ప్రేమ వ్యవహారం.. యువకుడిపై దాడి | gang attack of man for love affair | Sakshi
Sakshi News home page

ప్రేమ వ్యవహారం.. యువకుడిపై దాడి

Published Fri, May 12 2017 10:48 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

ప్రేమ వ్యవహారం.. యువకుడిపై దాడి

ప్రేమ వ్యవహారం.. యువకుడిపై దాడి

అనంతపురం సెంట్రల్‌ : నగరంలో సుభాష్‌రోడ్డు నామాటవర్స్‌ సమీపంలో ఓ వ్యక్తిపై శుక్రవారం విచక్షణా రహితంగా దాడి చేయడం కలకలం సృష్టించింది. పోలీసుల వివరాల మేరకు.. నల్లచెరువు మండలానికి చెందిన లక్ష్మీపతినాయుడు నగరంలో భైరవనగర్‌లో నివాసముంటున్నాడు. అదే మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి బంధువు కుమార్తెను సంవత్సర కాలంగా ప్రేమించాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు వేరే యువకుడితో వివాహం నిశ్చయించారు.

శుక్రవారం సుభాష్‌రోడ్డులోని హరిప్రియ ఫంక్షన్‌హాల్లో వివాహం జరిపించారు. విషయం తెలుసుకున్న లక్ష్మీపతినాయుడు శుక్రవారం ఉదయం ఫంక్షన్‌హాల్‌ సమీపంలో మాటు వేశాడు. గమనించిన వధువు తరుఫు బంధువులు కత్తులు, రాడ్లతో అతడిపై దాడి చేశారు. ఇష్టానుసారం  చితకబాదారు. క్షతగాత్రున్ని స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ వెంకటరమణ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితుడితో ఫిర్యాదు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement