టొరంటో: కెనడాలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న భారతీయ విద్యార్థి ఒకరు దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని కరీంపూర్ చావ్లా గ్రామానికి చెందిన గుర్విందర్ నాథ్(24) టొరంటోలోని బ్రామ్‌టన్‌లో ఉంటూ బిజినెస్ స్కూల్‌లో చదువుకుంటున్నాడు. పిజ్జా డెలివరీ బాయ్‌గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మిస్సిస్సౌగాలో ఈ నెల 9న అర్థరాత్రి దాటాక 2.10 గంటల సమయంలో నాథ్ ఒక ఇంట్లో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు.
తిరిగి వస్తుండగా కొందరు దుండగులు తీవ్రంగా కొట్టి అతడి దగ్గరున్న విలువైన వస్తువులతోపాటు, కారును తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన నాథ్‌ను చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 14న నాథ్ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచాడు. దుండగులు అతడి కారును అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో వదిలేసి వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ కారులో పలు ఆధారాలు లభ్యమైనట్లు చెప్పారు. నాథ్, దుండగులకు మధ్య గతంలో ఎటువంటి పరిచయం లేదన్నారు.
అతడి కారు ఎత్తుకెళ్లేందుకే దుండుగులు పిజ్జా డెలివరీ చేసినట్లుగా భావిస్తున్నామన్నారు. ఘటనపై టొరంటోలోని భారత్ కాన్సుల్ జనరల్ సిద్ధార్థ నాథ్ విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామన్నారు. ఈ నెల 27న నాథ్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2021 జులైలో కెనడా వెళ్లిన నాథ్ చివరి సెమిస్టర్‌లో ఉన్నాడని, చదువు పూర్తయ్యాక సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఎన్నో కలలు కన్నాడని అతడి స్నేహితులు తెలిపారు. ఆదివారం నాథ్ స్మత్యర్థం సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు మిస్సిసౌగాలో కొవ్వొత్తులతో నివాళులరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment