింట్ థామస్ చర్చికి ఆదివారాలు వెళ్తున్నట్టు’. దేశంలో సరైన చదువు, ఉద్యోగం లేకపోయిన యువకులు గడిపే జీవన విధానాన్నీ, దాన్ని తప్పించుకునే దారి వారికి లేకపోవడం గురించీ రాస్తారు సలీమ్. ప్రత్యేకంగా– మైనారిటీ వర్గాల ఆశలు, నిష్ఫలమైన నిరాశలుగా మారడం గురించి వర్ణిస్తారు. ‘నవల ఆశ గురించినది కాదు. నైరాశ్యం గురించినది. మానవత్వాన్ని విభజించగల మతపరమైన అసహనం, ఎన్నికల్లో నెగ్గడం గురించినది’ అంటారు కేరళకు చెందిన సలీమ్. 2013లో ‘హిందూ ప్రైజ్ ఫర్ బెస్ట్ ఫిక్షన్’ అవార్డు పొందిన ఈ నవలని పికడొర్ ఇండియా పబ్లిష్ చేసింది. -కృష్ణ వేణి -
యువకుల ప్రాణం తీసిన క్రికెట్
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ ఆట ఇద్దరి యువకుల ప్రాణం తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలో రైల్వేస్టేషన్ వెనుక ఉన్న గ్రౌండ్లో రెండు వర్గాలు క్రికెట్ ఆడుతుండగా ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరువర్గాలు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. ఈఘటనలో పవన్ కళ్యాణ్ యాదవ్, నర్సింగ్ యాదవ్ అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ దాడిని వీడియో తీస్తున్న ప్రేమ్ కుమార్ అనే యువకుడిపై ఓ వర్గం దాడికి పాల్పడింది. దీంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. కాగా పాత కక్ష్యలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఒక బర్త్‌డే పార్టీలో, క్రికెట్ ఆడే సందర్భంలో గొడవలు జరిగాయని, ఆ గొడవలే కత్తిపోట్లకు దారితీసినట్లుగా భావిసున్నామని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
జిల్లా అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అండర్ –19 క్రికెట్ ఎంపికలు హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ క్రికెట్ నెట్స్‌లో జరిగాయి. జిల్లా జట్టుకు ఎంపికైన క్రికెటర్లు ఈ నెల 6వ తేదీ నుంచి సంగారెడ్డిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే అండర్ – 19 క్రికెట్ టోర్నీలో పాల్గొంటుందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చేకూరి వెంకట్, మెగా యూత్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి ఎండీ మసూద్‌లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది క్రికెటర్లు హాజరు కాగా వారికి ఎంపికలు నిర్వహించి 14 మంది క్రికెటర్లను జట్టులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. జట్టుకు ఎంపికైన వారి వివరాలను ప్రకటించారు. జట్టు వివరాలు: టీవీఎస్ నారాయణ, పి. భరత్, కె. సాయిసత్యతేజ, వి. విరించి, టి. నరేష్ సింగ్, పి. జయదేవ్, డి. సూర్య, పి. రాజేష్, జి, ధీరజ్, ఎం. ఠాగూర్, ఎస్. డి మహ్మద్‌హుస్సేన్, హేమంత్, కె. రవి, జి. వినోద్‌లు ఎంపికయ్యారు.