బ్రియన్ లారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ప్రముఖ ఆటగాళ్లలో ఒకడిగా పేరుపొందిన వెస్టిండిస్ మాజీ క్రికెటర్ బ్రియన్‌లారా ఇన్‌స్టాగ్రామ్‌లో 2003లో ఓ అభిమానితో దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. ఎవరీ యువకులు? ఫ్యాన్ మూమెంట్ అని నాకు అర్థమైంది. అతడే తర్వాతి కాలంలో ఓ స్పెషల్ ఆటగాడిగా మారాడు. అతనెవరో మీరే చెప్పండి అంటూ అభిమానులతో 2003నాటి ఫోటోను పంచుకున్నాడు. ఇంతకీ ఆ స్పెషల్ ఆటగాడు ఎవరో మీరు గుర్తుపట్టారా? ఇంకా లేదా అయితే మీకోసం మరో క్లూ. నాటి అండర్19 జట్టు(క్రింది ఫోటో)లో సర్కిల్ చేసిన యువకుడే అతను.
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన నాటి భారత అండర్19 జట్టు
అతనెవరో కాదు, భారత స్టైలీష్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా. బ్రియన్‌లారా పోస్ట్‌కు సురేష్ రైనా బదులిస్తూ.. నిజానికి నాకే చాలా ప్రత్యేకమైన సందర్భం. నా అభిమాన క్రికెటర్‌తో దిగిన మధుర క్షణం అది. అండర్ 19 జట్టుకు ఆడే సమయంలో మేమందరం హెతిరో విమానాశ్రయంలో దిగాము. మా ముందే ఉన్న దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారాను చూసి నమ్మలేకపోయా. ఆరోజు మిమ్మల్ని కలవడం, మీతో కలిసి ఫోటో దిగడం, నాలో నూతన ఉత్తేజాన్ని ఇచ్చినట్టయింది. ఆరోజు నుంచి వెనక్కుతిరిగి చూసుకోలేదు. దేశం కోసం ఆడటం, ఉత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టిపెట్టా అంటూ రీపోస్ట్ చేసి కామెంట్ చేశాడు. ఇక ఈ ఫోటోకు నైస్ క్లిక్ అంటూ మరో భారత మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ కామెంట్ చేశాడు.
సురేష్ రైనా ఇటీవలి ఫోటో
Comments
Please login to add a commentAdd a comment