pizza delivery man
-
కెనడాలో హత్యకు గురైన భారతీయ విద్యార్థి
టొరంటో: కెనడాలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న భారతీయ విద్యార్థి ఒకరు దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని కరీంపూర్ చావ్లా గ్రామానికి చెందిన గుర్విందర్ నాథ్(24) టొరంటోలోని బ్రామ్టన్లో ఉంటూ బిజినెస్ స్కూల్లో చదువుకుంటున్నాడు. పిజ్జా డెలివరీ బాయ్‌గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మిస్సిస్సౌగాలో ఈ నెల 9న అర్థరాత్రి దాటాక 2.10 గంటల సమయంలో నాథ్ ఒక ఇంట్లో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా కొందరు దుండగులు తీవ్రంగా కొట్టి అతడి దగ్గరున్న విలువైన వస్తువులతోపాటు, కారును తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన నాథ్‌ను చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 14న నాథ్ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచాడు. దుండగులు అతడి కారును అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో వదిలేసి వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ కారులో పలు ఆధారాలు లభ్యమైనట్లు చెప్పారు. నాథ్, దుండగులకు మధ్య గతంలో ఎటువంటి పరిచయం లేదన్నారు. అతడి కారు ఎత్తుకెళ్లేందుకే దుండుగులు పిజ్జా డెలివరీ చేసినట్లుగా భావిస్తున్నామన్నారు. ఘటనపై టొరంటోలోని భారత్ కాన్సుల్ జనరల్ సిద్ధార్థ నాథ్ విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామన్నారు. ఈ నెల 27న నాథ్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2021 జులైలో కెనడా వెళ్లిన నాథ్ చివరి సెమిస్టర్లో ఉన్నాడని, చదువు పూర్తయ్యాక సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఎన్నో కలలు కన్నాడని అతడి స్నేహితులు తెలిపారు. ఆదివారం నాథ్ స్మత్యర్థం సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు మిస్సిసౌగాలో కొవ్వొత్తులతో నివాళులరి్పంచారు. -
పిజ్జా డెలివరీ బాయ్ ప్రాణాలమీదకు తెచ్చిన రూ.200 చిరిగిన నోటు
లక్నో: చిరిగిపోయిన రూ.200 నోటు తీసుకునేందుకు నిరాకరించాడని పిజ్జా డెలివరీ బాయ్‌పై ఓ వ్యక్తి తుపాకితో కాల్చారు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. సచిన్ కశ్యప్(21) అనే యువకుడు పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో నదీమ్ తన ఫోన్లో పిజ్జా ఆర్డర్ చేశాడు. 11.30 నిమిషాలకు సచిన్ తన హహోద్యోగి రితిక్ కమార్తో కలిసి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఆర్డర్ ఇచ్చేసి పేమెంట్ కింద వారి నుంచి రూ.200 నోటును తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఇద్దరు కలిసి ఓ షాప్‌కు వెళ్లి కూల్‌డ్రింక్ తీసుకున్నారు. అక్కడ కస్టమర్ ఇచ్చిన రూ. 200 నోటును షాప్ యాజమానికి ఇవ్వగా అతని ఈ నోటు చిరిగిపోయిందని తీసుకోను అన్నాడు. దీంతో వెంటనే ఇద్దరు మళ్లీ నదీమ్ వద్దకు వచ్చి వేరే నోటు ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ నదీమ్ మరో నోటు ఇవ్వకుండా వారిపై సీరియస్ అయ్యాడు. ఇంతలోనే ఇంట్లో నుంచి నదీమ్ సోదరుడు వచ్చి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో సచిన్‌పై కాల్పులు జరిపాడు. గన్ పేల్చిన శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన వెంటనే బాధితుడు సచిన్ కశ్యప్‌ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బరేలీలోని ప్రత్యేక వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. నదీమ్(27), అతని సోదరుడు నయీమ్ (29)ను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఆకాశంలో 175 సార్లు రివవర్స్ స్పిన్నింగ్.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకొని -
మంటల్లో కాలిపోతున్న ఇల్లు.. హీరోలా పిల్లల్ని కాపాడిన పిజ్జా డెలివరీ బాయ్
వాషింగ్టన్: అర్ధరాత్రి మంటల్లో కాలిపోతున్న ఇంట్లోకి ప్రాణాలకు తెగించి వెళ్లాడు ఓ పిజ్జా డెలివరీ బాయ్. అందులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడాడు. ఈ క్రమంలో అద్దాలు పగలగొట్టి మరీ మొదటి అంతస్తు నుంచి దూకి చేతికి గాయం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ యువకుడు చేసిన సాహసాన్ని పోలీసులు సహా స్థానికులు కొనియాడారు. పిజ్జా డెలివరీ బాయ్ హీరో అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అమెరికా లఫయెట్టెలో ఈ ఘటన గతవారం జరిగింది. హీరోగా పేరు తెచ్చుకున్న ఈ యువకుడి పేరు నికోలస్ బోస్టిక్. వయసు 25 ఏళ్లు. పిజ్జాలు డెలివరీ చేసి అర్ధరాత్రి ఇంటికి తిరిగివెళ్తున్నప్పుడు ఓ ఇంట్లో నుంచి మంటలు రావడం గమనించాడు. వెంటనే పెద్దగా అరుస్తూ ఆ ఇంటి బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్లాడు. ఇతని అరుపులు విని ఇంట్లో మొదటి అంతస్తులో నిద్రపోతున్న నలుగురు పిల్లలు లేచారు. బోస్టిక్ వాళ్ల దగ్గరకు వెళ్లి కిందకు తీసుకొస్తుండగా.. మరో ఆరేళ్ల చిన్నారి లోపలే ఉన్నట్లు వాళ్లు చెప్పారు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బోస్టిక్ మంటల్లోనే గదిలోపలికి వెళ్లాడు. అయితే ఆ పిల్లాడు గ్రౌండ్ ఫ్లోర్లో ఏడుస్తూ కన్పించాడు. దీంతో కిటికీ అద్దాలను చేతితోనే పగలగొట్టి కిందకు దూకాడు బోస్టిక్. ఆరేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురిని సురక్షితంగా కాపాడాడు. ప్రాణాలతో బయటపడ్డవారిలో 18 ఏళ్లు, 13 ఏళ్లు, ఏడాది వయసున్న చిన్నారి కూడా ఉన్నారు. బోస్టిక్ సహసాన్ని పోలీసులు కొనియాడారు. అతను నిస్వార్థంగా ఆలోచించి ఐదుగురి ప్రాణాలను కాపాడాడని ప్రశంసించారు. అతను రియల్ హీరో అని పొగడ్తలతో ముంచెత్తారు. పోలీసు శాఖ తరఫున అతనికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోనూ ట్విట్టర్లో షేర్ చేశారు. Here’s the video to go along with the story. pic.twitter.com/TvZ5wzCg1f — LafayetteINPolice (@LafayetteINPD) July 15, 2022 చదవండి: రన్ వేపై దిగుతూ మరో విమానాన్ని ఢీకొట్టిన ఫ్లైట్.. నలుగురు మృతి -
ట్రాఫిక్ జామ్.. నెలకు రూ.2లక్షల ఆదాయం
మనం ఎప్పుడైనా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే ఏం చేస్తాం.. ఆలస్యం అవుతుందని సణుగుతూ అక్కడినుంచి తప్పించుకునేందుకు వేరే రూటు ఉందేమోనని వెతుకుతాం. కొందరైతే ఎటూ వెళ్లలేని పరిస్థితిలో అక్కడే ఉండి చిరాకుపడుతూ ఉంటారు. కానీ థానేకు చెందిన గౌరవ్ లోండే ఒకసారి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయినప్పుడు ఒక మంచి బిజినెస్ ఐడియాను ఆలోచించి.. నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఓ రోజు గౌరవ్ ముంబై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో నాలుగు గంటలపాటు ట్రాఫిక్‌లోనే ఉండాల్సి వచ్చింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆ సమయంలో అటుగా వేయించిన బఠానీలు విక్రయిస్తున్న వ్యకిని గౌరవ్ చూశాడు. అదిచూసిన గౌరవ్‌కు ఓ ఆలోచన వచ్చింది. బఠానీలు అమ్మినట్టే ట్రాఫిక్‌జామ్‌లో వడా పావ్ అమ్మితే ఎలా ఉంటుంది? అనే ఐడియా తట్టింది తనకు. అనుకున్నదే తడవుగా తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి 2019 జులైలో ‘ట్రాఫిక్ వడా పావ్’ బిజినెస్‌ను ప్రారంభించాడు. నాణ్యతే గాకుండా ఫ్రెష్‌గా టేస్టీగా ఉండే వడా పావ్ ప్యాకెట్‌తోపాటు ఒక చిన్న వాటర్ బాటిల్‌ను కూడా దానికి జతచేసి అమ్మడం ప్రారభించాడు. వడాపావ్ ప్యాకెట్ ధరను రూ.20లుగా నిర్ణయించి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సాయంకాల సమయంలో 5 గంటల నుంచి 10 గంటల మధ్య వడాపావ్‌ను విక్రయించడం ద్వారా నెలకు 2 రూ లక్షల వరకు సంపాదిస్తున్నాడు. (చదవండి: ట్రాఫిక్‌లో 40 గంటలు నరకయాతన..!) ‘‘2009లో నేను పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడిని. సాయంత్రం 5:30 నుంచి 6 గంటలలోపు నా వర్క్ పూర్తయ్యేది. అప్పుడు అక్కడ నుంచి ఇంటికి రావడానికి ఒక గంట సమయం పట్టేది. ఈ క్రమంలో ఎన్నోసార్లు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయేవాడ్ని. ఆ సమయంలో నాకు విపరీతం గా ఆకలి వేసేది. తినడానికి ఏమీ ఉండేది కాదు. 10 ఏళ్ల తరువాత 2019లో ట్రాఫిక్ వడా పావ్ పెట్టడానికి ఈ అనుభవం కూడా ఒక ప్రేరణ అని 30 ఏళ్ల గౌరవ్ చెప్పాడు. ఇంట్లో అమ్మచేసే వడాపావ్ చాలా రుచిగా ఉంటుంది. ఆ వడాపావ్నే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అమ్మితే క్లిక్ అవుతుందనిపించింది. అందుకే ఐడియా రాగానే ధైర్యంగా ముందుకుసాగానని గౌరవ్ చెప్పాడు. గౌరవ్ అమ్మ 52 ఏళ్ల రంజన మాట్లాడుతూ.. స్థిరంగా... నెలకు రూ. 35,000 వచ్చే ఉద్యోగాన్ని మానేయడం సరైన నిర్ణయం కాదనిపించింది. పైగా ఇప్పటికే చాలామంది వడాపావ్ బిజినెస్ చేస్తున్నారు. మేము ఈ పోటీలో నెగ్గుకు రాగలమా..? అనిపించింది కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చి వ్యాపారం ప్రారంభించేందుకు సాయం చేశాను. మొదట్లో నేను వడాపావ్ తయారు చేసి ఇస్తే గౌరవ్ భార్య వాటిని ప్యాక్ చేయడంలో సాయం చేసేది. మొదటి రోజు గౌరవ్ 50 వడాపావ్‌లను అమ్మడానికి ట్రాఫిక్ జంక్షన్ల్ వద్దకు వెళ్లాడు. ఎవరూ కొనలేదు. ఇది ఇలానే మరో ఐదు రోజులపాటు కొనసాగింది. ఆ తరువాత గౌరవ్ తన మిత్రుల సాయంతో వడాపావ్‌లను అమ్మడం మొదలు పెట్టాడు. ఆ తరువాతి వారం గౌరవ్ ఫోన్ చేసి ఇంకొన్ని వడాపావ్‌లు తయారు చేసి ఇవ్వమన్నాడు. అలా ఆ ఒక్కరోజే 100 వడాపావ్‌లను అమ్మాము. అప్పటినుంచి ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బిజినెస్ అలా ముందుకు సాగిపోతోంది. ప్రస్తుతం రోజుకి 800 వడాపావ్‌లు అమ్మడం ద్వారా నెలకు రూ.2 లక్షలు ఆర్జిస్తున్నట్లు సంతోషంతో చెప్పారు. (చదవండి: గూగుల్‌నే ఫూల్ చేశాడు!) ఐడియాలు... అందరికీ వస్తాయి. అయితే వాటిని అమలు చేయడంలోనే ఉంది అసలు కిటుకు. గౌరవ్‌కి ఐడియా వచ్చింది... దానిని ఆచరణలో పెట్టాడు. మొదట్లో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. ఆ తర్వాత నిలదొక్కుకున్నాడు. కాస్త వ్యాపారం పుంజుకున్నాక గౌరవ్ ఒక షాపును అద్దెకు తీసుకుని, రూ.6000 వేతనంతో 8 మంది డెలివరీ బాయ్స్‌ను నియమించుకున్నాడు. వీళ్లంతా ఒక యూనిఫామ్ వేసుకుని వడాపావ్‌ను విక్రయిస్తున్నారు. సంకల్పం గట్టిదైతే సాధ్యం కానిది ఏది లేదని గౌరవ్ సక్సెస్ స్టోరీ మనకు చెప్పకనే చెబుతోంది. – పోకల విజయ దిలీప్ -
పిజ్జా లేటయిందేంటి అన్నందుకు పొడిచేశాడు!
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో డొమినోస్ పిజ్జాకు చెందిన ఓ డెలివరీ ఉద్యోగి వినియోగదారున్ని కత్తితో పొడిచాడు. పిజ్జా ఆలస్యంగా తీసుకురావడంపై గొడవ జరగడంతో అతను దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కాలిఫోర్నియాలోని గ్లెన్ డోరాకు చెందిన మైఖేల్ చార్లెస్ (31)ను పోలీసులు అరెస్టు చేశారు. పిజ్జా డెలివరీ లేట్ అయినందుకు గొడవ జరగడంతో అతను 20 ఏళ్ల వ్యక్తిని పొడిచాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని, అయితే ప్రాణాపాయం లేదని చెప్పారు. కాలిఫోర్నియాలోని కొవిన్ లో శనివారం ఈ ఘటన జరిగింది. మెడపై, మణికట్టుపై గాయాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అరెస్టైన నిందితుడు 30వేల డాలర్ల పూచీకత్తు బెయిల్ పై విడుదలయ్యాడు. అతనిపై మార్చ్ 21న పోలీసులు అభియోగాలు నమోదుచేయనున్నారు. -
పిజ్జా డెలివరీకి వెళ్లి.. దారుణం
న్యూఢిల్లీ: ఓ ప్రముఖ కంపెనీకి చెందిన పిజ్జా డెలివరీ మెన్ దారుణానికి పాల్పడ్డాడు. ఆర్డర్ ఇచ్చిన ఇంటికి పిజ్జా ఇచ్చేందుకు వెళ్లి ఐదేళ్ల పాపపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పాప కేకలు వేయడంతో పారిపోయాడు. పోలీసుల సమాచారం ప్రకారం అమిత్ అనే పిజ్జాను డెలివరీ చేసే వ్యక్తి ఆదివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో దక్షిణ ఢిల్లీలోని ఓ ఇంటికి పిజ్జా ఇచ్చేందుకు వెళ్లాడు. మూడో అంతస్తులో పిజ్జా ఇచ్చి వస్తుండగా అతడికి గ్రౌండ్ ఫ్లోర్లో ఓ ఐదేళ్ల పాప కనిపించింది. వెంటనే అతడు బాల్కనీలో లైట్లు ఆపేసి పాపపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పాప కేకలు వేయడంతో అక్కడ ఉన్న వాచ్మెన్ అలారం మోగించగా అతడు పారిపోయాడు. అనంతరం పాప తన తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని వివరించింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు సదరు కంపెనీకి కూడా సమాచారం అందించారు.